బరువు ఎక్కువుంటే సెక్స్ లైఫ్ సంగతి అంతేనా?

First Published Mar 5, 2024, 3:57 PM IST

సెక్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ బరువు వల్ల సెక్స్ లైఫ్ నాశనమవుతుందని నిపుణులు అంటున్నారు. అవును బరువు ఎక్కువగా ఉండటం వల్ల కార్డియోవాస్క్యులర్ సమస్యలు, డయాబెటిస్ తో పాటుగా ఎన్నో వ్యాధులు వస్తాయి. ఇవి లైంగిక జీవితానికి ఆటంకం కలిగిస్తాయని నిపుణులు ఉంటున్నారు. 
 

అసలు ఇది మంచిదా? చెడ్డదా? అని ఆలోచించకుండా ఏవి పడితే అవి తింటే ఎన్నో వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా ఉంది. క్రమరహిత ఆహారపు అలవాట్లు, ఏవి పడితే మరీ ఎక్కువగా తినడం వల్ల నేడు చాలా మంది బరువు విపరీతంగా పెరుగుతుననారు. నిజానికి శరీరంలో నిల్వ చేయబడిన అదనపు కేలరీలే మీరు బరువు పెరగడానికి కారణమవుతాయి. బరువు పెరగడం వల్ల మీ బాడీ షేప్ మారడమే కాకుండా మీ  లైంగిక జీవితం కూడా ప్రభావితం అవుతుంది. బరువు ఎక్కువగా ఉన్న మగవారు, ఆడవాళ్ల శరీరంలో లిబిడో తగ్గుతుంది. సెక్స్ కోరికలు కలగవు. అలాగే వీరి లైంగిక జీవితం మొత్తం అసమతుల్యంగా మారుతుంది. 
 

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఊబకాయం కారణంగా ఎన్నో శారీరక మార్పులు వస్తాయి. హార్మోన్ల మార్పుల కారణంగా లిబిడో తగ్గుతుంది. ముఖ్యంగా బరువు ఎక్కువగా ఉన్నవారిలో టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిల్లో మార్పులు కనిపిస్తాయి. హార్మోన్ల అసమతుల్యత కారణంగా  టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి డేంజర్ సమస్యలొచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ రెండు వ్యాధుల కారణంగా లిబిడోపై దాని ప్రభావం కనిపిస్తుంది.

obesity

స్థూలకాయం లైంగిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

సైన్స్ డైరెక్ట్ అధ్యయనం ప్రకారం.. బరువును తగ్గించుకోవడం ఎలా అని ఆందోళన చెందుతున్న 30 శాతం మంది సెక్స్ డ్రైవ్, లిబిడో, పనితీరు గురించి ఆందోళన చెందుతున్నారు. స్థూలకాయం వల్ల లిబిడో తగ్గడంతో పాటుగా దాని ప్రభావం లైంగిక జీవితంపై కూడా పడుతుంది. ఊబకాయం లైంగిక ఆనందం, ఉద్వేగాన్ని చేరుకోవడం కష్టం. 
 

Image: Getty

ఒక ఎన్ఐహెచ్ పరిశోధనలో ఊబకాయం, సాధారణ బరువు కంటే ఎక్కువ ఉన్న 1,000 మంది పాల్గొన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న పురుషులు, మహిళల్లో సగానికి పైగా లైంగిక ఆనందం, సెక్స్ డ్రైవ్ లేదా లైంగిక పనితీరు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్టు కనుగొన్నారు. 5 శాతం మంది సెక్స్ కు దూరంగా కూడా ఉన్నారు. స్థూలకాయులకు అంగస్తంభన సమస్య వచ్చే ప్రమాదం కూడా ఉందని పరిశోధనలో తేలింది. దీంతోపాటుగా మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
 

low sex

అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఒబెసిటీ చేసిన ఒక పరిశోధన ప్రకారం.. ఊబకాయం రోజురోజుకు పెరుగుతుంది.  అలాగే ఇది మీ సెక్స్ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే వంధ్యత్వ సమస్య వచ్చే రిస్క్ కూడా ఉంది. ఆడవారు, మగవారు పెరుగుతున్న శరీర బరువు వల్ల ఎన్నో లైంగిక సమస్యలను ఎదుర్కొంటారు. పరిశోధనల ప్రకారం.. ఊబకాయం ఉన్నవారికి ఇతర వ్యక్తుల కంటే 25 శాతం ఎక్కువ లిబిడో లోపం ఉంటుంది.

click me!