శృంగారం అనేది చీకటి వ్యవహారంగా చాలా మంది పరిగణిస్తూ ఉంటారు. అయితే... ఇది చాటు మాటుగా చర్చించుకోవాల్సిన విషయమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. శృంగారానికి తెరలు ఉండాలి కానీ... అవి గదులకు మాత్రమే పరిమితం కావాలని అని చెబుతున్నారు.
ఈ విషయం తెలిక.. చాలా మంది ఈ విషయాల గురించి మాట్లాడటం కూడా పెద్ద నేరం అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దాని వల్ల వచ్చే లాభాలు ఏమీ లేకపోయినా నష్టాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. దీంతో చీకటిలోనే అపోహలు సృష్టించేసుకుంటారు.
అర్థరహితంగా లో లోపలు భయాలను, అనుమానాలను పెంచుకుంటూ ఉంటారు. దీనిపట్ల అందరికీ ఆసక్తి ఉంటుంది.. కానీ మాట్లాడటానికే ఇబ్బంది పడిపోతుంటారు. ఈ సంగతి పక్కన పెడితే... అసలు ఈ శృంగార కోరికలు కలగడానికి కారణాలను, పలు ఆసక్తికర విషయాలను నిపుణులు తెలియజేశారు.
ఒక మనిషిలో శృంగార కోరికలు కలగడానికి నాలుగు కారణాలు ఉంటాయట. ఒకటి వారిలో హార్మోన్ల కారణంగా కలిగితే... రెండోది.. ఆ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం కారణంగా కూడా కోరికలు కలుగుతాయి. ఒక మూడోది మానిసిక కారణం అయితే.. మరోటి.. గతంలో శృంగార అనుభవం ఉంటే కోరికలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
కోరిక కలగడానికి అవి కారణమైతే చేతి స్పర్శ, కంటి చూపు, వినికిడి, వాసన, రుచి వల్ల కామ వాంఛ కలగవచ్చని చెబుతున్నారు. వయసు మీద పడుతున్నప్పుడు , సంబంధం దీర్ఘకాలంగా కొనసాగుతున్నప్పుడు తీవ్రమైన కామోద్దీపనలు కావాలని మనసు కోరుకుంటుందట.
ఒకరకమైన శృంగారం, ఒకే చోట చేస్తూ ఉంటే దానిపై ఆసక్తి తగ్గిపోయే అవాకశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కాగా.. చాలా మంది పురుషులు ఎక్కడైనా శృంగారం చేయగలరని అనుకుంటారని... కానీ అది తప్పని చెబుతున్నారు. తగినంత ఏకాంతం, భావోద్వేగ సాన్నిహిత్యం ఉన్నప్పుడే దానిని ఆస్వాదించగలరని చెబుతున్నారు.
ఇక చాలా మంది అంగ స్తంభన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాటికి కూడా ఆరోగ్య సమస్యలు మాత్రమే కాకుండా ఇతర కారణాలు కూడా తోడౌతాయని నిపుణులు చెబుతున్నారు.
గర్భదారణ కోసమే శృంగారం జరపడం, ఇంట్లో పిల్లలు ఉండటం, ఏకాంతం, గోపత్యత లేని సమయంలో కలయిక కోసం ఆరాటపడినా అంగ స్థంభన సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.