శృంగారంపై స్త్రీ, పురుషులకు ఇద్దరికీ ఆసక్తి ఉంటుంది. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే... ఎక్కువగా చొరవ చూపేది మాత్రం పురుషులే. భార్యభర్తల బంధంలో.. భర్తే ఈ విషయంలో చొరవ చూపించాలని స్త్రీ కోరుకుంటుంది. పురుషులకు కూడా తమదే ఆదిపత్యం ఉండాలని కోరుకుంటారు కాబట్టే.. వాళ్లే ముందుగా స్పందిస్తూ ఉంటారు.
అయితే... ఈ ఉత్సాహమంతా కలయిక మొదలవ్వకముందే.. తర్వాత మాత్రం ఏమీ ఉండదు అంటూ కొందరు స్త్రీలు ఫిర్యాదు చేస్తున్నారు. ఎందుకంటే... దాదాపు 80శాతం పురుషులు కలయిక ఎంజాయ్ చేసిన తర్వాత వెంటనే నిద్రకు ఉపక్రమస్తారట.
స్త్రీలు మాత్రం కలయిక తర్వాత తమను ప్రేమగా దగ్గరకు తీసుకొని మాట్లాడితే బాగుండని కోరుకుంటారట. అయితే... పురుషులు మాత్రం అప్పటి వరకు ప్రతాపం చూపించి తర్వాత ఏమీ ఎరగనట్టు నిద్రపోతున్నారట. దీనికి కారణం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.
శృంగార సమయంలో శరీరం సాధారణంగా రిలాక్స్ అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. అలాగే మెదడు కూడా చాలా ఆందోళన, తెలియని భయాలకు గురవుతుంది కాబట్టి శృంగారం చేసిన వెంటనే మగవారు నిద్రపోతారని నిపుణులు చెబుతున్నారు.
శృంగారం సమయంలో మగవారి మెదడులో కొన్ని రకాల కెమికల్స్ విడుదల అవుతాయట. ప్రొలాక్టిన్, వాసోప్రెస్సిన్, నైట్రిక్ ఆక్సిడ్ , సెరటోనిన్, ఆక్సిటోసిన్ విడుదల కావడంవల్ల మగవారికి నిద్రపోవాలనిపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఈ సంగతి పక్కన పెడితే.. శాఖాహారం, మాంసాహారం కూడా శృంగారంతో సంబంధం ఉందని చెబుతున్నారు. శృంగారం విషయంలో శాకాహార మహిళలు, మాంసాహార మహిళలను పోల్చి చూస్తే మాంసాహారం తీసుకునే మహిళలే శృంగారంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారని పరిశోధకులు చెబుతున్నారు.
శాకాహారం తీసుకునే వారిలో జంక్ లోపించి వారిలో టెస్టోస్టిరాన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. శాకాహారం తీసుకోవడం వల్ల సెక్స్ కోరికలు తక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
అయితే మాంసాహారం తీసుకునే వారిలో శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని తెలిపారు, కానీ మాంసాహారం తీసుకునే మహిళల్లో సెక్స్ సామర్థ్యం చాలా ఎక్కువ ఉంటుందని, భాగస్వామికి బాగా సహకరిస్తారని పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి సెక్స్ సామర్థ్యం పెంచుకోవాలంటే పుష్టికరమైన ఆహారంతోపాటు మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండేలా చూసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఇక ఏ సమయంలో శృంగారానికి అనువుగా ఉంటుందనే విషయంపై కూడా నిపుణులు పరిశోధన చేశారు. తెల్లవారుజామున శృంగారం ఆరోగ్యకరం అని ఓ అధ్యయనంలో వెల్లడైంది. రాత్రిపూట నిద్రతో రిలాక్సేషన్ పొందిన దేహానికి సహజంగానే తెల్లవారే సరికి శృంగార వాంఛ పెరుగుతుందని ఇది ప్రతి ఒక్కరికి అనుభవమే అని పరిశోధకులు వివరించారు.
నిద్రతో లభించిన స్వాంతనతో శృంగార సంబంధమైన హార్లోన్ల విడుదల పెరుగుతుంది. తద్వారా కాంక్ష పెరుగుతుంది. అలాంటి సమయంలో కలయిక ఆనందం స్థాయి పెరుగుతుంది.
సమయానికి భోజనం, తగినంత నిద్ర ఉండడం, వారంలో ఐదుసార్లు వ్యాయామం చేయడం వల్ల శరీర ఆరోగ్యానికి ఎన్ని లాభాలున్నాయో లేలేత కిరణాలు తాకే వేళ శృంగారంలో పాల్గొనడంవల్ల అన్నే లాభాలుంటాయని అధ్యయనవేత్తలు చెబుతున్నారు.
దీనివల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఆక్సిటోన్ పెరుగుతుంది. ఆక్సిటోన్ ఫీల్ గుడ్ కెమికల్. దీనివల్ల శరీరానికి కొత్త ఉత్తేజం కలుగుతుంది.