దీపావళి రోజు రాత్రిపూట ఈ పని అస్సలు చేయకండి. లేదంటే ఎంతో నష్టపోతారు

First Published | Nov 2, 2023, 2:50 PM IST

diwali 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం.. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య నాడు దీపావళి పండుగను జరుపుకుంటాం. ఈ ఏడాది దీపావళి పండుగను నవంబర్ 12 నాడు జరుపుకోబోతున్నాం. దీపావళి నాడు లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి భక్తుల కోర్కెలు తీరుస్తుందని ప్రతీతి. అందుకే దీపావళి రోజు రాత్రి పూట ఈ పనులను అస్సలు చేయకూడదు. 


హిందూ మతంలో దీపావళి పండుగ ఎంతో ప్రత్యేకమైంది. ఎంతో పవిత్రమైంది. అందుకే ఈ పండుగను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. దీపావళి పర్వదినాన  లక్ష్మీదేవితో పాటుగా వినాయకుడిని కూడా పూజిస్తారు. దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే భక్తులో జీవితంలోని అన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. అలాగే ఇంట్లో సిరి, సంపదలు పెరుగుతాయని చెప్తారు. అయితే దీపావళి నాడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ రోజు రాత్రి కొన్ని పనులకు దూరంగా ఉండాలి. అవేంటంటే?
 


ఇంట్లో చెత్త..

మత విశ్వాసాల ప్రకారం.. లక్ష్మీదేవి పరిశుభ్రంగా ఉండే ప్రదేశంలోనే నివసిస్తుంది. అందుకే దీపావళికి ముందే ఇంటిని శుభ్రం చేస్తారు. అయితే పనులతో తీరికలేని వారు దీపావళి రోజు రాత్రి ఇల్లును క్లీన్ చేస్తుంటారు. కానీ ఈ రోజు రాత్రి ఇంట్లోని చెత్తను ఊడ్చడం లేదా బయటపారేయడం అస్సలు చేయకూడదట. ఎందుకంటే ఇలా దీపావళి రోజు రాత్రి ఇంట్లోని చెత్తను పారేయడం వల్ల మీ ఇంట్లో సుఖసంతోషాలు మటుమాయ అవుతాయి. సౌభాగ్యం కూడా పోతుందని నమ్ముతారు. అందుకే ఈ పని చేయకండి. 
 


మద్యపానం

దీపావళి రోజున కూడా చాలా మంది స్మోకింగ్ చేయడంతో పాటుగా, ఆల్కహాల్ ను తాగుతుంటారు. ఇలాంటి పనులను దీపావళి రోజు చేయకూడని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందట. దీంతో అమ్మవారు మీ ఇంట్లోకి రాదట. అంతేకాదు మీకు ఎన్నో డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయనంటున్నారు జ్యోతిష్యులు. 
 

ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు

హిందూ పురాణాల ప్రకారం.. మందు తాగే ఇంట్లో  లక్ష్మీదేవత ఎప్పుడూ నివసించదని నమ్ముతారు. అలాగే మహిళలను గౌరవించని ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి రాదట. అందుకే కాబట్టి దీపావళి రోజున ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఈ రోజు నిష్టగా అమ్మవారిని పూజించండి. చేయకూడని పనులను చేయకండి. ఈ నియమాలను పాటిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుంది. మీ ఇంట్లో డబ్బుకు కొదవే ఉండదు.

Latest Videos

click me!