బ్రేకప్ బాధ నుంచి బయపడి జీవితంలో ముందుకు సాగడం ఎలా?

First Published | Feb 3, 2024, 3:44 PM IST

Relationship Tips: జీవితంలో జయాపజయాలు చాలా సహజం. మనం కోరుకున్నట్టు లైఫ్ ఉండకపోవచ్చు. అయితే చాలా మంది బ్రేకప్ బాధనుంచి బయటపడలేకపోతుంటారు. దీంతో వారి జీవితం అక్కడే ఆగిపోతుంది. అందుకే బ్రేకప్ బాధ నుంచి బయటపడి జీవితంలో ముందుకు ఎలా సాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ప్రేమ అనేది ప్రతి ఒక్కరికీ వచ్చే కామన్ ఫీలింగ్. మనం ఇష్టపడ్డ అమ్మాయి లేదా అబ్బాయితో జీవితాంతంగా ఉంటే అంతకంటే కావాల్సిందేమీ లేదు అనిపిస్తుంది. కానీ అన్ని సార్లు మనం కోరకున్నట్టుగా లైఫ్ ఉండదు. అంటే ఇష్టమైనవారితో మధ్య బ్రేకప్ కావొచ్చు. బ్రేకప్ అంత చిన్న విషయమేమీ కాదు. ప్రేమించిన వారిని మర్చిపోవడం కష్టమే. అందుకే బ్రేకప్ అయిన వారు ఒంటరిగానే ఉంటారు. జీవితం మొత్తం ముగిసిపోయినట్టుగా భావిస్తారు. ఇక జీవితంలో సర్వం కోల్పోయినట్టుగానే ఉంటారు. నిజానికి బ్రేకప్ మానసిక క్షోభకు కారణమవుతుంది. అందుకే బ్రేకప్ అయిన వారు రోజులు గడుస్తున్నా.. దీని నుంచి మాత్రం బయటపడరు. నిజానికి ఈ బాధ నుంచి బయటపడటం అంత సులువు కాదు.

breakup

కానీ మనకున్నది ఒకే లైఫ్ మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ఉన్నది ఒక్కటే జీవితం కాబట్టి.. దీన్ని పూర్తిగా ఆస్వాధించాలి. అందుకే బ్రేకప్ తర్వాత మీ జీవితాన్ని ఎలా అద్భుతంగా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


వైఫల్యం విజయానికి మొదటి మెట్టు

మీరు ఎన్నో ఏండ్లుగా మీకు ఇష్టమైన వారితో కలిసి ఉండొచ్చు. కానీ ఒక్కసారి వారితో మీ సంబంధం తెగిపోతే .. మీ వైఫల్యంగా భావించకండి. ఎందుకంటే మనం ఎదుర్కొనే ప్రతి ఫెయిల్యూర్ విజయానికి తొలి మెట్టు. అందుకే మీరు విడిపోవడాన్ని అంగీకరించండి. విడిపోవడంపై మీలో అపరాధభావం కూడా తీసుకురాకండి. అప్పుడే మీరు జీవితంలో ముందుకు వెళ్లగలుగుతారు.
 

మిమ్మల్ని మీరు బలహీనంగా భావించకండి

బ్రేకప్ కు కారణాలు ఏవైనా కానీయండి. దానికి మిమ్మల్ని మీరు నిందించుకోవడం మానేయండి. ఎందుకంటే ఇది మిమ్మల్ని బలహీనంగా చేస్తుంది. అలాగే మీరు ఇతరులతో కలిసి జీవించకుండా చేస్తుంది. అలాగే ఇది మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. అందుకే ఆ సంబంధంలో మీరు ఎదుర్కొన్న చేదు జ్ఞాపకాలను మర్చిపోయి ముందుకు సాగడం మంచిది. అప్పుడే మీరు జీవితంలో ఆత్మవిశ్వాసంతో జీవించగలరు.
 


మీ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని మార్చండి

మీరు ఎప్పుడు  ఆ వ్యక్తి గురించే ఆలోచిస్తున్నట్టైతే మీకు మీ జీవితం నరకంలా అనిపిస్తుంది. అందుకే ముందుగా మీ దృష్టిని మార్చడానికి మీ వాతావరణాన్ని మార్చండి. ఇందుకోసం మీకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లిరండి. ఇది మీ మనస్సుకు సానుకూలతను తెస్తుంది. అలాగే జీవితం మెరుగ్గా అనిపించడం ప్రారంభిస్తుంది. 

Latest Videos

click me!