Ashadam: ఆషాఢ మాసంలో దంపతులు ఎందుకు దూరంగా ఉండాలి? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..?

Published : Jul 01, 2025, 12:09 PM IST

కొత్తగా పెళ్లైన దంపతులు ఒకే చోట ఉండకూడదు అని నియమం కూడా ఉంది. అసలు.. భార్యభర్తలు ఈ ఆషాఢ మాసంలో ఎందుకు దూరంగా ఉండాలి?

PREV
14
ఆషాఢ మాసం..

హిందూ శాస్త్రాల్లో ఆషాఢ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలను చేయరు. కానీ, ఈనెలకు మతపరమైన మాసంగా పరిగణిస్తారు. భక్తులు విష్ణు మూర్తి, శివుడికి ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు చేయడం, ఉపవాస దీక్షలు చేయడం లాంటివి కూడా చేస్తారు. అయితే.. ఆషాఢ మాసంలో భార్యభర్తలు దూరంగా ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు.

కొత్తగా పెళ్లైన దంపతులు ఒకే చోట ఉండకూడదు అని నియమం కూడా ఉంది. అసలు.. భార్యభర్తలు ఈ ఆషాఢ మాసంలో ఎందుకు దూరంగా ఉండాలి? దాని వెనక ఉన్న మతపరమైన ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

24
సైన్స్ ఏం చెబుతోంది?

సహజంగా, దంపతులు ఏదైనా పూజ, మతపరమైన కార్యక్రమంలో పాల్గొనాల్సి వస్తే.. ఆ ముందు రోజు రాత్రి సాన్నిహిత్యానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. ఆషాఢ మాసంలో కూడా ఇదే నియమాన్ని దంపతులు పాటించాలి. దీని వెనక కారణం ఉంది. సెంట్రల్ యూరోపియన్ జర్నల్ ఆఫ్ యూరాలజీ లో పేర్కొన్న దాని ప్రకారం, కాలానుగుణ మార్పులు పురుషులలో లింగ వ్యాత్యాసాలను, మహిళల్లో హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. అందుకే, వర్షాకాలంలో దంపతుల సాన్నిహిత్యానికి అనువైన సమయం కాదని భావిస్తారు. అందుకే, ఈ కాలంలో భార్యభర్తలు దూరంగా ఉండమని చెబుతారు.

34
వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు

వర్షాకాలం అనేక ఆరోగ్య సమస్యలను తెస్తుంది. వాతావరణంలో పెరిగిన తేమ మహిళల్లో మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల పెరుగుదలతో సహా పరిశుభ్రత సమస్యలకు దారితీస్తుంది. వర్షపు నీటిలో తరచుగా బ్యాక్టీరియా ఉంటుంది, ఇది వ్యాధుల వ్యాప్తి ప్రమాదాన్ని పెంచుతుంది. వర్షాకాలంలో సూర్యరశ్మి లేకపోవడం, సామాజిక పరస్పర చర్య తగ్గడం కూడా కాలానుగుణ ప్రభావ ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.ఇవి మెలటోనిన్ , సెరోటోనిన్ వంటి శరీర అంతర్గత మానసిక స్థితిని నియంత్రించే హార్మోన్లను ప్రభావితం చేస్తుంది.

44
నిద్ర ,మానసిక స్థితిపై ప్రభావం

వర్షాకాలంలో సూర్యరశ్మి లేకపోవడం స్లీప్ సైకిల్ ను ప్రభావితం చేస్తుంది. మానసిక స్థితి రుగ్మతలను పెంచుతుంది. సూర్యరశ్మి మానసిక స్థితిని నియంత్రించే న్యూరోట్రాన్స్మిటర్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇవన్నీ ఆరోగ్యాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.

వర్షాకాలంలో పెరిగిన తేమ వల్ల పరిశుభ్రత సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఈ వాతావరణం బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, అంటువ్యాధుల అవకాశాలను పెంచుతుంది. మతపరమైన ఆచారాలు, ఆరోగ్య సమస్యలు , మానసిక స్థితిపై ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటే - వర్షాకాలంలో జంటలు శారీరకంగా సంభోగం చేయడం తగనిదిగా పరిగణిస్తారు.

వీటితో పాటు.. ఈ కాలంలో భార్యభర్తల కలయిక కారణంగా.. పిల్లలు ఎండాకాలంలో జన్మించే అవకాశం ఉంది. అప్పట్లో ఏసీ, కూలర్ లాంటి సదుపాయాలు ఉండేవి కాదు కాబట్టి... ఎండాకాలంలో పుట్టిన పిల్లలు చాలా ఇబ్బంది పడేవారు. అందుకే, ఈ మాసంలో కొత్తగా పెళ్లైన దంపతులు దూరంగా ఉండాలని చెప్పేవారు.

Read more Photos on
click me!

Recommended Stories