హెన్నాలో ఇదొక్కటి కలిపి పెడితే.. జుట్టు ఎంత పొడుగ్గా పెరుగుతుందో..!

First Published | Jul 23, 2024, 9:44 AM IST

చాలా మందికి జుట్టుకు హెన్నాను పెట్టుకునే అలవాటు ఉంటుంది. కొంతమంది తెల్ల జుట్టు కనిపించకూడదని హెన్నాను పెడితే.. మరికొంతమంది జుట్టు బలంగా అయ్యేందుకు పెడతారు. అయితే హెన్నాలో ఒకటి కలిపి పెడితే మాత్రం మీ జుట్టు చాలా పొడుగ్గా పెరుగుతుంది.

గోరింటాకు చేతులను ఎర్రగా చేయడమే కాదు.. ఇది మన జుట్టుకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే చాలా మంది తలకు హెన్నాను పెట్టుకుంటుంటారు. ఇది తెల్ల వెంట్రుకలను, గ్రే హెయిర్ ను కనిపించకుండా చేస్తుందని. కానీ హెన్నా ఇంతకు మించి మన జుట్టుకు మేలు చేస్తుంది. మీకు తెలుసా? హెన్నాలో పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్ లు పుష్కలంగా ఉంటాయి. ఇది తెల్ల వెంట్రులకు రాకుండా ఆపడమే కాకుండా.. జుట్టుకు మంచి మేలు చేస్తుంది. అయితే హెన్నా హెయిర్ గ్రోత్ కు కూడా సహాయపడుతుంది. హెన్నాతో జుట్టు పెరగాలంటే మాత్రం అందులో కుంకుడు కాయను కలపాలని నిపుణులు చెబుతున్నారు. అవును హెన్నాలో కుంకుడు కాయను కలిపి పెడితే జుట్టు ఫాస్ట్ గా పెరగడమే కాకుండా.. జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చు. కుంకుడు కాయ, గోరింటాకును కలిపి జుట్టుకు పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం పదండి. 

జుట్టుకు కుంకుడు కాయ ప్రయోజనాలు

జుట్టును మృదువుగా, అందంగా, షైనీగా, పొడవుగా మార్చడానికి కుంకుడు కాయ బాగా సహాయపడుతుంది. కుంకుడు కాయ నేచురల్ కండీషనర్ గా కూడా పని చేస్తుంది. పొట్టి జుట్టు ఉన్నవారు జుట్టు పెరగడానికి దీన్ని ఎంచక్కా ఉపయోగించొచ్చు. ఇది జుట్టును పొడుగ్గా పెంచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 
 

Latest Videos


హెన్నా, కుంకుడుకాయ

హెన్నా, కుంకుడు కాయ రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు సమస్యలను చాలా వరకు తగ్గిస్తాయి. అయితే మెహందీని, కుంకుడుకాయ రెండింటినీ కలిపి జుట్టుకు పెడితే జుట్టు ఫాస్ట్ గా పెరగడం స్టార్ట్ అవుతుంది. అంతేకాదు ఈ రెండు మన జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఉపయోగపడతాయి. హెన్నాను, కుంకుడుకాయను కలిపి వాడితే ఎంత పొట్టిగా ఉన్న జుట్టు అయినా.. పొడుగ్గా పెరుగుతుంది. 
 

మెహందీ-కుంకుడుకాయ ప్యాక్ ఎలా తయారు చేయాలి?

మెహందీ, కుంకుడుకాయ హెయిర్ ప్యాక్ ను తయారుచేయడానికి ఒక గిన్నెలో ఒక టీస్పూన్ కుంకుడుకాయ పౌడర్ ను తీసుకోండి. దీనిలో 3 టేబుల్ స్పూన్ల గోరింటాకు పొడిని వేసి బాగా కలపండి. దీనిలో నీళ్లు పోసి చిక్కటి పేస్ట్ లా తయారుచేయండి. రాత్రంతా ఈ పేస్ట్ ను అలాగే ఉంచండి.
 

henna hair

మెహందీ-కుంకుడుకాయ ప్యాక్ జుట్టుకు ఎలా పెట్టుకోవాలి? 

ఉదయం తర్వాత మీరు ఎప్పుడైనా ఈ పేస్ట్ ను జుట్టుకు అప్లై చేయొచ్చు. అయితే దీన్ని జుట్టుకు పెట్టుకున్న తర్వాత 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే ఉండాలి. ఆ తర్వాత జుట్టును నీళ్లో శుభ్రం చేయాలి. ఈ హెయిర్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల మీ జుట్టు మృదువుగా, షైనీగా మారుతుంది. 

మెహందీ-కుంకుడుకాయ ప్యాక్ ను ఎన్ని సార్లకు ఒకసారి అప్లై చేయాలి? 

మెహందీ-కుంకుడుకాయ హెయిర్ ప్యాక్ ను జుట్టుకు నెలకు 2 సార్లు మాత్రమే పెట్టాలి. ఇలా కనుక మీరు మెహందీని జుట్టుకు పెడుతుంటే  2 నుంచి 3 నెలల్లోనే మీ జుట్టులో తేడాను గమనిస్తారు. మీ జుట్టు ఫాస్ట్ గా పెరగాలనుకుంటే మాత్రం గోరింటాకులో కుంకుడుకాయను కలిపి పెట్టండి. ఇది మీ జుట్టును  ఆరోగ్యంగా పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఈ హెయిర్ ప్యాక్ మీ జుట్టు రాలడాన్నికూడా చాలా వరకు తగ్గిస్తుంది. 
 

click me!