భార్యభర్తల మధ్య గొడవలు రావడానికి అసలు కారణాలు ఇవే..!

First Published | May 28, 2024, 3:41 PM IST

ఇక.. భార్యభర్తలు అన్న తర్వాత.. ఒకరిపై మరొకరు అంచనాలు కలిగి ఉంటారు. కానీ.. అలా ఒకరిపై మరొకరు అంచనాలు పెట్టుకోవడం మొదలుపెట్టారు అంటే.. వారి మధ్య దూరం పెరగడం మొదలౌతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

couple fight

భార్యభర్తల బంధం చాలా గొప్పది. దానిని నిలపెట్టుకోవడానికి చాలా కష్టపడాలి. ఆ బంధం నిలపెట్టే బాధ్యత దంపతులు ఇద్దరి పైనా ఉంటుంది. వారి మధ్య ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదు. నిజాయితీ, గౌరవం, నమ్మకం కూడా అంతే ముఖ్యం. ఇవన్నీ ఉంటేనే బంధం బలోపేతం అవుతుంది. 

ఇక.. భార్యభర్తలు అన్న తర్వాత.. ఒకరిపై మరొకరు అంచనాలు కలిగి ఉంటారు. కానీ.. అలా ఒకరిపై మరొకరు అంచనాలు పెట్టుకోవడం మొదలుపెట్టారు అంటే.. వారి మధ్య దూరం పెరగడం మొదలౌతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి విషయాల్లో అంచనాలు పెట్టుకోకూడదో తెలుసుకుంటే.. వారి మధ్య సమస్యలే రావట. మరి అవేంటో  చూద్దాం..

Latest Videos



మీలాగే ఉండండి: మీ భాగస్వామి మీలాగే ఉండాలని మీరు కోరుకుంటే, అది తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. కాబట్టి, ఈ తప్పు ఎప్పుడూ చేయకండి. మీరు మీలాగే ఉండండి. వాళ్లని వాళ్లలాగాగే ఉండనివ్వండి.  వాళ్ళని అలాగే ప్రేమించండి. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది.

పరిపూర్ణతను ఆశించడం: మీ భాగస్వామి పరిపూర్ణంగా ఉండాలని మీరు ఆశించినట్లయితే, అది తప్పు. ఎందుకంటే నిజ జీవితంలో ఏ వ్యక్తి పరిపూర్ణంగా ఉండలేడు. కాబట్టి దీనిని ఆశించే బదులు మీ భాగస్వామిని ప్రేమించడం నేర్చుకోండి. వారిని వారు ఉన్నట్లుగా అంగీకరించడానికి ప్రయత్నించండి.

అవగాహన: మీరు ఏమీ చెప్పకుండానే మీ భాగస్వామి మీ మనసులో ఏముందో అర్థం చేసుకుంటారని అనుకోకండి. ఇది తప్పు.ఇది సాధ్యం కాదు. ఇది సంబంధంలో సమస్యలను పెంచుతుంది. ఈ విషయాల్లో క్లారిటీ ఉంటే... అసలు దంపతుల మధ్య సమస్యలు రావు. వచ్చినా.. విడిపోయేంత దూరం అయితే పెరగదు.

click me!