ఈ నక్షత్రంలో పుట్టిన వారికి శ్రీరాముడికి ఉన్న సుగుణాలు ఉంటాయి

First Published Jan 22, 2024, 3:01 PM IST

వాల్మీకి రామాయణంలో శ్రీరాముని జన్మ నక్షత్రం, సమయం, ముహూర్తం రాశిచక్రం గురించి సమాచారం ఉంది. అయితే శ్రీరాముడు జన్మించిన ఆ నక్షత్రంలో పుట్టిన వారికి రాముడి లక్షణాలు వస్తాయని జ్యోతిష్యలు చెబుతున్నారు. మరి మీది ఏ నక్షత్రం.. 

సనాతన ధర్మంలో జ్యోతిషానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జాతకాన్ని బట్టి ఒక వ్యక్తిని జ్యోతిష్యం అంచనా వేస్తుంది. ఇది ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహం, ఆరోగ్యంతో సహా అన్ని రకాల సమాచారాన్ని అందిస్తుంది. జాతకంలో శుభ గ్రహాలు బలంగా ఉన్నప్పుడు వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థానాన్ని పొందుతాడు. భవిష్యత్తులో ప్రతిష్ఠ పెరుగుతుంది. అలాగే శుభ గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు.. ఆ వ్యక్తి తన జీవితంలో ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
 

 జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం.. జాతకంలో 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రాల ప్రకారం.. జాతకుని భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. వీటితో పాటుగా మహాదశ, యోగం, గ్రహాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అయితే శ్రీరాముడు ఏ నక్షత్రంలో జన్మించాడో తెలుసా? ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులకు ఏ లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం పదండి. 
 

వాల్మీకి రామాయణంలో శ్రీరాముని జన్మ సమయం, ముహూర్తం, నక్షత్రం, రాశిచక్రం గురించిన పూర్తి సమాచారం ఉంది. దీని ప్రకారం.. రాముడు చైత్ర మాసం శుక్లపక్షంలో తొమ్మిదవ రోజున కర్కాటక లగ్నం, పునర్వసు నక్షత్రంలో జన్మించాడు.
 

పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి భగవంతుడిపై అపారమైన విశ్వాసం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారి ప్రవర్తన చిన్నప్పటి నుంచి చాలా సౌమ్యంగా, సున్నితంగా ఉంటుందట. అలాగే వీరి వయసు పెరుగుతున్న కొద్దీ వీటిని ప్రజలు ఇష్టపడటం తగ్గిపోతారు. వీరికి శారీరక సుఖాల పట్ల విరక్తి ఉంటుంది. అలాగే దేవుడు ఇచ్చిన దాంట్లోనే తృప్తి చెందుతారు. వీళ్లు అధర్మ మార్గాన్ని అనుసరించడానికి ఇష్టపడరు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి విశాలమైన హృదయం ఉంటుంది. అలాగే వీరిలో శ్రీరాముడి వంటి సుగుణాలు కూడా ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

click me!