శ్రీరాముని సతీమణి సీతాదేవి గురించి మీకెవ్వరికీ తెలియని కొన్ని నిజాలు

First Published | Jan 22, 2024, 3:48 PM IST

రాముడు ఎంత గొప్పవాడో అందరికీ తెలిసిందే. అయితే మనలో చాలా మంది సీతాదేవికి గురించి అంతా తెలుసు అనుకుంటారు. కానీ అమ్మవారు సీతామాత గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. అవేంటో ఈ ప్రాణ ప్రతిష్ట రోజు సందర్బంగా తెలుసుకుందాం పదండి. 

ఎంతో ప్రసిద్ధి చెందిన, గౌరవప్రదమైన భారతీయ ఇతిహాసాల్లో రామాయణం ఒకటి. ఇందులో సీతాదేవి కీలక పాత్ర పోషిస్తుంది. రాముడు సీతాదేవిని పెళ్లి చేసుకోవడం, తన తండ్రి కోరిక మేరకు వనవాసానికి వెళ్లడం, ఎన్నో కష్టాలు పడటం, సీతాదేవి అపహరణ జరగడం వంటి విషయాలు మనకు తెలిసిందే. అయితే రాముడి గురించి తెలిసినంతగా ఈ స్వామి సతీమణి సీతాదేవి గురించి చాలా మందికి తెలియదు. ఈ రోజు అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట అయ్యింది. కాబట్టి ఈ సందర్భంగా శ్రీరాముడి సతీమణి సీతాదేవి గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

1. రామాయణం ప్రకారం.. సీతాదేవి నేపాల్ లోని మిథిలాలో జనక మహారాజు, సునయన రాణి దంపతులకు కుమార్తె. అయితే వీరికి సీతాదేవి భూమిని దున్నుతుంటే దొరుకుతుంది. అందుకే సీతా మాతను భూమాత బిడ్డగా భావిస్తారు. 
 


2. సీతాదేవి గురించి మనలో చాలా మందికి తెలియని విషయమేంటంటే.. కొన్ని రమాయణాల ప్రకారం.. సీతాదేవిని మాయ సీత అంటారు. నిజమైన సీతాదేవి అగ్నిదేవుని నుంచి రక్షణ పొంది పార్వతీ దేవి నివాసానికి వెళుతుంది. ఇక మాయ సీతనే రావణుడు బంధించినట్టు చెప్తున్నాయి. రాముడు, రావణాసుడి మధ్య యుద్దం ముగిశాక  ఆమె శ్రీరాముడితో వెళ్లింది. మాయ సీత తదుపరి అవతారం ద్రౌపది అని కొందరు అంటారు. 

3. శ్రీమహావిష్ణువు భార్య కావడానికి తపస్సు చేస్తున్న సమయంలో రావణుని వేధింపులకు గురైన వేదవతికి సీతాదేవి పునర్జన్మగా భావిస్తారు. వేదవతి తన మరణానంతరానికి రావణుడే కారణమని శపించిందట.
 

4. సీతాదేవికి పవిత్ర గ్రంథాలలో మంచి ప్రావీణ్యం ఉంది. అలాగే ధర్మం గురించి మంచి అవగాహన కూడా ఉంది. 

5. కొన్ని రామాయణ గాథలల్లో సీతాదేవి రావణ, మండోదరి దంపతులకు మొదటి సంతానం. అయితే మండోదరి మొదటి సంతానం వారి మొత్తం వంశానికి ముగింపు పలుకుతుందని జ్యోతిష్యులు ముందుగానే చెప్తారు. దీంతో రావణుడు ఆ చిన్నారిని సుదూర ప్రదేశానికి తీసుకెళ్లి ఖననం చేయమని ఆర్డర్ వేస్తాడు. అయితే ఈ బిడ్డ జనకమహారాజుకు దొరుకుతుంది. దీంతో వీరు మిథిలా యువరాణిగా పెంచాలని నిర్ణయించుకుంటారు. 
 

6. సీతాదేవి అడవుల్లో వనవాసం చేసినప్పుడు సీతాదేవిని రాముడు వైదేహి అని, రాముడిని సీతా దేవి రామ అని పిలిచేవారు.    

Latest Videos

click me!