పెద్దలకు నమస్కరిస్తే గ్రహ దోషాలు పోతాయని మీకు తెలుసా? హిందూ సంప్రదాయం ఎంత గొప్పదో చూడండి

Published : Jan 29, 2025, 03:51 PM IST

పెద్దలకు నమస్కారం చేయడం హిందూ మతంలో చాలా ముఖ్యమైన సంప్రదాయం. పాదాభివందనం చేయడం అంటే పెద్దలను గౌరవించడం అని మాత్రమే అని చాలా మంది అనుకుంటారు. కానీ అనేక గ్రహ దోషాలు కూడా పోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి.   

PREV
15
పెద్దలకు నమస్కరిస్తే గ్రహ దోషాలు పోతాయని మీకు తెలుసా? హిందూ సంప్రదాయం ఎంత గొప్పదో చూడండి

పాదాభివందనం చేయడం వల్ల గ్రహదోషాలు కూడా తొలగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వివిధ గ్రహదోషాల నుండి ఉపశమనం పొందడానికి, ఆయా గ్రహాలకు సంబంధించిన వ్యక్తుల పాదాలను ముట్టుకోవాలట. జ్యోతిష్య శాస్త్రంలో దీని గురించి వివరంగా చెప్పారు. ఏ గ్రహ దోషం నుండి ఉపశమనం పొందడానికి ఎవరి పాదాలు ముట్టుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

25

తండ్రి పాదాలు ముట్టుకుంటే..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో సూర్యుని స్థానం బాగాలేకపోతే వారు ప్రతిరోజూ తమ తండ్రి పాదాలను ముట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల సూర్యుడు ఇచ్చే శుభ ఫలితాలు త్వరగా లభిస్తాయి.

వదినకు నమస్కరిస్తే.. 
జాతకంలో శుక్రుడు అశుభ స్థానంలో ఉన్నవారికి జీవితంలో ఎలాంటి సుఖం లభించదు. అందువల్ల శుక్రుడిని శుభ స్థానంలోకి తీసుకురావడానికి వదిన పాదాలను నమస్కరించాలి. తల్లి తర్వాత తల్లి లాంటిది వదిన. అందువల్ల ఆమె ఆశీర్వాదం ఉంటే జీవితంలో విజయం తర్వగా లభిస్తుంది. 

35

అన్నయ్య పాదాలకు నమస్కరిస్తే.. 
ఎవరింట్లో అన్నదమ్ములు ఉన్నా.. ఎప్పుడూ సరదాగా ఉంటారు. అప్పుడప్పుడు గొడవ పడుతుంటారు కదా.. అయితే అన్నయ్య పాదాలకు మొక్కితే కుజుడి స్థానం సరి అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కుజుడి స్థానం బాగా ఉంటేనే భూమి, ఆస్తులు కలిసి వస్తాయి. అందువల్ల ఆస్తి కలిసి రావాలంటే అన్నయ్య ఆశీర్వాదం ఉండాలన్న మాట. 

45

పెద్దమ్మ ఆశీస్సులు.. 
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ జాతకంలో బుధుడి స్థానం బాగాలేకపోతే మీ పెద్దమ్మ పాదాలకు తరచూ నమస్కరిస్తూ ఆమె ఆశీర్వాదం తీసుకోవాలట. 

గురువుకు మొక్కితే.. 
గురు గ్రహ శుభ ఫలితాలను పొందడానికి, మీ గురువుకు లేదా బ్రాహ్మణుల పాదాలకు నమస్కారం చేయాలట. గురువు అనుగ్రహం ఉన్నవారి మనస్సు ఆధ్యాత్మికత వైపు మళ్లుతుంది. దీని వల్ల ధార్మిక కార్యక్రమాలు చేయడం, సమాజానికి సేవ చేయడం లాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు.

 

55

తల్లి అనుగ్రహం ఉంటే.. 
తల్లి పాదాలకు ప్రతిరోజూ నమస్కరించాలి.  ఇది హిందూ మత సంప్రదాయం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తల్లి పాదాలను ప్రతిరోజూ ముట్టుకోవడం వల్ల చంద్రుని స్థానం సరి అవుతుంది. చంద్రుడు బాగుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ప్రతి రోజు తల్లికి నమస్కారం చేయాలని చెబుతారు. హిందూ మతం ఎంత గొప్పదంటే మన జాతకాల్లో ఉండే గ్రహ దోషాలు పోగొట్టడానికి ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు. పెద్దలను గౌరవిస్తే సరిపోతుంది. 

click me!

Recommended Stories