సెక్స్ స్టామినాను పెంచుకోండిలా..!

First Published | Nov 17, 2023, 2:06 PM IST

సెక్స్ లైఫ్ మెరుగ్గా ఉండాలంటే సెక్స్ స్టామినా ఖచ్చితంగా ఉండాలి. అయితే చాలా మంది చాలా త్వరగా అలసిపోతుంటారు. ఇలాంటి వారికి కొన్ని చిట్కాలు ప్రభావవంతంగా ఉంటాయి. అవేంటంటో మీరూ ఓ లుక్కేయండి. 

స్టామినా కేవలం పరుగెత్తడం లేదా స్విమ్మింగ్ పూల్ లో త కొట్టడానికి మాత్రమే పరిమితం కాదు. స్టామినా అంటే లైంగిక కార్యకలాపాలకు కూడా అవసరమే. ఇది మీకు మీ భాగస్వామికి ఆనందాన్నిస్తుంది. చాలా మంది పురుషులు తమ లైంగిక పనితీరును మెరుగుపరచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నుంచి డేటాబేస్ ప్రకారం.. 30 శాతానికి పైగా పురుషులు శారీరక శ్రమ చేయకపోవడం,ఊబకాయం కారణంగా లైంగికంగా చురుగ్గా ఉండలేకపోతున్నారని నివేదించారు. ఏదేమైనా ఆరోగ్యకరమైన లైంగిక జీవితాన్ని ఆస్వాదించాలంటే సెక్స్ స్టామినా మెరుగ్గా ఉండాలి. 
 

Right time for sex


సెక్స్ స్టామినా పెంచుకోవడం ఎలా?

నిపుణుల ప్రకారం.. లైంగిక కోరికలు వయసుతో పాటుగా హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. ప్రెగ్నెన్సీ, రుతువిరతి లేదా అనారోగ్యం వంటి మార్పులు సెక్స్ డ్రైవ్ ను ప్రభావితం చేస్తాయి. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు, శారీరక మార్పులు, మందులు, హార్మోన్ల మార్పులు, జీవనశైలి లోపాలు, అలసట, కొన్ని రకాల మందులు, మానసిక సమస్యలు కూడా సెక్స్ డ్రైవ్ ను తగ్గిస్తాయి. మరి సెక్స్ స్టామినా పెరగడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


ఫోర్ ప్లే 

సెక్స్ లో ఫోర్ ప్లే కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మీ భాగస్వామిలో లైంగిక కోరికలను పెంచుతుంది. అంతేకాదు ఇది అంగస్తంభనతో పోరాడుతున్న పురుషులకు కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఫోర్ ప్లేలో ముట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం, ఓరల్ సెక్స్ లు ఉంటాయి. ఫోర్ ప్లే లో ఎక్కువగా పాల్గొంటే మహిళలకు మంచి అనుభూతి కలుగుతుంది. ఇది భావప్రాప్తి పొందే అవకాశాన్ని కూడా పెంచుతుంది. ఎందుకంటే చాలా తక్కువ మంది మహిళలు కేవలం సంభోగం ద్వారే ఉద్వేగానికి చేరుకుంటారు. 
 

 స్టార్ట్-స్టాప్ టెక్నిక్

మంచంపై ఎక్కువసేపు ఉండాలనుకునే పురుషులు స్టార్ట్-స్టాప్ టెక్నిక్ ను ప్రయత్నించొచ్చు. ఈ పద్దతిలో స్ఖలనం దగ్గరగా ఉందని భావించిన ప్రతిసారీ లైంగిక చర్యను ఆపండి. లోతైన శ్వాస తీసుకోండి. మళ్లీ నెమ్మదిగా ప్రారంభించండి. ఆపై మీరు కోరుకున్నంత కాలం స్ఖలనాన్ని ఇలా వాయిదా వేస్తూ సెక్స్ ను ఎక్కువ సేపు ఆస్వాదించొచ్చు. 
 

కొత్త విషయాలను ప్రయత్నించండి

ఉద్వేగం, అభిరుచులు లైంగిక ఆనందాలను ప్రేరేపిస్తాయి. మీ భాగస్వామి స్పర్శ మీకు కొత్తగా ఏం అనిపించకపోవచ్చు. ఇలాంటప్పుడు సెక్స్ బోరింగ్ గా అనిపించకుండా మీరు కొత్తి లైంగిక పద్దతులను, కొత్త సెక్స్ పొజీషన్స్ ను ట్రై చేయొచ్చు. అలాగే మీ లైంగిక జీవితం మరింత ఆనందంగా ఉండేందుకు ఒకరితో ఒకరు లైంగిక ఫాంటసీల గురించి చెప్పుకోండి. 
 

ఒత్తిడిని తగ్గించుకోండి

ఒత్తిడి స్థాయిలు ఎక్కువగా ఉంటే లిబిడో తగ్గిపోతుంది. అలాగే అంగస్తంభన లోపం సమస్య కూడా వస్తుంది. లైంగిక కోరికలు కూడా కలగవు. అందుకే ధ్యానం లేదా యోగా వంటి పద్దతులతో ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయండి. 
 

Latest Videos

click me!