Spiritual : అధిక శ్రావణంతో కన్ఫ్యూజ్ అవుతున్నారా.. ఆ రోజే వరలక్ష్మీ వ్రతం!

First Published | Jul 29, 2023, 3:00 PM IST

 Spiritual : సాధారణంగా వరలక్ష్మీ వ్రతం రోజు పూజ కోసం నెల రోజుల ముందు నుంచే హడావుడి పడుతూ ఉంటారు ఆడవాళ్లు. కానీ ఈసారి అధిక శ్రావణం రావడంతో పూజ ఎప్పుడు చేయాలో కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ల కోసమే ఈ వ్యాసం.
 

 వరలక్ష్మీ వ్రతం కోసం హడావిడి పడుతున్న ఆడవాళ్ళకి అధిక శ్రావణం రావడంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏ శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం చేయాలో అర్థం కాక పండితుల వైపు చూస్తున్నారు. అయితే పండితులు ఏం చెప్తున్నారో చూద్దాం.
 

ఆషాడంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు కాబట్టి శ్రావణం మాసం కోసం ఎదురుచూస్తారు ఆడవాళ్లు. అలాంటి శ్రావణం అధికమాసం రావడంతో ఇందులో శుభకార్యాలు చేసుకోవచ్చా అన్న సందిగ్ధత అందరిలోనూ నెలకొంది.


 అయితే పంచాంగా గణన ప్రకారం సౌరమాన సంవత్సరానికి చంద్రమాన సంవత్సరానికి 11 రోజులు తేడా ఉంటుంది ఈ తేడా మూడేళ్లకు ఒకసారి చూసుకుంటే 30 రోజులు చౌరమణా సంవత్సరానికి ఎక్కువ ఉండటంతో ఈ 30 రోజులని అధికమాసంగా పరిగణిస్తారు.
 

 కాబట్టి మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం అధిక శ్రావణమాసం వచ్చింది ఇలా రావడం 19 సంవత్సరాల తర్వాత జరిగింది. జూలై 18 నుంచి ఆగస్టు 16 వరకు ఈ అధిక శ్రావణమాసం ఉంటుంది తరువాత అసలైన శ్రావణమాసం ప్రారంభమవుతుంది.

a

కాబట్టి అధిక శ్రావణ మాసాన్ని శూన్యమాసం గా గుర్తించాలని పండితులు చెబుతున్నారు సాధారణంగా శూన్య మాసాల్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించారు కాబట్టి శ్రావణమాసం ఎంత అదృష్టమైనదైనా కూడా అధికమాసంలో పూజలు చేయకూడదు.

కాబట్టి ఆగస్టు 16 తర్వాత వచ్చే శ్రావణమాసమే నిజ శ్రావణమాసం ఆ మాసంలోనే వరలక్ష్మి పూజ కూడా చేయాలి. ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 25వ తారీఖున పడింది. కాబట్టి ఎలాంటి అయోమయం లేకుండా ఆరోజు వరలక్ష్మి వ్రతాన్ని  చేసుకోవచ్చు.

Latest Videos

click me!