భార్యభర్తలు ఈ విషయాలను బయట పెడుతున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలుసా?

First Published | Jan 7, 2022, 4:09 PM IST

వైవాహిక జీవితం ప్రేమానురాగాలు, కోపతాపాలు ఇలా ఎన్నో భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ఇక కొందరు తమ వైవాహిక జీవిత విషయాలను ఇతరులతో చెబుతుంటారు. తమ మధ్య ఉండే రహస్యాలను స్నేహితులతో, నమ్మకస్తులతో పంచుకుంటారు. కానీ ఇలా పంచుకోవడంతో జరిగే కొన్ని అనర్థాల గురించి తెలుసుకుందాం..
 

ఆలుమగల మధ్య జరిగే కొన్ని వ్యక్తిగత విషయాలను (Personal's) స్నేహితులతో, సన్నిహితంగా ఉండే బంధువులతో చర్చించకపోవడమే మంచిది. స్నేహితులతో ఉండే బంధానికి భాగస్వామితో ఉండే బంధానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీరు ఎంతగానో నమ్మే స్నేహితులు, బంధువులు మీకు ఎంత మద్దతు ఇచ్చిన వారితో బంధం అనేది ఒక ఒక పరిమితిలో (Limit) ఉంటుంది.
 

కనుక ఆలుమగల మధ్య ఉండే రహస్యాలను (Secrets) వారితో చర్చించుట పోవడమే మీ వైవాహిక జీవితానికి మంచిది. ఇలా చర్చించకూడని ఆసక్తికరమైన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం (Error) అంటూ ఉంటుంది. అలాగే మీ భాగస్వామిలో ఉన్నా లోపాల గురించి మీ స్నేహితులతో, బంధువులతో చర్చించడం మంచిది కాదు.

Latest Videos


ఈ విషయాల గురించి వారికి చెప్పినప్పుడు నలుగురిలో ఎగతాళి (Ridiculous) చేసే అవకాశం ఉంటుంది. మీ భాగస్వామికి మీకు మధ్య జరిగిన గొడవ గురించి ఇతరులతో చర్చించరాదు. వాటిని మీరే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అప్పుడే మీ మధ్య మూడో వ్యక్తి జోక్యం ఉండదు. ఆలుమగలకు సంబంధించిన పడక గదిలోని ఏకాంత ఫోటోలను (Photos) మీ సన్నిహితులకు షేర్ చేయడం మంచిది కాదు.

ఈ ఫోటోలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయరాదు. ఈ ఫోటోలను గోప్యంగా ఉంచడం మంచిది. మీరు భాగస్వామితో కలిసి ఏకాంతంగా దిగిన ఫోటోలను ఇంటర్నెట్ లో షేర్ చేస్తే వాటిని దుర్వినియోగం (Abuse) చేసే అవకాశం ఉంటుంది. దీంతో భార్యాభర్తల మధ్య అపార్ధాలు (Misunderstandings) మొదలవుతాయి. 
 

మీ లైంగిక జీవితానికి (Sex life) సంబంధించిన పడకగది విషయాలను ఇతరులతో పంచుకోరాదు. పడకగదిలో మీ భాగస్వామి కోరికలు, ఇష్టాలు ఏ విధంగా ఉంటాయో వాటి గురించి చర్చించరాదు. మీపై నమ్మకంతో (Believe) మీ భాగస్వామి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తారు. కనుక ఇలాంటి విషయాలను ఇతరులతో పంచుకోవాల్సిన అవసరం లేదు.
 

మీ భాగస్వామి గత జీవిత విషయాల గురించి  ఇతరులతో చర్చించరాదు. గడిచిపోయిన విషయాలను తిరిగి గుర్తు చేయడం మీ వైవాహిక జీవితానికి మంచిది కాదు. మీ ఆర్థికపరమైన సమస్యల (Financial Problems) గురించి ఇతరులతో చర్చించరాదు. వీటి గురించి చర్చిస్తే వారు మీ పై సానుభూతి (Sympathy) చూపుతారు.

మీకు ఆర్థిక సమస్యలు ఇబ్బందులు ఉన్నందుకు వారు మీ నుంచి దూరం వెళ్లే అవకాశం ఉంటుంది. మీకు ఎటువంటి సహాయం చేయరు. అయితే ఆర్థిక సమస్యల గురించి స్నేహితులు, కుటుంబసభ్యుల సలహాలను తీసుకోవడం మంచిది.

click me!