అసలు దీపావళి నవంబర్ 11 లేదా 12 ? కరెక్టు తేదీ ఏదంటే?

First Published | Nov 2, 2023, 2:03 PM IST

diwali 2023: సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఒకే చోట ఎక్కువ సేపు ఉండరు. అందుకే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవతను పూజిస్తారు. అలాగే దీపావళి నాడు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇంట్లో ఆదాయం, సంతోషం, అదృష్టం, ఐశ్వర్యం పెరుగుతాయని నమ్మకం ఉంది.
 


diwali 2023: సనాతన ధర్మంలో దీపావళికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ దీపావళి పండును ప్రతి ఏడాది కార్తీక మాసం అమావాస్య రోజున జరుపుకుంటాం. ఈ రోజు ఎంతో పవిత్రమైనది. అందుకే దీపావళి నాడు లక్ష్మీదేవిని, వినాయకుడిని పూజిస్తారు. అనుకున్న పనిలో విజయం సాధించడానికి దీపావళి నాడు చాలా మంది అమ్మవారికి పూజ చేసే వరకు ఉపవాసం కూడా ఉంటారు. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు రావు. అందుకే ప్రతి శుక్రవారం నాడు మరువకుండా అమ్మవారికి పూజలు చేస్తారు. ముఖ్యంగా దీపావళి నాడు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారి అనుగ్రహం ఉంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవు. అలాగే మీ సంపద పెరుగుతుంది. అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. మీ సంతోషం, అదృష్టం, ఐశ్వర్యం పెరుగుతాయని పురాణాలు చెబుతున్నారు. 
 

అయితే ఈ ఏడాది కార్తీక మాసంలో కృష్ణ పక్షం చతుర్దశి నవంబర్ 11 న ప్రారంభమవుతుంది. అందుకే దీపావళి నవంబర్ 11 లేదా 12? అని జనాలు అయోమయానికి గురవుతున్నారు. మరి దీపావళి కరెక్టు తేది, శుభ సమయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Latest Videos


శుభ సమయం

పంచాంగం ప్రకారం.. కార్తీక మాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి తిథి నవంబర్ 11 న మధ్యాహ్నం 01:57 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా ఇది నవంబర్ 12 న మధ్యాహ్నం 02:44 గంటలకు ముగుస్తుంది. ఆ తర్వాత అమావాస్య తేదీ స్టార్ట్ అవుతుంది. కార్తీక మాసంలోని అమావాస్య తిథి నవంబర్ 12 మధ్యాహ్నం 02:44 గంటలకు ప్రారంభమై నవంబర్ 13 న మధ్యాహ్నం 02:56 గంటలకు ముగుస్తుంది. సనాతన ధర్మంలో ఉదయించిన తేదీని పరిగణిస్తారు. కాబట్టి దీపావళి తిథి నాడు ప్రదోష సమయంలో  లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ లెక్కన చూస్తే  మనం దీపావళిని నవంబర్ 12నే జరుపుకోవాలి. 
 

పూజ సమయం

జ్యోతిష్కుల ప్రకారం.. కార్తీక మాసంలోని కృష్ణపక్షం అంటే దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అంతా మంచే జరుగుతుంది. 12 న సాయంత్రం 05:39 నుంచి రాత్రి 07:35 వరకు అమ్మవారిని పూజించొచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే మీకు సౌభాగ్యం కలుగుతాయి. సంపదకు లోటు ఉండదు. అలాగే ఈ సమయంలోనే వినాయకుడిని కూడా పూజించాలి.  దీంతో మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

click me!