కీరదోస కాదు.. దాని గింజలు ఎప్పుడైనా తిన్నారా..?

First Published | Jul 23, 2024, 9:53 AM IST

ఈ కీరదోస గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు.. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఎవరికైనా మలబద్దకం సమస్య ఉంటే.. అది చాలా తక్కువ సమయంలో తగ్గిపోతుంది. 

cucumber

కీరదోస తెలియని వారు ఎవరూ ఉండరు. ఎండాకాలంలో ఈ కీరదోసను చాలా ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే.. ఎప్పుడైనా కీరదోస గింజలు తిన్నారా..? కీరదోస ముక్కలు తిన్నప్పుడే.. గింజలు కూడా కలిపే తింటాం కదా అనుకునేరు. అలా కాదు.. కీరదోస గింజలు ఎండిన తర్వాత  ఎప్పుడైనా తిన్నారా.? వీటిని తినడం వల్ల మనం ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. వీటిని రోజూ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

Cucumber

కీరదోస గింజలను రెగ్యులర్ గా తినడం వల్ల... జీర్ణ సమస్యలన్నీ తగ్గిపోతాయట. అంతేకాదు.. చర్మం చాలా అందంగా మారుతుందట. ఈ కీరదోస గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు.. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఎవరికైనా మలబద్దకం సమస్య ఉంటే.. అది చాలా తక్కువ సమయంలో తగ్గిపోతుంది. 


కీరదోస గింజల్లో నీటి శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన హైడ్రేషన్ వీటి సహాయంతో మనకు అందుతుంది. అంతేకాదు.. శరీరాన్ని చాలా కూల్ గా కూడా ఉంచుతుంది. వేడి చేయకుండా ఉంటుంది.
 

cucumber


అంతేకాదు.. ఎవరైనా బరువు తగ్గాలి అనుకుంటే.. తమ డైట్ లో ఈ కీరదోస గింజలను చేర్చుకోవచ్చు. వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా..ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి కలిగి ఉంటుంది. దీని కారణంగా సులభంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

అంతేకాదు కీరదోస గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి.. మనకు ఒత్తిడి తగ్గించడంలో సహాయపడతాయి. బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాయి. క్రానిక్ సమస్యలు రాకుండా కాపాడటంతో పాటు.. గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ లాంటివి రాకుండా ఉండటంలో సహాయం చేస్తాయి.

Cucumber

ఈ కీరదోస గింజల్లో ఉండే మెగ్నీషియం, పొటాషియం.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బీపీని కంట్రోల్ చేయడానికి.. గుండె ఆరోగ్యంగా పని చేయడంలో సహాయపడతాయి.

అంతేకాదు.. కీరదోస గింజల్లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు.. ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఈ రెండూ... చర్మం అందంగా మారడంలో సహాయం చేస్తాయి. ఈ గింజలు... చర్మాన్ని ఎక్కువ సేపు మాయిశ్చరైజ్డ్ గా ఉంచడంలో.. చర్మం సాగిపోకుండా ఉండేలా సహాయపడతాయి.
 

cucumber

కీరదోస గింజల్లో కాల్షియం, పాస్పరస్ లాంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి.. ఎముకలు బలంగా మారడానికి సహాయపడతాయి. వయసు పెరిగినా కూడా .. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు రాకుండా కాపాడటంలో ఈ గింజలు చాలా బాగా సహాయపడతాయి. బాడీని డీటాక్సిఫై చేయడానికి కూడా  హెల్ప్ చేస్తాయి. అంటే.. శరీరంలో ఉన్న మలినాలు, టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్లేలా చేస్తాయి. దాని వల్ల కిడ్నీలు కూడా ఆరోగ్యంగా  ఉంటాయి. 

Latest Videos

click me!