ముద్దు సరిగ్గా ఎలా పెట్టాలంటే?

First Published Nov 18, 2023, 2:03 PM IST

ఫస్ట్ టైం ముద్దైనా, కాకపోయినా.. ముద్దు పెట్టుకోవడానికి కొన్ని పద్దతులన్నాయంటారు నిపుణులు. వీటిని ఫాలో అయితే మీరు ముద్దును మరింత సేపు ఆస్వాదిస్తారు. అలాగే మీ భాగస్వామిని మీ ముద్దుతో ఇప్రెస్ చేస్తారు. మరి ముద్దు సరిగ్గా పెట్టాలంటే ఎలాంటి చిట్కాలను ఫాలో అవ్వాలో తెలుసుకుందాం పదండి. 
 

ఒక మధురమైన ముద్దు మీ భాగస్వామిపై మీకున్న ప్రేమనంతా చెప్తుంది. అందుకే ముద్దును ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఈ ముద్దు భాగస్వాముల మధ్య శృంగారాన్ని చూపించడానికి ఒక మార్గంగా ఉపయోగిస్తారు. సెక్స్ లో పాల్గొనడానికి సంకేతంగా చాలా మంది ముద్దును వాడుతుంటారు. అయితే చాలా మంది ముద్దు పెడుతుంటారు. కానీ సరిగ్గా పెట్టరు. అంటే ముద్దుతో కూడా ఇబ్బందిపడుతుంటారన్న మాట. ముక్కు రాసుకోవడమో.. తలలు తగలడమో వంటివి జరుగుతుంటారు. ఇలాంటివి ముద్దుకు ఆటంకం కలిగిస్తాయి. 

Image: Getty Images

సరిగ్గా ముద్దు పెట్టుకోవడానికి చిట్కాలు

ముద్దు కేవలం శారీరక అవసరం మాత్రమే కాదు.. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య భావోద్వేగ బంధాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి ముద్దును సరిగ్గా పెట్టడానికి ఎలాంటి చిట్కాలను ఫాలో కావాలో తెలుసుకుందాం పదండి.
 

Image: Getty Images


సమ్మతి ముఖ్యం

సినిమా అనే ఫాంటసీ ప్రపంచం మనకు నేర్పిన విషయమేంటంటే? ముద్దు పెట్టుకోవడానికి ఎలాంటి సమయం, సందర్భం అవసరం లేదని. ఇది నిజం కూడా. ముద్దు ఎంత ఆకస్మికంగా ఉంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు. కానీ మీరు రొమాంటిక్ డేట్ లేదా ఒక ప్రత్యేకమైన క్షణం కోసం బయటకు వెళ్తున్నారంటే.. ఇలాంటివి వారికి ముందుగానే చెప్పేయడం మంచిది. ఎందుకంటే ఇది వారిని అందుకు సిద్దం చేస్తుంది. అయితే ఆకస్మిక ముద్దు శృంగారానికి సంకేతంగా అనిపించొచ్చు. కానీ మీరు ముద్దు పెట్టుకునే ముందు అడగడం చాలా మంచిది. ఇది మరింత రొమాంటిక్, గౌరవప్రదంగా ఉంటుంది. 
 

నుదిటిని కొట్టడం మానుకోండి

ముద్దు పెట్టుకునేటప్పుడు రెండు ముక్కులు తగులుతుంటాయి. అలాగే ఇద్దరి నుదుర్లు కూడా ఒకదానికొకటి కొట్టుకుంటాయి. మీకు సరిగ్గా ముద్దు పెట్టడం తెలిస్తే ఇలాంటి తప్పు అస్సలు జరగదంటారు నిపుణులు. ఇలా అయ్యిందంటే మీరు ఫస్ట్ టైం ముద్దు పెట్టుకుంటున్నారని అర్థమేమీ కాదు. నిజానికి ఇది మీ జీవితాతం గుర్తుండిపోతుంది. ఈ సన్నివేశం మీకు నవ్వు తెప్పిస్తుంది. కానీ ఇలా జరగకూడదంటే.. మీ భాగస్వామి ముఖాన్ని సున్నితంగా, కొంచెం పక్కకు తిప్పండి.

Image: Getty Images

కంటి సంపర్కం 

చాలా మంది కళ్లు మూసుకునే ముద్దు పెట్టుకుంటారు. కానీ మీ మధ్య సాన్నిహిత్యం పెరగాలంటే మాత్రం కళ్లు తెరిచే ముద్దు పెట్టుకోండి. అలాగే ముద్దు కోసం కాస్త వంగండి. ఇది మీరు ముద్దు పెట్టుకునే అభిరుచిని పెంచుతుంది. అలాగే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. 

Image: Getty Images

ముద్దు కోసం వంగి ఉండండి

ముద్దు మీకు మధురమైన అనుభూతిని కలిగించాలా? అయితే మీ భాగస్వామికి దగ్గరగా వంగి, వారి బాడీ లాంగ్వేజ్ గమనించండి. ఇది మీరు ఎక్కువ సేపు ముద్దు పెట్టుకోవడానికి సహాయపడుతుంది. ఇది ఒక ఉల్లాసకరమైన టీజ్ లాగా  కూడా ఉంటుంది తెలుసా? ఇది మీ భాగస్వామికి మరింత ఆసక్తిని కలిగిస్తుంది. 
 

నెమ్మదిగా, సున్నితంగా 

ముద్దును ఫాస్ట్ ఫాస్ట్ గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి సున్నితమైన ముద్దు మీకు మంచి అనుభవాన్ని కలిగిస్తుంది. అందుకే ముద్దును నెమ్మదిగా పెట్టండి. ఎక్కువ ఒత్తిడి లేకుండా మీ నోటిని రిలాక్స్ గా ఉంచండి.
 

ముద్దును పొడిగించండి

ముద్దు మీకు నచ్చితే ఎక్కువ సేపు పెట్టడానికి ట్రై చేయండి. మీరు ముద్దును ఎక్కువ సేపు పెట్టాలనుకుంటే మీ ఒత్తిడి స్థాయిలు ఇట్టే తగ్గిపోతాయి.  వివిధ స్థాయిల ఒత్తిడిని ప్రయత్నించండి.  అలాగేపెక్ లేదా లిప్ కిస్ ను ట్రై చేయండి. మీ భాగస్వామి పై పెదవి నుంచి వారి దిగువ పెదవి వరకు ముద్దును పెట్టడానికి ప్రయత్నించండి. 
 

మీ చేతులను ఉపయోగించండి

ముద్దు అంటే కేవలం పెదవులు, నాలుకను మాత్రమే కాదు మీ చేతులను కూడా ఉపయోగించొచ్చు.  పెదాలను లాక్ చేసేటప్పుడు మీ శరీర సంపర్కాన్ని పెంచడానికి చేతులను ఉపయోగించండి. మీరు మీ భాగస్వామి మెడ చుట్టూ ఒక చేతిని ఉంచొచ్చు. అలాగే మరొక చేతిని వారి జుట్టుపై పెట్టొచ్చు. లేదా మీ భాగస్వామిని నడుమును పట్టుకోవచ్చు. 
 

నోటి పరిశుభ్రత

ఇద్దరు భాగస్వాములలో ఏ ఒక్కరి నోరు పరిశుభ్రంగా లేకపోయినా.. ముద్దుపై ఇంట్రెస్ట్ పోవచ్చు. నోట్లో నుంచి వాసన వస్తే ముద్దుపై ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. ఈ చిట్కాలు కూడా పనిచేయవు. కాబట్టి నోటి పరిశుభ్రతను తప్పకుండా పాటించండి. 

click me!