దాంపత్య జీవితానికి బెస్ట్ సూత్రాలు..!

First Published | Jun 15, 2022, 2:24 PM IST

మీ పార్ట్ నర్ ఎలా ఉంటే.. అలా మీరు కనుక వారిని యాక్సెప్ట్ చేస్తే.. వైవాహిక జీవితం మరింత ఆనందంగా ఉంటుందట. వారి బలవంతంగా మారమని కోరడం కంటే.. వారు ఉన్న విధానాన్ని మీరు ఇష్టపడితే జీవితం బాగుంటుంది.

జీవితంలో పెళ్లి అనేది చాలా కీలకమైన భాగం. ఒక్కసారి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత అందరూ ఆనందంగా ఉండాలని అనుకుంటారు. అయితే.. అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే.... ఆనందంగా.. వైవాహిక జీవితంలో ఎలాంటి ఒడుదొడుగులు లేకుండా ఉండాలంటే.. కొన్ని సలహాలు పాటించాల్సిందే. మరి అవేంటో ఓసారి  చూద్దాం...
 

ప్రతి ఒక్కరూ.. తమ జీవిత భాగస్వామి అలా ఉండాలి.. ఇలా ఉండాలి అని అనుకుంటారు. కానీ.. వారు కోరుకున్నట్లు లేకపోతే మాత్రం చాలా నిరుత్సాహానికి గురౌతారు. ఆ నిరుత్సాహాన్ని ప్రతి విషయంలో చూపిస్తూ ఉంటారు. కానీ.. మీ పార్ట్ నర్ ఎలా ఉంటే.. అలా మీరు కనుక వారిని యాక్సెప్ట్ చేస్తే.. వైవాహిక జీవితం మరింత ఆనందంగా ఉంటుందట. వారి బలవంతంగా మారమని కోరడం కంటే.. వారు ఉన్న విధానాన్ని మీరు ఇష్టపడితే జీవితం బాగుంటుంది.


మీ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అనడానికి ముందు.. మీ పార్ట్ నర్ లేకపోతే మీ లైఫ్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఒకసారి ఊహించుకోండి. వారు లేకపోతే మీ లైఫ్ ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవాలి. అంతా బాగానే ఉంది అంటే వారి తో మీ లైఫ్ అంత బాండింగ్ గా లేదనే చెప్పాలి. అలా కాకుండా.. వారు లేకపోతే... మీ లైఫ్ లేదు అంటే.. వారితో మీ జీవితం పూర్తిగా ముడిపోయి ఉందని అర్థం చేసుకోవాలి.
 

Marriage bride

ఇక.. మీ పార్ట్ నర్ తో ఉన్నప్పుడు ఎప్పుడూ డల్ గా , మూడీగా ఉండటం మంచిది కాదు. సరదాగా అప్పుడప్పుడు జోకులు వేసుకుంటూ.. నవ్వుతూ ఉండటం మంచిది.  ఇది కూడా ఇద్దరికీ సరదాగా ఉంటుంది.

మీ పార్ట్ నర్ దగ్గర ఒక బండరాయిలాగా.. ఏదీ పట్టనట్లుగా ఉండకూడదు. వారితో మీ కష్టమైనా, నష్టమైనా, ఆనందాన్ని అయినా వారితో పంచుకోవడం నేర్చుకోవాలి. మొండిగా ఉండకూడదు.

ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నా సరే.. ఇంట్లో పనులను ఇద్దరూ పంచుకోవాలి. ఇద్దరిలో ఎవరు ఏ పని చేయాలి అనే విషయాన్ని వారు ముందే నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు నేనే ఎక్కువ పనులు చేస్తున్నా.. నువ్వు తక్కువ చేస్తున్నావు అనే తేడాలు రాకుండా ఉంటాయి.

muradabad groom and bride

ఇద్దరూ ఒకరి నిర్ణయాలను మరొకరు గౌరవించడం నేర్చుకోవాలి. అప్పుడు ఇద్దరికీ.. ఒకరిపై మరొకరిపై గౌరవం కూడా పెరుగుతుంది.

ఎంత భార్యభర్తలైనా.. ఎవరికి వారికి ప్రైవసీ ఉండాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరికి వారు తమ పార్ట్ నర్ కి ప్రైవసీ ఇవ్వడం అలవాటు చేసుకోవాలి.

bride 1

అంతేకాకుండా రాత్రి పడుకునే ముందు కనీసం రెండు నిమిషాలు అయినా ప్రేమ గా మాట్లాడుకోవాలి. ఒకరొకరు ప్రేమగా హత్తు కోవడం, ముద్దు పెట్టుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉండాలి. ఇవి జీవితాన్ని మరింత బలంగా మారుస్తాయి.

Latest Videos

click me!