శృంగారమంటే ఆసక్తి లేని వారు అరుదుగా ఉంటారు. దాని మీద ఎంత ఆసక్తి ఉన్నా... కొందరు మాత్రం పడక గదిలో ఫెయిల్ అవుతూ ఉంటారు.
undefined
జీవిత భాగస్వామితో ఎలా ఉండాలి? ఎలా మెప్పించాలి? అనే విషయాలు తెలుసుకోకపోవడంతో నిరాశ, నిస్పృహలో తమలో పెంచుకున్నారు.
undefined
ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్ యుగంలో.. భార్యభర్తలు ఇద్దరూ కలిసి కాసేపు సమయం గడపడమే గగనమైపోయింది. దొరికిన కాస్తో, కూస్తో సమయంలోనే పార్టనర్ ని మెప్పించాలి. అందుకు ఏం చేయాలో నిపుణులు సూచిస్తున్నారు.
undefined
స్మోకింగ్ మనిషిని చంపేస్తుంది. ఈ విషయం తెలిసినా కూడా ఆ అలవాటు ఉన్నవారు దానిని వదలుకోలేరు. చాలా మంది భార్యలకు తమ భర్తలు స్మోక్ చేయడం నచ్చదు. ముఖ్యంగా పడక గదిలోకి వచ్చే సమయంలో... స్మోక్ చేసి ఉండటాన్ని స్త్రీలు అంగీకరించరు.
undefined
ఆ వాసన దాదాపు ఎవరికీ నచ్చదు. ఈ ఇష్టాయిష్టాలు పక్కన పెడితే... ఈ స్మోకింగ్ అలవాటు భవిష్యత్తులో మీ సెక్స్ సామర్థ్యాన్ని పూర్తిగా తగ్గించేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం... సెక్స్, సిగరెట్.. తూర్పు పడమర లాంటివి అంటున్నారు.
undefined
ఈ రెండింటిలో ఏదో ఒక్కటి మాత్రమే దొరకుతుందనేది వారి అభిప్రాయం. ఈ రెండింటిని ఒకేసారి పొందడం కష్టమనేది వారి వాదన. ఎందుకంటే.. సిగరెట్ లైంగిక వ్యవస్థ పై చెడు ప్రభావాన్ని చూపుతుంది. సిగరెట్ లో ఉండే నికోటిన్ రక్త ప్రవాహ వ్యవస్థను దెబ్బతీస్తుంది.
undefined
అంగ స్తంభన జరగాలంటే రక్తం అంగంవైపు ప్రవహించాలి. సిగరెట్ ఆ వేగానికి అడ్డుకట్ట వేస్తుంది. ఒక్కసారి అంగస్తంభన సమస్య మొదలైందంటే... గుండె సంబంధిత వ్యాధులు వస్తాయనడానికి సూచన.
undefined
పొగతాగడం వల్ల... పరోక్షంగా భార్య కూడా తాగినట్టే. ధూమపాన పర్యవసానాల్ని ఆమె కూడా అనుభవించాల్సిందే. దీంతో తన లైంగిక ఆరోగ్యమూ ప్రమాదంలో పడుతుంది.
undefined
రక్తప్రవాహ వేగం మందగించడంతో భావప్రాప్తి సమస్యలు వస్తాయి. యోనిలో లూబ్రికేషన్ తగ్గిపోతోంది. సెక్స్ బాధాకరం అవుతుంది. ఆ దుర్వాసన సెక్స్ పట్ల విరక్తి కలిగినా ఆశ్చర్యపడనక్కర్లేదు.
undefined
చాలా మంది సెక్స్ లో పాల్గొనడానికి ముందు పవర్ ఫుల్ పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటారు. అదేమీ అంత మంచి పద్దతి కాదని నిపుణులు చెబుతున్నారు. శుభ్రంగా స్నానం చేస్తే చాలని.. దుర్వాసన రాకుండా ఉంటే సరిపోతుందని అంటున్నారు.
undefined
మీకు నచ్చిన పర్ఫ్యూమ్ వాసన మీ భాగస్వామికి నచ్చాలని లేదు కదా. చాలా మంది యోగా, వ్యాయామం వంటి వాటికి దూరంగా ఉంటారు. అయితే.. రోజూ ఓ అరగంట పాటు ఏరోబిక్స్ చేస్తే.. మెదడులో ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల అవుతాయి.
undefined
పురుషులు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. టెస్టోస్టిరాన్ స్థాయి పెరిగి శృంగారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. డార్క్ చాక్లెట్లు తినడం మంచిది. ఇది ప్రేమ భావాలను పెంపొందిస్తోంది.
undefined
అయితే అలా అని ఎక్కువ మొత్తంలో తినకూడదు. తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. కాబట్టి కొద్ది మొత్తంలో తీసుకుంటే సరిపోతుంది.
undefined
రాత్రి వేళల్లో శాచ్యురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండండి. అప్పుడప్పుడు శరీరానికి మసాజ్ చేయించుకోవడం లేదా ఆవిరి స్నానం చేయడం వల్ల రక్త సరఫరా మెరుగై, శరీరం శృంగారానికి సమాయత్తమవుతుంది.
undefined