జ్యోతిష్యం ప్రకారం బ్లాక్ కలర్ ఎంత మంచిదో తెలుసా?

First Published | Nov 23, 2024, 1:24 PM IST

హిందూ సాంప్రదాయంలో ప్రతి రంగుకు ఓ ప్రత్యేకత ఉంటుంది. పురాణాల ప్రకారం కూడా ఒక్కో దేవుడు ఒక్కో రంగుకు ప్రతీకగా నిలుస్తారు. నలుపు రంగుకు కూడా శని దేవుడు అధిపతి అని జ్యోతిష్య శాస్త్రంలో ఉందని పండితులు చెబుతున్నారు. అందుకే శనివారం ప్రత్యేకంగా శనీశ్వరుడికి ఇష్టమైన రోజుగా మారిందని చెబుతారు. అలాంటి శనివారం నాడు నల్లని వస్త్రాలు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
 

వివిధ రంగులకు జ్యోతిష్యానికి చాలా అనుబంధం ఉంది. ఇవి ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా ఉపయోగపడతాయని ప్రఖ్యాత జ్యోతిష్యులు చెబుతున్నారు. నలుపు రంగును కొందరు చెడుగా భావిస్తారని, కాని వాస్తవానికి నలుపు రంగు ఎంతో మంచి చేస్తుందని అంటున్నారు. అందువల్లనే ముఖ్యమైన వస్తువులు నల్ల రంగులోనే ఉంటాయి. ఈ రోజుల్లో చాలా కార్లు నలుపు రంగులో విడుదల అవుతుంటాయి. ఈ కలర్ కార్లే ఎక్కువగా ప్రజాదరణ పొందుతాయి. ప్రజలు వాటినే భారీ సంఖ్యలో కొనుగోలు చేస్తుంటారు. ప్రముఖులు కూడా ఎక్కువగా బ్లాక్ కలర్ సూట్స్ వేసుకొని కనిపిస్తుంటారు. 
 

శనివారం విషయానికొస్తే.. శనీశ్వరుడికి చాలా ఇష్టమైన వారం శనివారం. శనీశ్వరుడికి కూడా నలుపు ఇష్టమైన రంగు. అందువల్ల శనివారం నలుపు రంగు డ్రెస్ వేసుకుంటే ఆయన అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. శనీశ్వరుడి కరుణ వల్ల జీవితాల్లో కష్టాలు తొలగిపోతాయి. ఒక మనిషి లైఫ్ లో బాగా టాప్ పొజిషన్ కి వెళ్లాలన్నా, బాగా కింద స్థితికి పడిపోవాలన్నా అది శనీశ్వరుడి వల్లనే జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతారు. అందువల్ల ఆయన అనుగ్రహం పొందడం కోసం శనిదేవుడికి ఇష్టమైన శనివారం రోజు బ్లాక్ డ్రెస్ ధరించడం మంచిది. 
 


ఆధ్యాత్మిక పరంగా చూస్తే నలుపు రంగు చీకటిని సూచిస్తుంది.  అయితే అనేక శక్తులు చీకటిలో పుడతాయి. అసలు ఈ విశ్వానికి మూల దేవత అయిన మహాకాళి దేవి నల్ల రంగులోనే ఉంటుంది. ఆమె చీకటిని తొలగించి జీవితాల్లో తేజస్సును, కాంతిని ప్రసరింపజేస్తుంది.  దేవతా విగ్రహాలన్నీ ఎక్కువగా నలుపు రంగులోనే ఉంటాయి. ఎక్కువ శివలింగాలు కూడా నల్ల రాతిలో చెక్కినవే. 

నలుపు రంగు చెడుకు సంకేతమని చాలా మంది భావిస్తారు. కాని అది తప్పు అని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే నలుపు లేని ఈ విశ్వాన్ని ఊహించలేము. చీకటి ఉంటేనే కాంతి విలువ తెలుస్తుంది. చీకటిలోంచే కాంతి పుడుతుంది. అలాంటి చీకటిని తొలగించి కాంతిని అందించేవాడు శనీశ్వరుడు. కాబట్టి ఆధ్యాత్మికంగా జీవితాలు  ముందుకు సాగాలన్నా శనీశ్వరుడికి ఇష్టమైన నలుపు రంగు దుస్తులు తరచూ ధరించడం మంచిదని పండితులు అంటున్నారు. 
 

మీరు గమనిస్తే ప్రముఖులు ఎక్కువగా బ్లాక్ కలర్ సూట్స్, బ్లాక్ కలర్ దుస్తులు వేసుకుంటారు. దీని వెనుక కూడా ఆధ్యాత్మిక కారణాలు ఉంటాయి. వారి జాతక ప్రభావాల కారణంగా అలాంటి దుస్తులు వేసుకుంటారు. 

అంతేకాకుండా నలుపు రంగు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎక్కడ ఉన్నా నల్లగా ఉన్న వారు, బ్లాక్ కలర్ డ్రెస్సులు వేసుకున్న వారు అట్రాక్టివ్ గా కనిపిస్తారు. జనాకర్షణ పొందడానికి తరచూ బ్లాక్ డ్రెస్సులు వేసుకోవాలని, ముఖ్యంగా శనివారం తప్పకుండా వేసుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. శనివారం బ్లాక్ కలర్ డ్రెస్సులు, దుస్తులు వేసుకోవడం వల్ల కీర్తి, ప్రశంసలు పొందవచ్చని చెబుతున్నారు. దిష్టి దోషాలు, ప్రతికూల శక్తి నుండి తమను తాము రక్షించుకోవడానికి నల్ల దారం ధరించాలి.

Latest Videos

click me!