శృంగారం అనేది కేవలం శారీరక తృప్తి అని అందరూ భావిస్తుంటారు. కానీ.. అది చాలా తప్పని చెబుతున్నారు నిపుణులు. శృంగారం అనేది ఓ దివ్య ఔషదమని చెబుతున్నారు.
కేవలం భావప్రాప్తి కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు. రోజూ శృంగారం చేయడం వలన మనం ఊహించని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దామా...
1.గుండె పదిలం.. రోజూ శృంగారంలో పాల్గొనే వారిలో గుండె సంబంధిత సమస్యలు తక్కువగా వస్తాయంటున్నారు నిపుణులు. రోజూ సెక్స్ చేయడం వల్ల మంచి హార్మోన్లు విడుదలౌతాయని.. వాటివల్ల గుండె ఆరోగ్యంగా తయారౌతుంది. కనీసం వారానికి రెండు లేదా మూడుసార్లు అయినా.. శృంగారం చేస్తే.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
2. క్యాన్సర్.. క్యాన్సర్.. ఈ పేరు వింటేనే చాలా మంది భయపడిపోతుంటారు. ఎందుకంటే క్యాన్సర్ వస్తే.. మనిషి క్షీణించిపోతాడు. అయితే.. రోజూ సెక్స్ చేయడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ లకు దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు నిపుణులు.
3. ప్రశాంతమైన నిద్ర.. చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. సరైన నిద్ర లేకపోతే.. ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది. అయితే.. ఈ సమస్యకి చక్కని పరిష్కారం శృంగారమని చెబుతున్నారు నిపుణులు.
4. యవ్వనం.. వయసు పెరిగే కొద్ది వృద్ధాప్య చాయలు రావడం సహజం. దీనిని కొంత వరకు నివారించడం మన చేతుల్లోనే ఉంటుందంటున్నారు నిపుణులు. వారి పరిశోధనల ప్రకారం.. శృంగారంలో రోజూ పాల్గొనే వారు.. ఎక్కువ కాలం యవ్వనంగా కనిపిస్తారు.
5. సంపాదన.. సెక్స్.. కి డబ్బుకి ఏంటి సంబంధం అనుకుంటున్నారు. నిజంగానే సంబంధం ఉంది. నిపుణులు సర్వే ప్రకారం.. శృంగార జీవితం సుఖంగా ఉన్నవారు.. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారని చెబుతున్నారు.
సెక్స్ రోజూ చేయడం వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది. దీంతో.. ఉదయం పూట ఆఫీసుల్లో పని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా చేసుకోగలరట. దీంతో 100శాతం పని మీద దృష్టిసారించగలరు.. దాంతో ఆర్థికంగా లాభం చేకూరుతుందని వారు సూచిస్తున్నారు.