ఆచార్య చాణక్యుడు వివాహం, సమాజం, ఆర్థిక వ్యవస్థ, ప్రేమ ఇతర అంశాలపై విలువైన అభిప్రాయాలను అందించాడు. చాణక్య నీతి ప్రకారం, జీవితంలో విజయం, సంతోషం, ప్రశాంతత ఉండాలంటే మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలట. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
3 విషయాల్లో జాగ్రత్త అవసరం
చాణక్య నీతి ప్రకారం జీవితంలో మూడు విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం ముంచుకొస్తుందట. అలాగని ఎక్కువ దూరం పాటించద్దు. ఎక్కువ సాన్నిహిత్యం కూడా మంచిది కాదని చాణక్య నీతి చెబుతోంది. అవెంటో చూద్దాం.
స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి!
చాణక్య నీతి ప్రకారం స్త్రీలతో సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలతో ఎక్కువ సమయం గడిపితే ఇబ్బందుల్లో పడవచ్చని చాణక్య నీతి చెబుతోంది. అలాగని స్త్రీలకు దూరంగా ఉండటం కూడా మంచిది కాదు. వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటే మంచిదని చాణక్యుడు బోధించాడు.
ప్రభావితం చేసే వ్యక్తులతో జాగ్రత్త!
చాణక్య నీతి ప్రకారం మనల్ని ప్రభావితం చేసే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారితో శత్రుత్వం లేదా స్నేహం రెండూ మంచివి కావు. కాబట్టి వారి విషయంలో ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిదని చాణక్యుడు పేర్కొన్నాడు.
అగ్ని విషయంలో జాగ్రత్తగా ఉండాలి!
చాణక్య నీతి ప్రకారం అగ్ని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్నికి చాలా దగ్గరగా వెళ్లకూడదు. అలాగని చాలా దూరంగా కూడా ఉండకూడదు. సురక్షితమైన దూరం పాటించాలి.