ఏనుగు బొమ్మలు
శక్తి, బుద్ధి, స్థిరత్వానికి చిహ్నం ఏనుగు. ఇంట్లో ఏనుగు బొమ్మలు పెట్టడం వల్ల డబ్బు బాగా పెరుగుతుంది. వ్యక్తి, కుటుంబ వైభవం కూడా పెరుగుతుందని ప్రజలు నమ్ముతారు. ఈ ఏనుగు బొమ్మలను ఈశాన్యం లేదా ఉత్తర దిక్కులో ఉంచితే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.
గుర్రం బొమ్మలు
గుర్రాలు శక్తిని, వేగాన్ని, విజయం సాధించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా బిజినెస్ లో సక్సెస్ రావాలంటే గుర్రం బొమ్మలు పెట్టుకోవడం మంచిది. వాటిల్లోనూ పసుపు గోధుమ గుర్రం బొమ్మలను పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ గుర్రం బొమ్మలను ఇంట్లో దక్షిణ లేదా పశ్చిమ దిశల్లో ఉంచితే విజయం కలుగుతుందట.
పావురం బొమ్మలు
ప్రేమ, శాంతి, ఐక్యతకు నిదర్శనం పావురం. అందువల్లనే పావురం బొమ్మలు ఇంట్లో పెట్టడం వల్ల కుటుంబంలో శాంతి, ఐక్యత పెరుగుతాయట. ఇళ్లలో ఉత్తర లేదా పశ్చిమ దిశలో ఉంచితే మంచి ఫలితాలు కలుగుతాయి.
కోతి బొమ్మలు
కోతులు తెలివి, చురుకుదనానికి గుర్తు. కోతి బొమ్మలు పెట్టడం వల్ల ఇంట్లో ఉండే వారికి ఆలోచనా శక్తి మెరుగవుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఇది మంచి ఫలితాలనిస్తుంది. వీటిని ఇంట్లో ఉత్తర దిక్కులో ఉంచాలి.
tiger population
పులి, సింహం బొమ్మలు
ధైర్యం, బలం, రక్షణకు చిహ్నం ఈ క్రూర జంతువులు. సింహం, పులి బొమ్మలను ఇంట్లో పెట్టడం వల్ల ఆ ఇంటికి భద్రత, శక్తిని తీసుకువస్తాయని నమ్మకం. ఈ బొమ్మలను దక్షిణ దిశలో ఉంచడం మంచిదని పండితులు చెబుతున్నారు.
ఉడుత బొమ్మలు
ఉడుతలు అంటేనే క్విక్ అండ్ ఇమ్మిడియట్ రెస్పాన్స్ ఇచ్చే చిన్న జంతువులు. వీటికి చురుకుదనం ఎక్కువ. పరిజ్ఞానాన్ని సూచిస్తాయి. ఇంట్లో ఉడుత బొమ్మలను ఉంచడం వల్ల ఆలోచనా శక్తి, వివేకం పెరుగుతుందని నమ్మకం. ఇది విద్యార్ధుల గదిలో లేదా ఉత్తర దిక్కులో ఉంచడం మంచిది.
కప్పల బొమ్మలు
కప్పలు డబ్బు, సంపదకు ప్రాతినిధ్యం వహిస్తాయట, కప్పల బొమ్మలను ఇంట్లో పెట్టడం ఆర్థికంగా లాభాలను తెస్తుందని నమ్ముతారు. ఈ కప్ప బొమ్మలను ఈశాన్య దిశలో ఉంచడం మంచిది.
నెమలి బొమ్మలు
అందం, ధనం, వైభవం కలగాలంటే నెమలి బొమ్మలను ఇంట్లో పెట్టుకోవాలి. నెమలి బొమ్మలు లేదా వాటి ఫొటోలను ఇంట్లో ఉండటం వల్ల శాంతి, సంపద, ప్రతిష్ట పొందవచ్చునని నమ్ముతారు. ఈ నెమలి బొమ్మలను పశ్చిమ లేదా ఉత్తర దిశలో ఉంచడం శ్రేయస్కరం.
చేపల బొమ్మలు
శ్రేయస్సు, శాంతి, సానుకూల శక్తిని చేపలు సూచిస్తాయి. ఇంట్లో చేప బొమ్మలు కాని, అక్వేరియం పెట్టడం వల్ల దోషాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. చేపలు సంపద, శాంతిని కలిగిస్తాయట. ఈ చేప బొమ్మలను ఈశాన్య దిశలో ఉంచడం ఆ ఇంటి యజమానికి, ఇంటికి కూడా మంచిదట.
తాబేళ్ల బొమ్మలు
తాబేళ్లు స్థిరత్వానికి సంకేతం. అంతేకాకుండా ఇవి సుధీర్ఘ జీవితాన్ని ప్రసాదిస్తాయని నమ్ముతారు. చేసే పనిలో, డబ్బుకు సంబంధించిన విషయాల్లో విజయం సాధించాలంటే ఇంట్లో తాబేళ్ల బొమ్మలను ఉత్తర దిక్కులో పెట్టాలట. అలాకాకుండా అక్వేరియంలో చేపలతో పాటు తాబేళ్లను కూడా పెంచవచ్చు.
కుక్క బొమ్మలు
కుక్కలు భద్రత, విశ్వసనీయత, ధైర్యానికి చిహ్నం. ఇంట్లో కుక్క బొమ్మలు పెట్టడం వల్ల కాలభైరవుడి రూపంలో సాక్షాత్తు పరమేశ్వరుడే భద్రత, రక్షణ కల్పిస్తాడని భక్తుల నమ్మకం. ఈ కుక్క బొమ్మలను దక్షిణ దిశలో ఉంచడం వల్ల కుటుంబసభ్యులు ధైర్యంగా జీవించగలుగుతారు. క్రూరంగా, కోపంగా ఉండే జంతువుల బొమ్మలు ఇంట్లో పెట్టరాదని, వీటి వల్ల నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుందని కొందరు వాస్తు నిపుణులు చెబుతున్నారు.