2025లో పెళ్లిళ్లే పెళ్లిళ్లు.. ఏడాది మొత్తం మీద ఎన్ని ముహూర్తాలు ఉన్నాయో తెలుసా?

First Published | Nov 22, 2024, 11:09 AM IST

మీ ఇంట్లో పెళ్లి వేడుకకు ప్లాన్ చేస్తున్నారా? కొత్త సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే 2025 సంవత్సరంలో పెళ్లిళ్ల ముహూర్తాలు చాలా ఉన్నాయి. ఈ సంవత్సరంలో శుభప్రదమైన తేదీలు, ముహూర్తాల గురించి ఇక్కడ వివరాలు ఉన్నాయి. ఓ సారి పరిశీలించండి. 
 

ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైన విషయం. ఇది ఇద్దరు వ్యక్తుల కలిసి జంటగా మారడమే కాదు.. జీవిత పయనంలో రెండు కుటుంబాలు కలిసి ఆనందంగా ప్రయాణించడం. ఇంత ముఖ్య విషయమైన పెళ్లకి హిందూ మతంలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకే జ్యోతిషశాస్త్రం ప్రకారం వివాహానికి మంచి ముహూర్తం చూసుకుంటారు. 

గ్రహాలు, నక్షత్రాలు, పంచాంగం ప్రకారం 2025 సంవత్సరంలో వివాహానికి చాలా అనుకూలమైన తేదీలు ఉన్నాయి. ఈ తేదీలు వైవాహిక జీవితాన్ని విజయవంతం చేయడానికి మాత్రమే కాకుండా కొత్తగా పెళ్లయిన జంటల జీవితం పరస్పర ప్రేమ, ఆప్యాయతలతో ఆనందంగా సాగేలా చేస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

సాధారణంగా వధూవరుల జాతకాలను పరిశీలించి వారిద్దరికీ అనుకూలమైన డేట్ ని పెళ్లి ముహూర్తంగా నిర్ణయిస్తారు. అయితే అందరికీ అనుకూలంగా ఉండే కొన్ని పెళ్లి వేడుక తేదీలు ఇక్కడ ఉన్నాయి. ఈ తేదీల్లో వివాహం ఏ వ్యక్తికి అయినా శుభం కలుగజేస్తుందని పండితులు చెబుతున్నారు. మరి 2025 సంవత్సరంలో ఏ నెలలో ఏ తేదీలు పెళ్లి ముహూర్తాలకు అనుకూలంగా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం రండి. 

జనవరి 2025లో వివాహానికి అనుకూలంగా ఉన్న కొన్ని తేదీలు ఇక్కడ ఉన్నాయి. ఈ నెల మకర సంక్రాంతి తర్వాత వివాహ ముహూర్తాలు మొదలవుతాయి. జనవరి 16, 17, 18, 19, 21, 22, 24 పెళ్లి వేడుకలకు అత్యంత అనుకూలమైన తేదీలు. 

Latest Videos


ఫిబ్రవరి 2025లో బసంత్ పంచమి పండుగ రోజు వివాహం చేసుకోవడం శుభప్రదంగా చెబుతారు. దీంతో పాటు ఫిబ్రవరి 7, 13, 14, 15, 18, 19, 20, 21, 25 తేదీలు ఉత్తమమైనవి. 

మార్చి నెలలో చలి తగ్గి ఎండలు మొదలయ్యే సమయం కావడంతో ఈ నెలలో ఎక్కువగా పెళ్లిళ్లు ప్లాన్ చేస్తుంటారు. మీరు మార్చి నెలలో వివాహం చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెల 1, 2, 6, 7, 12 తేదీలు అనుకూలమైనవి. 

ఏప్రిల్ నెల వివాహానికి చాలా పవిత్రమైనదిగా పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ పండుగ ఈ నెలలోనే ఏప్రిల్ 30 న వస్తుంది. అక్షయ తృతీయ రోజున శుభ ముహూర్తాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం లేకుండా వివాహం చేసుకోవచ్చు. ఇది కాకుండా ఈ నెలలో వివాహానికి 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. 

మే నెలలో 1, 5, 6, 8, 15, 17, 18 తేదీల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. 

జూన్ 1, 2, 4, 7వ తేదీలను వివాహానికి అనుకూల సమయాలుగా పండితులు గుర్తించారు. ఈ రోజుల్లో వివాహం చేసుకోవడం వల్ల వైవాహిక జీవితంలో శ్రేయస్సు, సంతోషం ఉంటుందని వారు చెబుతున్నారు.

జూలై 2025 నుండి అక్టోబర్ 2025 వరకు వివాహానికి ముహూర్తాలు లేవు. ఆ సమయంలో విష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉంటాడట. అందువల్ల ఆ సమయంలో పెళ్లిళ్లు చేసుకోరు. 
 

నవంబర్ నెలలో 2, 3, 6, 8, 12, 13, 16, 17, 18, 21, 22, 23, 25, 30 తేదీలు వివాహం చేసుకోవడం శుభప్రదం. మీరు ఈ తేదీల శుభ సమయాన్ని తెలుసుకొని ముహూర్తం పెట్టించుకోవచ్చు. 

డిసెంబరులో పెళ్లికి కొన్ని ప్రత్యేక తేదీలు ఫిక్స్ చేశారు. ఈ నెలలో 4, 5, 6వ తేదీలు వివాహానికి సానుకూల శక్తిని అందిస్తాయి.

వివాహాన్ని ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ పవిత్రమైన తేదీలతో పాటు మీకు అనుకూలమైన తేదీ, సమయాన్ని నిర్ణయించుకోండి. ముఖ్యంగా మీ కుటుంబ లేదా గ్రామ పురోహితుడిని సంప్రదించి వధూవరుల జాతకాలకు సరైన తేదీని నిర్ణయించుకోండి.

click me!