valentine week 2024: మీ లవర్ ను సంతోషపెట్టే చిట్కాలివి..

First Published | Feb 6, 2024, 10:49 AM IST

valentine week 2024: వాలెంటైన్ వీక్ రేపటి నుంచే షురూ అవుతుంది. మరి ఇప్పటి నుంచే ప్రేమలో ఉన్న జంటలు తమ లవర్లకు ఏమేం గిఫ్ట్ లు ఇవ్వాలి? ఎక్కడెక్కడికి వెళితే బాగుంటుంది? అన్న సవాలక్ష ఆలోచనలు వస్తుంటాయి. మీరు ఎలాంటి ఆలోచనలు చేయకుండా.. మీ లవర్ ను సంతోషపెట్టే కొన్ని చిట్కాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి. 
 

valentine week 2024: ఫిబ్రవరి నెలలో వచ్చే వాలెంటైన్స్ వీక్ ప్రేమికులకు చాలా ప్రత్యేకం. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు ఏ రోజున ఏం చేయాలి? ఎక్కడి ప్లాన్ చేసుకోవాలి? ఈ వీక్ స్పెషల్ గా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుంది? అన్న ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతుంటాయి. ఈ వాలెంటైన్ వీక్ మీ జీవితాంతం గుర్తిండిపోవడానికి? మీ లవర్ ను సంతోషపెట్టడానికి మీరు ఏమేం చేయొచ్చు ఓ లుక్కేద్దాం పదండి. 

ట్రిప్ ప్లాన్ చేసుకోండి

మీరు కావాలనుకుంటే ఈ వాలెంటైన్ వీక్ లో మీ భాగస్వామితో కలిసి ఎంచక్కా ట్రిప్ కు  వెళ్లిరండి. అవును ట్రిప్ అనే మాట చిన్నగా అనిపించినా.. ఇది మీ లవర్ ను ఎంతో హ్యాపీగా ఫీలయ్యేలా చేస్తుంది. కొత్త ప్లేస్ ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. సో మీరు ఈ వాలెంటైన్స్ వీక్ లో ట్రిప్ ప్లాన్ చేస్తే ఎంతో స్పెషల్ గా ఉంటుంది. అలాగే ఒకప్పుడు ఇలా ట్రిప్ కు వెళ్లామని మీకు కూడా లైఫ్ లాంగ్ గుర్తిండిపోతుంది. అందులోనూ మీరు మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడిపితే వారు ఎంతో హ్యాపీగా ఫీలవుతారు. 
 


క్యాండిల్ లైట్ డిన్నర్

క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా మీకు ప్రత్యేకంగా నిలుస్తుంది. అందుకే ఈ వాలెంటైన్ వీక్ లో మీరు మీ భాగస్వామి కోసం క్యాండిల్ డిన్నర్ డేట్ ను ప్లాన్ చేయండి. ఇవి చిన్న విషయాలే అయినా.. అమ్మాయిలకు బాగా నచ్చుతాయి. మీరు వారికి ఇష్టమైన ప్లేస్ కు తీసుకెళ్తే కూడా వారు ఎంతో సంతోషంగా ఉంటారు. 
 


షాపింగ్ కు వెళ్లండి

ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని మరింత ప్రత్యేకం చేయడానికి.. మీరు మీ భాగస్వామితో షాపింగ్ కు వెళ్లండి. ముందే అమ్మాయిలకు షాపింగ్ అంటే పిచ్చి. కాబట్టి వారికి నచ్చిన బట్టలను లేదా వస్తువులను కొనండి. ఇది  ఈ వాలెంటైన్స్ వీక్ వారికి మరింత స్పెషల్ గా ఉంటుంది.

ఒక సెలూన్ తీసుకోండి

మీ గర్ల్ ఫ్రెండ్ కు  ఇవ్వగల బెస్ట్ గిఫ్ట్ లల్లో సెలూన్ ప్యాకేజీ ఒక్కటి. ఇది కూడా వారికి బాగా నచ్చుతుంది. మీ గర్ల్ ఫ్రెండ్ కు ఈ ప్యాకేజీని ఇచ్చిన వెంటనే మిమ్మల్ని ఖచ్చితంగా హగ్ చేసుకుంటుంది.  ఈ వాలెంటైన్ వీక్ లో మీ గర్ల్  ఫ్రెండ్ ను సంతోషపెట్టాలనుకుంటే మాత్రం ఈ గిఫ్ట్ ను ఖచ్చితంగా ఇవ్వండి. 

Latest Videos

click me!