సాధారణంగా దేవాలయం అంటేనే ఇళ్లకంటే పెద్దదిగా ఉంటాయి. వాటి గాలి గోపురాలు అపార్ట్‌మెంట్స్ కంటే ఎత్తుగా ఉంటాయి. వాటి గోపురాలు, ప్రాకారాలు భారీగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో పురాతన ఆలయాలు చూస్తే ఆ కాలంలో ఇంత పెద్ద గుడులను ఎలా కట్టారని ఆశ్చర్యం వేస్తుంటుంది. ఇలాంటి పురాతన ఆలయాలు ఇప్పటికీ చాలా గ్రామాలు, పట్టణాల్లో కనిపిస్తుంటాయి. ఇప్పుడు బాగా ఫేమస్ అయిన తిరుపతి, శ్రీశైలం, ఒంటిమిట్ట, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాల ఆలయాలు కూడా వందల ఏళ్ల క్రితం నిర్మించినవే. వాటి నిర్మాణాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అపట్లో వారు వాడిన టెక్నాలజీ ఏంటో కూడా అర్థం కాక ఇప్పటి ఇంజినీర్లు తలలు పట్టుకుంటారు.
ఇలాంటి ఓ గొప్ప ఆలయం మన ఇండియాలో ఉంది. ఆ ఆలయం ఎంత ఉంటుంది అంటే ప్రపంచంలో ఓ దేశం కంటే పెద్దదిగా ఉంటుంది. ఆ దేవాలయం విస్తీర్ణంలోనే కాదు జనాభాలోనూ ఆ దేశ జనాభాను దాటేసింది. ఆ పుణ్యక్షేత్రంలో నివసించేందుకు జనం పోటీపడుతుంటారు.
ఆ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో శ్రీరంగం పట్టణంలో ఉంది. అక్కడ ఉన్న శ్రీరంగనాథ స్వామి ఆలయం ప్రపంచంలో వాటికన్ సిటీ అనే దేశం కంటే పెద్దదిగా ఉంటుంది. వాటికన్ సిటీ 109 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. అయితే శ్రీరంగనాథ స్వామి ఆలయం 156 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు. ఆయన రంగనాథ స్వామి రూపంలో ఇక్కడ కొలువుదీరారని భక్తులు నమ్ముతారు.
దక్షిణ భారతదేశంలో పురాతనమైన, చాలా ఫేమస్ అయిన వైష్ణవ సంప్రదాయ ఆలయాల్లో శ్రీరంగనాథ స్వామి ఆలయం ఒకటి. ఈ దేవాలయాన్ని ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటారు. ఈ దేవాలయం 156 ఎకరాల్లో 4,116 మీటర్ల చుట్టుకొలతతో భారతదేశంలోనే అతి పెద్ద ఆలయంగా నిలిచింది. దీనికి ఏడు కాంపౌండ్ గోడలు ఉన్నాయి. ఈ ప్రహరీలను ఆ కాలంలోనే చాలా స్ట్రాంగ్ గా నిర్మించారు. వీటిల్లో ఒకటి ప్రపంచంలోనే అతి పెద్ద కాంపౌండ్ వాల్ ఉన్న దేవాలయంగా నిలిచింది.
శ్రీరంగనాథ స్వామి ఆలయానికి ఉన్న 7 కాంపౌండ్ గోడల్లో చివరి రెండు ప్రకారాల లోపలే ప్రజలు ఇళ్లు కట్టుకొని నివసిస్తున్నారు. ఈ దేవాలయంలో మొత్తం 21 గోపురాలున్నాయి. ఇందులో ఉన్న ఒక రాజగోపురానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది. అది ప్రపంచంలోనే రెండవ పెద్ద రాజగోపురంగా రికార్డుల్లో నిలిచింది. ఈ గోపురం ఎత్తు 237 అడుగులు. ఈ గోపురానికి 11 అంతస్తులు ఉంటాయి. అదేవిధంగా ఈ టెంపుల్ లో మొత్తం 25,000 శిల్పాలు చెక్కారు. వాటి నిర్మాణ శైలిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. శతాబ్దాల క్రితమే ఎటువంటి టెక్నాలజీ లేకుండా ఇంత గొప్పగా శిల్పాలు ఎలా చెక్కారో అర్థం చేసుకోవడం చాలా కష్టం.
ఇవి కాకుండా సుమారు 600 శాసనాలు ఈ ఆలయంలో కనిపిస్తాయి. అవి ఏ రాజులు ఎలాంటి అభివఈద్ధి పనులు చేశారో ఇక్కక క్లియర్ గా ఉంటుంది. మీరూ ఓసారి ఈ టెంపుల్ ని చూసి వచ్చేయండి.