మీ పిల్లలు పెళ్లి చేసుకోనంటున్నారా? కారణం ఇదే కావొచ్చు అడగండి

First Published | Dec 6, 2023, 10:54 AM IST

పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత ఎవ్వరైనా పెళ్లి చేసుకోవాలని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ ప్రస్తుత జెనరేషన్ యువత మాత్రం పెళ్లిళ్లు చేసుకోవడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపడం లేదు. పేరెంట్స్ ఎంత చెప్పినా.. పెళ్లిని మాత్రం వాయిదా వేస్తూ వస్తూనే ఉంటారు. అసలు వీళ్లు పదేపదే పెళ్లి వద్దనడానికి అసలు కారణమేంటో తెలుసా? 
 

ఒకప్పుడు పెద్దలు ఏది చెప్తే అదే ఫైనల్. చదువు విషయంలోనే కాదు పెళ్లి నుంచి ప్రతి విషయంలోనూ వాళ్లదే ఫైనల్ నిర్ణయం ఉండేది. ఇప్పడు పిల్లలు తమకు నచ్చిన పనులను మాత్రమే చేస్తున్నారు. అంటే పెద్దల మాట పూర్తిగా వినడం లేదని కాదు. పెళ్లి విషయంలో మాత్రం అప్పటిలా లేదు. ఒకప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలకు తగ్గ అబ్బాయిని లేదా అమ్మాయిని సెలక్ట్ చేసి పెళ్లి చేసేవారు. అయినా అప్పట్లో పెళ్లి చేసుకోను అన్న ముచ్చటే ఉండేది కాదు. కానీ ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెళ్లికి ఒప్పించడానికి ఎంతో తిప్పలు పడుతున్నారు. చాలా మంది యువత పెళ్లి పురు వినగానే చిరాకు పడుతుంటారు. 
 

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన వయసులో పెళ్లి చేసుకుని స్థిరపడాలని కోరుకుంటారు. కానీ పిల్లలు మాత్రం పేరెంట్స్ మాట అస్సలు వినరు. కానీ పెళ్లి గురించి పదేపదే పిల్లలు మాట వినకపోవడం తల్లిదండ్రులకు ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. కానీ దీని వెనుక కొన్ని ప్రత్యేక కారణాలు ఉండొచ్చంటున్నారు నిపుణులు. మరి పిల్లలు ఎందుకు పెళ్లిని నిరాకరిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


స్వేచ్ఛను కోల్పోతామనే భయం

యువత కుదురుగా ఒక్క చోట ఉండరు. వయసు అలాంటిది. కాలేజీ నుంచి రాగానే ఫ్రెండ్స్ తో అలా బయటకు వెళతారు. అంటే వీళ్లు నచ్చినట్టుగా, స్వేచ్చగా తమకు నచ్చినట్టు బతుకుతారు. అలాగే వీళ్ల జీవనశైలి వాళ్లకు నచ్చినట్టుగా ఉంటుంది. కానీ పెళ్లి చేసుకుంటే జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. అందుకే పెళ్లి తర్వాత స్వేచ్ఛను కోల్పోతామనే భయం వారిలో ఉంటుంది. ఇంతకు ముందులా ఉండలేమని చాలా మంది ముందే భయపడతారు. జీవితంలోకి ఒక పర్సన్ రాకతో జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. కానీ ప్రతి ఒక్కరూ ఈ మార్పుకు సిద్దంగా ఉండరు. 
 

పాత సంబంధం

నేటి తరం పెళ్లికి దూరం కావడానికి మరో ముఖ్యమైన కారణం వారి పాత రిలేషన్ షిప్ నుంచి ఎదురైన చేదు అనుభవం. పెళ్లికి ముందు ఎవరితోనైనా రిలేషన్ షిప్ లో ఉండి వారితో వచ్చిన విభేదాలను మర్చిపోకపోవడం వల్ల కూడా పెళ్లిపై ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది. ఇతరులు చేసిన గాయాలు అలాగే గుర్తుండి పోవడం వల్ల  చాలా మందికి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన పోతుందని నిపుణులు అంటున్నారు. అలాగే పాత భాగస్వామిని మర్చిపోకపోతే కూడా పెళ్లి చేసుకోవడానికి వెనకడుగు వేస్తారు.

ఎదుటివారి కష్టాలను చూసి భయం

ఇతరులు ఎలా బతుకుతున్నారనేది కూడా పిల్లలపై ఎంతో ప్రభావం చూపుతుంది. అంటే మన చుట్టుపక్కల దంపతులు లేదా ఇంట్లో ప్రతి రోజూ గొడవ పడుతూ.. కొట్టాడుతూ ఉంటే వాళ్లను చూసి పెళ్లి చేసుకోకపోవడమే చాలా బెటర్ అని చాలా మంది అనుకుంటారు. పెళ్లైన పిల్లలతో స్నేహం చేయడం, వారి వైవాహిక జీవితం చెడిపోవడం, పెళ్లి చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భావించడం వల్లే పెళ్లిపై ఇంట్రెస్ట్ పోతుంది. 
 

Latest Videos

click me!