అత్తగారితో తిట్లు పడకూడదంటే ఇలా చేయండి?

First Published | Jun 28, 2024, 11:50 AM IST

అమ్మలా అత్త ఉండదన్న ముచ్చట అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది కోడళ్లు అత్తలతో అస్తమానూ తిట్లను తింటూనే ఉంటారు. అత్తగారితో మాటలు పడకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

పెళ్లి తర్వాత అమ్మాయిల జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత అమ్మాయిలు కొత్త కుటుంబంతో కలిసిపోవాలి. సర్దుకుపోవాలి. అయితే కొంతమంది కోడళ్లు అత్తమామలతో తరచుగా మాటలు పడాల్సి వస్తుంది. కొంతమంది అత్తలు కోడళ్లను ఊరికే తిడుతుంటారు. కానీ ఇలా కాకూడదంటే కోడళ్లు ఏం చేయాలో తెలుసుకుందాం పదండి. 

వాదించడం మానుకోండి

మీకు నచ్చని విషయాన్ని మాట్లాడినా, మిమ్మల్ని దెప్పిపొడిచినట్టు మీ అత్తగారు మీతో మాట్లాడుతున్నప్పుడు కోపం తెచ్చుకోకుండా ఉండండి. అలాగే ఆమెకు వ్యతిరేకమైన సమాధానం చెప్పండి. ఒకవేళ మీరు ఇలా చేశారంటే మీ అత్తగారితో మీరు మాటలు పడాల్సి వస్తుంది. మీ అత్తగారితో గొడవలు, మనస్పర్థలు ఎందుకులే అనుకుంటే మాత్రం వాదనలకు దూరంగా ఉండండి. 
 

Latest Videos


కూర్చొని మాట్లాడండి.

మీ అత్తగారి గురించి మీకు చెడుగా అనిపిస్తే వెంటనే ఆమెపై కోపం తెచ్చుకోకండి. అలాగే ఆమెతో వాదించకండి. దీనివల్ల మీకు వచ్చే లాభం ఏదీ ఉండదు. అందుకే దీనికి బదులుగా మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ అత్తగారితో కూర్చొని జోలి చెప్పండి. అలాగే ప్రేమగా వారితో మీకు నచ్చని విషయాన్ని చెప్పండి. 
 

భాగస్వామితో మాట్లాడండి

మీకు నచ్చని విషయాల గురించి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయాల గురించి మీరు మీ భర్తతో నిర్మొహమాటంగా చెప్పండి. మీరు మీరు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రండి. కానీ కుటుంబ సభ్యుల గురించి ఎవ్వరి ముందూ చెడుగా మాట్లాడకూడదన్న సంగతిని గుర్తుంచుకోండి. 

ఎక్కువ ఆశించొద్దు

అత్తగారు తల్లిలా చూసుకుంటే బాగుండు అని చాలా మంది అనుకుంటారు. అలాగే అత్తగారి నుంచి దీన్ని ఆశిస్తుంటారు చాలా మంది. కానీ ఈ తప్పును ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే అత్తలు, అమ్మలా చూసుకోవడం సాధ్యం కాని విషయం. అందుకే అత్తల నుంచి అమ్మలా చూసుకుంటుందన్న విషయాన్ని ఆశించకండి. దీనివల్ల మీరు బాధపడాల్సి వస్తుంది. 
 

ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకోవద్దు.

మీరు మీ అత్తగారి తిట్ల నుంచి దూరంగా ఉండాలనుకున్నా, ఆమె తిట్ల వల్ల మీరు బాధపడకూడదన్నా ఆమె అన్న ప్రతి చిన్న విఫయాన్ని మనసులో పెట్టుకోవడం మానుకోండి. ఆమె అనే చిన్న చిన్న మాటలను , విషయాలను పట్టించుకోవడం నేర్చుకోండి. దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. 

మానసిక దూరం పాటించండి

మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలనుకుంటే.. మీరు మీ అత్త నుంచి మానసిక దూరాన్ని పాటించండి. ఇది వారి తిట్ల వల్ల మీరు ఎక్కువగా ప్రభావితమవ్వకుండా ఉంటారు. మీ అత్తగారి తిట్లకు ఎక్కువగా బాధపడకూడదంటే మీరు ఇతర పనుల్లో బిజీగా ఉండటం అలవాటు చేసుకోవాలి. 
 

click me!