దేవుళ్ల దేవుడైన శివుడికి సోమవారం ఎంతో ప్రీతికరమైంది. ఈ రోజు శివపార్వతులను నిష్టగా పూజిస్తారు. అంతేకాదు చాలా మంది భక్తులు ఈ రోజు ఉపవాసం కూడా ఉంటారు. ఈ ఉపవాసం వల్ల యోగ్యత, మహిమతో కోరికలన్నీ నెరవేరుతాయనే నమ్మకం ఉంది. అంతేకాదు ఇంట్లో సంతోషం, సౌభాగ్యం, శాంతి కూడా కలుగుతాయి. 2024 సంవత్సరం మొదటి రోజు సోమవారం అవుతుంది. అందుకే జనవరి 1న శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇందుకోసం చాలా శివాలయాలను ఇప్పటి నుంచే అలంకరిస్తారు. మీరు కూడా సంతోషం, అదృష్టం, సంపదను పెంచుకోవాలనుకుంటే కొత్త సంవత్సరం మొదటి రోజున స్నానం చేసి ధ్యానం చేయండి. అలాగే ఆచారాలతో శివుడిని పూజించండి. అంతేకాదు ఈ రోజు శివునికి సంబంధించిన మూడు వస్తువులను కూడా ఇంటికి తీసుకురండి. ఇది మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మరి కొత్త సంవత్సరం మొదటిరోజు ఇంటికి ఏం తీసుకురావాలో ఇప్పుడు తెలుసుకుందాం..