దీపావళి సమయంలో ఇలాంటి కలలు పడటం శుభప్రదం

First Published | Oct 31, 2023, 4:43 PM IST

దీపావళి పండుగను చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా ఎంతో ఘనంగా జరుపుకుంటాం. దీపావళి రోజున రాముడు 14 ఏండ్ల పాటు వనవాసం పూర్తి చేసుకుని రావణుడిని ఓడించి సీతాదేవి, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడని నమ్ముతారు. అయితే దీపావళి సమయంలో కొన్ని కలలు పడటం శుభప్రదంగా భావిస్తారు. మరి ఎలాంటి కలలు పడితే మంచిదంటే?
 

హిందూమతంలోని ఎంతో ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఈ పండుగను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో దీపావళి పండుగను ఏకంగా ఐదు రోజుల పాటు సెలబ్రేట్ చేకుంటారు తెలుసా? దీపావళిని చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి దీపావళి ప్రతీకగా జరుపుకుంటారు. ఈ రోజే శ్రీరాములు తన తన 14 సంవత్సరాల వనవాసాన్ని ముగించుకుని భార్య సీతా, తమ్ముడు లక్ష్మణుడితో తిరిగి అయోధ్యకు వచ్చాడని నమ్ముతారు. ఇంకా పండుగకు కొన్ని రోజులే ఉంది. ఇలాంటి సమయంలో కొన్ని కలలు పడటం శుభప్రదంగా భావిస్తారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

లక్ష్మీదేవి

డ్రీమ్ సైన్స్ ప్రకారం.. దీపావళి రోజు మీ కలలో లక్ష్మీదేవి కనిపిస్తే మీరెంతో లక్కీ. ఎందుకంటే లక్ష్మీదేవి కలలో కనిపించడాన్ని ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ కల మీకు పడింతే మీ అదృష్టం మారబోతోందనట్టే. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక బాధలుండవు. లక్ష్మీదేవి మీ కలలో కనిపించందంటే మీ సంపద పెరగబోతుందని అర్థం. అందుకే అమ్మవారిని నిష్టగా పూజించాలి. 


కలశం

కలశాన్ని పవిత్రమైన వస్తువుగా భావిస్తారు. ఒకవేళ మీ కలలో కలశం కనిప్తే అది మీకు శూభసూచకమంటున్నారు జ్యోతిష్యులు. ఈ కల మీకు పడిందంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుందని అర్థం. అమ్మవారి అనుగ్రహంతో మీరు పురోభివృద్ధి సాధిస్తారు. అలాగే మీకున్న సమస్యల నుంచి కూడా బయటపడతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

తామర పువ్వు

దీపావళి సందర్భంగా కలలో తామర పువ్వు కనిపించడం కూడా శుభప్రదం. ఎందుకంటే తామర పువ్వును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తాం. అంటే ఈ దీపావళి మీకు ఎన్నో ప్రయోజనాలను కలిగించబోతుందన్నమాట. అందుకే ఈ సమయంలో మీరు లక్ష్మీదేవిని నిష్టగా పూజించాలి. అయితే ఈ శుభ కలలను ఎవ్వరితోనూ చెప్పకూడదట. ఎందుకంటే కల శుభ ప్రభావం తగ్గుతుందని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు. 

Latest Videos

click me!