పూజ చేసేటప్పుడు దేవుడికి పూలను సమర్పిస్తుంటారు. అయితే పూజ సమయంలో దీపంలో వివిధ రకాల ఆకారాలు ఏర్పడటం శుభ సంకేతాలుగా భావిస్తారు. అలాగే పూజ సమయంలో దేవుడి విగ్రహం లేదా చిత్రపటం దగ్గర పెట్టిన పువ్వులు కిందపడటం కూడా చూసే ఉంటారు. మరి దీని అర్థమేంటో తెలుసా?
దేవుడి దయ మనపై ఉండేందుకు ప్రతి రోజూ పూజలు చేస్తుంటాం. దీపం ముట్టించి, హారతి ఇస్తారు. అలాగే దేవుడి దగ్గర పువ్వులు పెట్టి కొబ్బరి కాయలు కొడతారు. అయితే చాలా సార్లు దేవుడి చిత్రపటం ముందు పెట్టిన పువ్వులు కింద పడుతుంటాయి. మతపరంగా ఇలాంటి సంకేతాలను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు.
పూజ సమయంలో దేవుడి ఫోటో ముందు ఉన్న పువ్వు అకస్మాత్తుగా ఒక వ్యక్తిపై పడినప్పుడు, దేవుని చిత్రం లేదా విగ్రహం నుంచి ఒక పువ్వు కింద పడినప్పుడు.. అది మీకు ప్రత్యేక సంకేతం కావొచ్చంటున్నారు పండితులు. మరి ఇలాంటి పువ్వు దేనికి సంకేతం? ఈ పువ్వుతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
విగ్రహం ముందు ఉన్న పువ్వులు అకస్మత్తుగా మీద పడటం మీ పూజ విజయవంతమైందని సూచిస్తుంది. అంటే దేవుడు మీతో సంతోషంగా ఉన్నాడని అర్థం వస్తుంది. అలాగే మీకోరికలు కూడా త్వరలోనే నెరవేరబోతున్నాయనడాన్ని ఇది సూచిస్తుంది. అలాగే ఇది మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సుకు సంకేతం. అందుకే దేవుడి ఫోటో నుంచి పడే ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించాలని పండితులు చెప్తారు.
పువ్వులతో ఇలా చేయండి
పూజ చేసేటప్పుడు.. విగ్రహం లేదా చిత్ర పటాల నుంచి పడిన పువ్వును మీతో ఉంచుకోండి. ఈ పువ్వును శుభ్రమైన ఎరుపు వస్త్రంలో 1 రూపాయి నాణెం, కొంత బియ్యంతో కట్టండి. దీన్ని డబ్బున్న ప్రదేశంలో పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదు.