శృంగారానికి చొరవ చూపని భార్య.. పురుషాంగం కోసేసుకున్న భర్త

First Published | Feb 13, 2020, 3:17 PM IST

రాత్రివేళ అతను శృంగారం ప్రస్తావన తీసుకువచ్చినా... ఆమె ఆసక్తి చూపించలేదు. దీంతో కోపంతో రగలిపోయిన హసన్ కత్తితో పొడిచి భార్యను హత్య చేశాడు. తీవ్ర రక్తస్రావం అయ్యి.. ఆమె అక్కడికక్కడే కన్నుమూసింది.
 

దంపతుల మధ్య శృంగారానిది పెద్దపీట. ఆ విషయంలో ఇద్దరూ ఆనందంగా సాగినప్పుడే వారి దాంపత్యం మరింత ఆనందంగా ఉంటుంది.
ఒకవేళ ఇద్దరిలో ఒకరికి దానిపై ఆసక్తిలేదనుకోండి ఏం చేస్తారు..? మరిముంచో, మైమరిపించే.. బతిమాలో ఎలాగోలా దారిలోకి తెచ్చుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం దారుణం చేశాడు.

భార్య తనతో శృంగారానికి ఆసక్తి చూపించలేదని ఓ భర్త చేసిన పని అందరినీ విస్మయానికి గురిచేసింది. భార్యను దారుణంగా హత్య చేయడమే కాకుండా... తన మర్మంగాలను తానే కోసేసుకున్నాడు. ఈ వింత సంఘగటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సిద్ధార్థనగర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన హసన్ అనే వ్యక్తికి కొంతకాలం క్రితం వివాహమైంది. స్వగ్రామం యూపీలో ఉన్నా.. ఉద్యోగం గుజరాత్ లో చేసేవాడు.
దీంతో భార్యను స్వగ్రామంలో ఉంచి.. విధులకు వెళ్లిపోయాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. ఇటీవల హసన్ ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంటికి వచ్చాడు. అయితే... ఇంటికి వచ్చిన అతనితో భార్య సరిగా మాట్లాడలేదు. భర్తతో అంటీ ముట్టనట్లు వ్యవహరించింది.
రాత్రివేళ అతను శృంగారం ప్రస్తావన తీసుకువచ్చినా... ఆమె ఆసక్తి చూపించలేదు. దీంతో కోపంతో రగలిపోయిన హసన్ కత్తితో పొడిచి భార్యను హత్య చేశాడు. తీవ్ర రక్తస్రావం అయ్యి.. ఆమె అక్కడికక్కడే కన్నుమూసింది.
దీంతో కంగారుపడిపోయిన హసన్.. అదే కత్తితో తన మర్మాంగాలను కూడా కోసేసుకున్నాడు. వీరి ఆర్తనాదాలు విన్న స్థానికులు పరుగున రాగా... ఇద్దరూ రక్తపుమడుగులో పడి ఉన్నారు.
ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా.. హసన్ కి చికిత్స అందిస్తున్నారు. అతని భార్య చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. వారి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Videos

click me!