పెళ్లికి ప్రపోజ్ చేద్దామనుకుంటున్నారా? ఆగండి.. తొందరపాటు నిర్ణయం వద్దు..

First Published | Jan 11, 2024, 10:40 AM IST

జీవితంలో ఎప్పుడో ఒకసారి  ప్రేమలో పడటం చాలా కామన్. ఇక ప్రేమించిన వారితో జీవితాంతం కలిసి ఉండాలంటే వారికి మీ ప్రేమ విషయాన్ని చెప్పేయాలి. అయితే జీవితాంతం ఒకరికి తోడుగా ఉండే జంట పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యం. లేదంటే జీవితంలో ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. 

పెళ్లి అనేది చాలా పెద్ద నిర్ణయం. ఎందుకంటే లైఫ్ మొత్తం మీరు వారితోనే జీవించాలి మరి. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి తొందరపడకూడదు. లేకపోతే మీరు మీ నిర్ణయానికి పశ్చాత్తాపపడాల్సి  ఉంటుంది. లుక్స్, మనీ, మంచి ఫ్యామిలీ, జాబ్... రిలేషన్ షిప్ లో ఇవన్నీ అవసరమే. కానీ సంతోషకరమైన వైవాహిక జీవితానికి ఇవి మాత్రమే సరిపోవు. మీరు కూడా ఎవరితోనైనా రిలేషన్ షిప్ లో ఉండి.. అతనితో భవిష్యత్తు గురించి కలలు కంటుంటే, ప్రపోజ్ చేసే ఆలోచన కూడా ఉంటే.. మీరు కొన్ని విషయాల్లో క్లారిటీ తెచుకోవాలి? 

Image: Freepik

అనుకూలతను తనిఖీ చేయడం 

మీ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తుంటే మీ భాగస్వామి కూడా ఇందుకు సానుకూలంగానే ఉన్నాడా. ఈ విషయంలో ఇద్దరి కెమిస్ట్రీ కంటే అనుకూలత  చాలా అవసరం. ప్రేమ బంధంలో ఇది చాలా ముఖ్యమైన విషయం కూడా. పెళ్లికి పునాకి ఇదే అని చెప్పొచ్చు. ఇది మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది. అనుకూలత అంటే మీ ఇద్దరికీ ఒకే రకమైన ఆలోచనలు, ఆసక్తులు, అభిరుచులు ఉండటం. ప్రతి విషయంలో మీకంటే భిన్నమైన అభిప్రాయం ఉన్న వ్యక్తితో మీరు ఎలా లైఫ్ ను లీడ్ చేస్తారు. ఇలా మీ భాగస్వామి ఉంటే.. ఒకటికి రెండు సార్లు పెళ్లికి ప్రపోజ్ చేసే ముందు ఆలోచించండి. ఎందుకంటే దీనివల్ల మీ ఇద్దరి మధ్య తరచూ మనస్పర్థలు వస్తాయి. మీ భాగస్వామి చెప్పిందే మీరు చేయాల్సి వస్తది. కాబట్టి మీకు అనుకూలంగా.. అంటే మీ ఇద్దరి ఆలోచనలు ఒకేవిధంగా ఉన్న వ్యక్తితో జీవితాన్ని పంచుకుంటే మంచిది. 

Latest Videos


Image: Freepik


భావాలను అర్థం చేసుకోవడం

ప్రపోజ్ చేసే ముందు ప్రేమకు, ఆకర్షణకు మధ్య తేడా తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. చాలా సార్లు ఒకరి లుక్స్, ఒకరి తెలివితేటలు, ఒకరి వ్యక్తిత్వానికి ఆకర్షితులవుతాం. కానీ దీని ఆధారంగా కలిసి జీవితాన్ని గడపాలని నిర్ణయించుకోలేం. వివాహం అనేది దీర్ఘకాలిక నిబద్ధత. అదుకే పెళ్లికి అడుగులు వేయడానికి తొందరపడకండి. 
 

ఆర్థిక స్థిరత్వాన్ని గమనించండి

వివాహం తర్వాత బాధ్యతలు కొద్దిగా పెరుగుతాయి. దీని వల్ల చాలాసార్లు గొడవలు కూడా వస్తాయి. కాబట్టి ప్రపోజ్ చేసే ముందు ఆర్థిక స్థిరత్వాన్ని చూడటం చాలా ముఖ్యం. పెళ్లైన తర్వాత భాగస్వామి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి అనుకుంటే అది సాధ్యమవుతుందా? లేదా? అని ఒకసారి కూర్చొని ఆలోచించండి. దీని గురించి చర్చించండి.

click me!