ప్రేమ నిజంగానే గుడ్డిదా..? శాస్త్రవేత్తలు చెప్పిన కారణం ఇదే..!

First Published Jan 10, 2024, 3:55 PM IST

అలాంటి వారిని చూసినప్పుడే. ప్రేమ గుడ్డిది అనే సామేతను వాడుతూ ఉంటారు. అయితే.. చాలా సాధారణంగా వాడే నానుడి. అంతేకానీ.. అది నిజంగా నిజం అని ఎవరూ నిరూపించలేదు. అయితే.. తాజాగా.. ప్రపంచంలో తొలిసారిగా.. ఈ విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధన చేసి.. నిజంగానే ప్రేమ గుడ్డిదని నిరూపించారు.

ప్రేమ ఓ అద్బుతం.  ఒక మనిషి మరో మనిషిని అమితంగా ప్రేమించినప్పుడు వారిలోని శారీరక, మానసిక లోపాలు, తప్పులు వారికి కనిపించవు. ఇతరులకు స్పష్టంగా వాళ్లలోని లోపాలు, తప్పులు కనపడుతున్నా.. ప్రేమించిన వారు మాత్రం వాటిని అంగీకరించడానికి సముఖత చూపించరు. అలాంటి వారిని చూసినప్పుడే. ప్రేమ గుడ్డిది అనే సామేతను వాడుతూ ఉంటారు. అయితే.. చాలా సాధారణంగా వాడే నానుడి. అంతేకానీ.. అది నిజంగా నిజం అని ఎవరూ నిరూపించలేదు. అయితే.. తాజాగా.. ప్రపంచంలో తొలిసారిగా.. ఈ విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధన చేసి.. నిజంగానే ప్రేమ గుడ్డిదని నిరూపించారు.
 


మీకు నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం.. ఆస్ట్రేలియాకు చెందిన పలువురు  శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది.  మానవ మెదడు పనితీరు, శృంగారం, ప్రేమ మధ్య సంబంధాన్ని ఈ శాస్త్రవేత్తలు పరిశోధించారు. అయితే.. వారు పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే.. ప్రేమ.. మనిషి మెదడును మార్చేస్తుందట. ప్రేమలో పడినప్పుడు మనకు కలిగే ఆనందానికి కారణమైన ప్రేమ హార్మోన్ ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది.
 

Love couple

ఇప్పుడు, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ (ANU), యూనివర్శిటీ ఆఫ్ కాన్‌బెర్రా , యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పరిశోధకులు ... రొమాన్స్, లవ్ విషయంలో  మన ప్రియమైన వ్యక్తిని పీఠంపై కూర్చోబెట్టడానికి మెదడులోని ఒక భాగం ఎలా బాధ్యత వహిస్తుందో అంచనా వేశారు. ఈ పరిశోధన కోసం వారు దాదాపు 1556 మంది యువకులను సర్వే చేయడం గమనార్హం.

real love


సర్వేలో పాల్గొన్న వారిని వారి భాగస్వామి గురించి పలు ప్రశ్నలు వేశారు.  వారి భాగస్వామి పట్ల భావోద్వేగ ప్రతిస్పందన, వారి చుట్టూ ఉన్న వారి ప్రవర్తన , అన్నిటికీ మించి వారు తమ ప్రియమైన వ్యక్తిపై ఉంచిన దృష్టి ఇలా పలు విషయాలపై ప్రశ్నలు వేశారు. మనం ప్రేమలో ఉన్నప్పుడు, మన మెదడు భిన్నంగా స్పందిస్తుందని తేలింది. ఇది మన ఆప్యాయతలను మన జీవితానికి కేంద్రంగా చేస్తుంది.
 


కాన్‌బెర్రా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఫిల్ కవానాగ్ ప్రకారం,  రొమాన్స్,  ప్రేమ ప్రవర్తన , భావోద్వేగాలలో మార్పులతో ముడిపడి ఉందని అధ్యయనం చూపిస్తుంది. "రొమాంటిక్ ప్రేమలో ఆక్సిటోసిన్ పోషిస్తున్న పాత్ర మాకు తెలుసు, ఎందుకంటే మనం ప్రియమైన వారితో సంభాషించేటప్పుడు మన నాడీ వ్యవస్థ , రక్తప్రవాహంలో దాని తరంగాలు తిరుగుతాయి" అని వర్సిటీలోని అనుబంధ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కవానాగ్ అన్నారు.
 

"ప్రియమైనవారు ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకునే విధానం, అయితే, ఆక్సిటోసిన్ డోపమైన్‌తో కలిసి, శృంగార ప్రేమ సమయంలో మన మెదడు విడుదల చేసే రసాయనం. ముఖ్యంగా, ప్రేమ సానుకూల భావాలతో సంబంధం ఉన్న మెదడులోని మార్గాలను సక్రియం చేస్తుంది." అని సర్వేలో తేలినట్లు వారు చెప్పారు. అయితే.. ఈ పరిశోధన ఇంకా పూర్తికాలేదని.. చివరి దశ ఉందని వారు చెప్పారు.  చివరి దశలో ప్రేమ విషయంలో స్త్రీ, పురుషుల మధ్య ఉన్న వ్యత్యాసం.. ప్రపంచ వ్యాప్తంగా సర్వే చేయనున్నట్లు వారు తెలిపారు.

click me!