కొత్తగా పెళ్లైన దంపతులకు శృంగారం విషయంలో చాలా అనుమానాలు ఉంటాయి. వాళ్లకు వచ్చే అనుమానల్లో ఒకటి.. ఎక్కువ సార్లు సెక్స్ లో ప్రమాదమా కాదా..? అని ఎందుకంటే.. కొత్త ఉత్సాహంతో.. పెళ్లైన కొత్తలో ఎక్కువ సమయం దీనిపై దృష్టి పెడుతూ ఉంటారు.
అయితే.. కొద్ది రోజులకే ఇలా ఎక్కువగా చేయడం వల్ల నీరసపడిపోవడం.. ఇన్ఫెక్షన్స్ రావడం.. ప్రైవేట్ పార్ట్సల్ మంటలు రావడం లాంటివి జరగుతుంటాయి.
అసలు.. ఇలాంటి సమస్యలు రాకుండా.. ఆరోగ్యంగా ఉండాలంటే.. వారానికి ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొనాలి అనే విషయంలో..ఓ సంస్థ తాజాగా సర్వే జరిపింది.
వంద మంది కాలేజీ విద్యార్థుల మీద జరిపిన ఓ సర్వేలో.. వారంలో ఒకసారి లేదా అసలు సెక్స్ లో పాల్గొనని వారితో పోలిస్తే.. వారంలో రెండు సార్లు సెక్స్ లో పాల్గొన్న వారిలో ‘ఇమ్యునో గ్లోబ్యులిన్ ఎ’ అనే యాంటీబాడీస్ 30శాతం పెరిగినట్లు గుర్తించారు.
రోగనిరోధక శక్తి సామర్థ్యంలో ఇమ్యునోగ్లోబ్యలిన్ ఏ కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి తేలిక ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఆరోగ్యకంగా ఉండాలనుకుంటే.. కనీసం వారానికి రెండు సార్లు సెక్స్ లో పాల్గొనాలి. అంతకన్నా ఒకటి రెండుసార్లు ఎక్కువగా పాల్గొన్నా నష్టం ఏమీ ఉండదు.
దంపతులు ఇద్దరికీ ఆసక్తిగా ఉంటే.. రోజుకి ఒకసారి చేయడం వల్ల కూడా పెద్దగా నష్టమేమీ ఉండదట. అంతకు మించి మితీమీరి చేస్తే మాత్రం.. అనవసర సమస్యలు తలెత్తుతాయి అంటున్నారు నిపుణులు.
అయితే... చాలా మంది దంపతులు తాము వారానికి ఒక్కసారి మాత్రమే శృంగారంలో పాల్గొనగలుగుతున్నామని.. అంతకన్నా ఎక్కువ సార్లు చేద్దామని ప్రయత్నించినా ఫలించడం లేదని డాక్టర్ల దగ్గర వాపోతున్నారట. దీని వల్ల తమ భార్యలకు కోపం వస్తోందని చెబుతున్నారు.
ఈ సమస్యతో డాక్టర్ల దగ్గరకు వస్తున్న వారి సంఖ్య ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది. ఈ క్రమంలో ఆ సమస్యకు డాక్టర్లు పరిష్కార మార్గం చెబుతున్నారు.
అంగం స్తంభిస్తోంది కాబట్టి అంగంలోని రక్తనాళాల్లో అడ్డంకులు లేవని అర్థం అవుతోంది. ఏదైనా తీవ్ర సమస్య ఉంటే అంగ స్తంభనాలు కలగవు. కానీ ఇక్కడ వీరి విషయంలో అంగ స్తంభనలు ఉన్నాయి. కాబట్టి ఆందోళన పడవలసిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
అయితే వారంలో ఒకసారికి మించి అంగం స్తంభించకపోవడానికి విటమిన్ డి లోపం, లేదా టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గుదల, లేదా థైరాయిడ్ హార్మోన్ లోపం ప్రధాన కారణాలు అయి ఉండవచ్చు.
కాబట్టి పరీక్షల ద్వారా అసలు కారణాన్ని కనిపెట్టి, తగ్గిన హార్మోన్లను సరిచేసుకుంటే, తిరిగి స్తంభనాలు మామూలుగా మారతాయి. వైద్యులను కలిసి పరిస్థితిని వివరించి, పరీక్షలు చేయించుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.