ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సీక్రేట్స్ ఉంటాయి. ఈ సీక్రేట్స్ వ్యక్తిగతమైనవి. వీటిని ఎవరీతోనూ చెప్పుకోకూడదు. కొన్ని కొన్ని సార్లు భార్య లేదా భర్తకు కూడా చెప్పకూడదంటారు. పర్ననల్ విషయాలను, సీక్రేట్స్ ను రహస్యంగా ఉంచితేనే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. ఇలాంటి కొన్ని విషయాలను అందరితో పంచుకోవడం వల్ల మీరు మీ జీవితంలో ఊహించని సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే ఎలాంటి విషయాలను ఇతరులతో చెప్పకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ప్రైవసీ బాండ్
అబ్బాయిలు ఎక్కువగా సెక్స్ లైఫ్ గురించి కూడా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటారు. కానీ ఇలాంటి విషయాలను సన్నిహితులతో లేదా ఫ్రెండ్స్ తో పంచుకున్నప్పుడు వాళ్లు మీ భార్య లేదా భర్త గురించి వ్యక్తిగతంగా తెలుసుకుంటారు. ఇది భార్యాభర్తల మధ్య నమ్మకాన్ని తగ్గిస్తుంది. అలాగే మీ ఇద్దరి మధ్యనున్న సీక్రేట్స్ ను బయటపెడుతుంది.
ఆర్థిక సమాచారం
చాలా మంది సమాజంలో వీళ్ల గురించి గొప్పగా చెప్పుకోవాలనో లేదా తమ ఆర్థిక పరిస్థితి ఇలా ఉందని చెప్పుకోవడానికో.. వ్యక్తిగత ఆదాయం, రుణాలు, పెట్టుబడులు, పొదుపు వంటి, సంపాదన వంటి ఆర్థిక వివరాలన్నింటినీ పంచుకుంటారు. కానీ ఆర్థిక విషయాల గురించి ఎవ్వరితోనూ పంచుకోకూడదు. డబ్బుకు సంబంధించిన విషయాలను ఇతరులతో చెప్పినప్పుడు ఇది అపార్థాలకు దారితీస్తుంది. కొన్ని కొన్ని సార్లు తప్పుడు సలహాలు మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చొచ్చు.
సంబంధ సమస్యలు
సన్నిహితులు, కుటుంబ సభ్యుల సలహాలను తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే చాలా మంది భార్యాభర్తల మధ్యనున్న కొన్ని సమస్యల గురించి అందరి ముందు మాట్లాడుకుంటుంటారు. భార్య లేదా భర్త గురించి నలుగురిలో మాట్లాడటం మంచిది కాదు. ఎందుకంటే ఇది మీ గొడవలను, కొట్లాటలను మరింత పెంచుతుంది.
గతం గురించి
చాలా మందికి గతంలో సంబంధాలు ఉంటాయి. కానీ చాలా మంది భార్య లేదా భర్త ఫ్రీగా ఉండేసరికి గత సంబంధాల గురించి మొత్తం చెప్పేస్తుంటారు. మీ భార్య లేదా భర్త ఎంత మంచివారైనా గత సంబంధాల గురించి చెప్పకపోవడమే మంచిది. అలాగే వారి సంబంధాల గురించి తెలిసినా ఇతరులతో ఈ విషయాలను అస్సలు పంచుకోకూడదు. ఇది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది.
జీవిత భాగస్వామి వివరాలు
మీ జీవిత భాగస్వామికి సంబంధించిన వివరాలను కూడా ఇతరులతో అస్సలు చెప్పకూడదు. మీ వారికి సంబంధించిన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల అతని ప్రతిష్ఠకు భంగం కలుగుతుంది.