Rakhi: రాఖీ కట్టేటప్పుడు పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఇవి..!

Published : Aug 08, 2025, 06:27 PM IST

రక్షా బంధన్ అనే ఈ పండగ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది ప్రేమ, విశ్వాసానికి ప్రతీక. అయితే, ఈ పండగను మరింత శుభప్రదంగా చేసుకోవాలంటే కొన్ని నియమాలను పాటించడం, కొన్ని విషయాలను నివారించడం అవసరం. 

PREV
14
మీ సోదరుడికి రాఖీ కడుతున్నారా?

హిందూ సంప్రదాయం ప్రకారం శ్రావణ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక శ్రావణ మాస పౌర్ణమి రోజున వచ్చే ఈ రాఖీ పండగకు మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజున సోదరీమణులు తమ అన్నదమ్ముల చేతికి రాఖీ కట్టి, వారి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, సంతోషకరమైన జీవితం లభించాలని దేవుడిని కోరుకుంటారు. రక్షా బంధన్ అనే ఈ పండగ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది ప్రేమ, విశ్వాసానికి ప్రతీక. అయితే, ఈ పండగను మరింత శుభప్రదంగా చేసుకోవాలంటే కొన్ని నియమాలను పాటించడం, కొన్ని విషయాలను నివారించడం అవసరం.

24
మొదటి రాఖీ ఎవరికి కట్టాలి?

ముందుగా దేవుళ్లకు రాఖీ..

మీ సోదరుడికి రాఖీ కట్టడానికి ముందు.. మరొకరికి రాఖీ కట్టాలి. అందరికంటే ముందు దేవుడికి రాఖీ కట్టడం మంచిది. మీకు నచ్చిన దేవుడు ఎవరైనా వారి విగ్రహానికి రాఖీ కట్టడం చాలా శ్రేయస్కరం. ఆ తరువాత అన్నదమ్ములకు కట్టడం శుభసూచకం. ఇది దైవకృపను అందిస్తుంది అని నమ్మకం.

ఏ సమయంలో కడుతున్నాం అనేది కూాడా ముఖ్యమే.

రాఖీ కట్టే సమయం చాలా ముఖ్యం. రాహుకాలం, యమగండం, భద్రకాలం వంటి అశుభ సమయంలో రాఖీ కట్టడం మంచిది కాదు. పంచాంగంలో సూచించిన ముహూర్తంలోనే ఈ ఆచారం చేయడం శ్రేయస్కరం. శుభ ముహుర్తంలో  కడితేేనే సోదరుడికి మేలు జరుగుతుంది.

34
ఎలాంటి రాఖీ ఎంచుకోవాలి?

రాఖీ ఎంపికలో జాగ్రత్త

పగిలిన, చినిగిన లేదా నలుపు రంగు రాఖీలు వాడకూడదు. ఇవి అశుభంగా పరిగణిస్తారు. అదేవిధంగా ప్లాస్టిక్, ప్రతికూల చిహ్నాలు ఉన్న రాఖీలు కూడా కట్టకూడదు. పాజిటివిటీని పెంచే రాఖీ కట్టడం ఉత్తమం.

రక్షాబంధన్ మంత్రం

రాఖీ కడుతూ రక్షాబంధన్ మంత్రాన్ని జపించడం సంప్రదాయం. ఈ మంత్రం సోదరుడికి రక్షణ కలిగిస్తుందని విశ్వాసం. తిలకం పెట్టేటప్పుడు కుంకుమ లేదా చందనం వాడాలి. సింధూరం మాత్రం వాడకూడదు. అక్షింతలకు వాడే బియ్యం విరిగిపోయి ఉండకూడదు.

44
తప్పక చేయాల్సింది..

ఆశీర్వాదాల ప్రాధాన్యం..

రాఖీ కట్టే సమయంలో ఎటువైపు కూర్చుంటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. తూర్పు దిక్కును చూస్తున్న వైపు కూర్చుంటే చాలా మంచిది. దక్షిణ దిశ వైపు మాత్రం చూడకూడదు. ఇక.. కచ్చితంగా రాఖీ కట్టిన తర్వాత సోదరుడికి హారతి ఇవ్వడం మర్చిపోవద్దు. 

హారతి పూర్తయ్యాక, సోదరుడు తన స్థానంలో నుంచే చెల్లికి బహుమానం ఇవ్వాలి. ఆ తర్వాత పెద్దలకు నమస్కారం చేయడం మరువకూడదు. ఇలా చేయడం మీ బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories