పడక గది ముచ్చట్లు.. 60శాతం మహిళలు దానికే ఓటు!

First Published | Aug 27, 2020, 2:59 PM IST

 శృంగారంలో ప్రతిరోజు పాల్గొనడంవల్ల ఎనలేని ప్రయోజనాలుంటాయని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. దంపతుల మధ్య బంధం పటిష్టం కావడమే కాకుండా పగటిపూట రోజూవారీ పనుల్లో చిరాకులను కూడా ఇది పూర్తిగా తొలగించి ప్రశాంతంగా ఉంచుతుంది.

దాంపత్య జీవితంలో ఎలాంటి గొడవలు లేకుండా ఎప్పుడూ ప్రశాంతంగా, ఆనందంగా, రొమాంటిక్ గా సాగిపోతే ఎంత బాగుంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ ఆచరణలోక వచ్చే సరికి అవన్నీ సాధ్యం కావడం చాలా మందికి కష్టంగా ఉంటుంది.
undefined
ఈ సమస్యలన్నింటికీ పడక గదిలోనే సమాధానం చెప్పాలని నిపుణులు చెబుతున్నారు. ఏ సమస్య వచ్చినా భార్య, భర్తలు తమ మధ్య దూరం పెంచేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల వారికే నష్టం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు.
undefined

Latest Videos


ఈమధ్య కాలంలో వివాహం తర్వాత ఒకరిద్దరు పిల్లలు పుట్టగానే దాంపత్య జీవితంపై అనాసక్తి పెరుగుతోంది. దీనికి కారణాలు అనేకం. కానీ పూర్వకాలంలో వివాహితులు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల ఆరోగ్యపరంగా వారికి ఎంతో మేలు జరిగేదని పరిశోధకులు చెబుతున్నారు.
undefined
శృంగారం కూడా ఒక వ్యాయామం లాంటిది.. శ్వాసక్రియ క్రమంగా పెరిగి ఎక్కువ కాలరీల శక్తి కరిగి శరీరం ఫిట్నెస్‌ సంతరించుకుంటుంది. వారానికి మూడుసార్లు 15 నిమిషాలు వంతున శృంగారంలో పాల్గొంటే ఏడాదికి 7,500 కాలరీల శక్తి పోతుంది. అంటే 75మైళ్ళు జాగింగ్‌ చేసినట్టే.
undefined
శృంగార సమయంలో అధికంగా శ్వాస తీసుకుంటారు. దీనివల్ల శరీర కణాలకు ఆక్సిజన్‌ విరివిగా లభిస్తుంది. శృంగారంలో ప్రతిరోజు పాల్గొనడంవల్ల ఎనలేని ప్రయోజనాలుంటాయని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. దంపతుల మధ్య బంధం పటిష్టం కావడమే కాకుండా పగటిపూట రోజూవారీ పనుల్లో చిరాకులను కూడా ఇది పూర్తిగా తొలగించి ప్రశాంతంగా ఉంచుతుంది.
undefined
శరీరంలోని టాక్సిన్స్‌ అన్ని సమయంలో విడుదలైపోవడం, రక్తప్రసరణ బాగా జరగడం వల్ల మనిషిని ఆరోగ్యవంతుణ్ణి చేస్తుంది శృంగారం. అయితే శృంగారం భోజనానికి ముందు చేస్తే మంచిదా లేక తర్వాత చేస్తే మంచిదా? అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. అది మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
undefined
అల్పాహారం, జ్యూస్‌, ఎనర్జీ డ్రింక్స్‌ వంటివి శృంగారానికి ముందు తీసుకోవచ్చు. కడుపునిండుగా తిన్నతర్వాత మాత్రం వెంటనే శృంగారంలో పాల్గొనకూడదు. ఎందుకంటే మన శరీరంలో రక్త ప్రసరణ సహా అన్ని వ్యవస్థలు మనం తిన్న ఆహారం మీదే దృష్టికేంద్రీకరించి పనిచేస్తుంటాయి.
undefined
తిన్నవెంటనే శృంగారంలో పాల్గొంటే త్వరగా అలిసిపోతారు. దీంతో శృంగారాన్ని పూర్తిగా ఎంజాయ్‌ చేయలేరు. ఒకవేళ లిమిట్‌గా తినేవారు, డైట్‌ ఫాలో అవుతున్న వారికైతే తిన్న తరువాతే శృంగారం మంచిది.
undefined
అలా అని శృంగారం తర్వాత కూడా వెంటనే ఆహారం తినకూడదు. కొంచెం గ్యాప్‌ ఇచ్చి శరీరంలోని అన్ని వ్యవస్థలూ రిలాక్స్‌ స్టేజికి వచ్చాక తినాలి. అప్పుడు కూడా తక్కువగానే తినాలి. లేకుంటే ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ.
undefined
మగవారిలో 41శాతం మంది తినడానికి ముందే శృంగారం ఇష్టపడతారు కానీ ఆడవారిలో 61శాతంమంది తిన్న తర్వాతే శృంగారానికి ఇష్టపడతారని ఓ సర్వేలో తేలింది.
undefined
మనలో చాలామంది శృంగారం అంటే రెండు శరీరాల కలయిక, పడక సౌఖ్యం అనుకుంటారు. కానీ దానివల్ల మనకు ఆరోగ్య పరంగా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మరి ఆ లాభాలేంటో.. మనమూ ఓ లుక్కేద్దామా..
undefined
శరీరంలో కొవ్వు కరిగించుకోవడానికి దాదాపు అందరూ చేసే పని జిమ్ కి వెళ్లడం. ట్రెడ్‌మిల్‌మీద 40 నిమిషాలపాటు వాకింగ్ చేయడం వల్ల కరిగే క్యాలరీలకన్నా 30 నిమిషాల శృంగారం కారణంగా అధిక క్యాలరీలు ఖర్చవుతాయట. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి దీన్ని మించిన వ్యాయామం లేదని నిపుణులు చెబుతున్నారు.
undefined
భార్యాభర్తల మధ్య శృంగారం అనేది శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక అనుబంధం బలపడ్డానికీ కారణమవుతుంది. పైగా రోజూ శృంగారంలో పాల్గొనే మహిళల్లో కటిభాగంలో కండరాలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. దాంతో గర్భాశయం జారిపోకుండా ఉంటుంది. మూత్రనాళ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి.
undefined
వారానికి మూడుసార్లు శృంగారంలో పాల్గొనే మహిళలకు ప్రత్యేకించి ఫేసుక్రీములతో పనిలేదని ఓ అధ్యయనంలో తేలింది. వీళ్లు అసలు వయసు కన్నా ఏడెనిమిదేళ్లు చిన్నగా కనిపిస్తారట.
undefined
click me!