భార్యాభర్తల మధ్య ఏ విషయంలో గొడవలొస్తాయో తెలుసా?

First Published | Feb 8, 2024, 10:48 AM IST

భార్యాభర్తల మధ్య గొడవలు, కొట్లాటలు చాలా కామన్. కానీ వీటి వల్ల చాలా రోజులు మాట్లాడుకోకుండా దూరంగా ఉండేవారు చాలా మందే ఉన్నారు. అసలు భార్యాభర్తల మధ్య ఏ విషయంలో  గొడవలొస్తాయో తెలిస్తే షాక్ అవుతారు. 
 

ఈ ప్రపంచంలో గొడవ పడని దంపతులు ఉండనే ఉండరు. ఎందుకంటే రిలేషన్ షిప్ లో ప్రేమ, కోపతాపాలు, అలకలు, కొట్లాటలు, గొడవలు, బుజ్జగింపులు సర్వ సాధారణం. ఎప్పుడో ఒకసారి కొట్లాడటం వల్ల పెద్దగా నష్టపోయేది ఏమీ లేదు. కానీ కొంతమంది భార్యాభర్తలు ప్రతిరోజూ కొట్లాడుతుంటారు. దీనివల్ల ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు. చిరాకుగా ఉంటారు. సంసారం కూడా సాఫీగా సాగదు. అందుకే ప్రతి చిన్న విషయానికి పోట్లాడుకోకుండా సమస్యలను పరిష్కరించే మార్గాలను వెతకండి. అసలు భార్యాభర్తల మధ్య ఏ విషయంలో గొడవలు, కొట్లాటలు వస్తాయో తెలుసుకుందాం పదండి. 
 

ఇంటి పని ఎవరు చేస్తారు? 

భాగస్వామి ఇంటి పరిశుభ్రతపై కేర్ తీసుకోకపోయినా.. క్లీన్ ఉండే అలవాటు లేకపోయినా.. కొంతమందికి సౌకర్యంగా ఉండదు. ఈ అలవాటును మానుకోమని కూడా వాదనలు జరుగుతుంటాయి.  అలాగే ఇంటి పనులను ఒక్కరే ఎందుకు చేయాలి? ఇంట్లో చెత్తను ఎవరు బయట వేయాలి? వంటి ఎన్నో ఇంటి పనులను ఒక్కరే చేయడం కష్టంగా ఉంటుంది. దీనివల్ల కూడా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. కలిసి పనులు చేస్తే ఏ సమస్యా ఉండదు. 


సెలవు రోజుల్లో ఎక్కడ గడపాలి?

దంపతుల మధ్య సెలవుల రోజుల్లో ఎక్కడ గడపాలి? అన్న దానిపై కూడా గొడవలు వస్తుంటాయి. ఎందుకంటే దీనిపై ఇద్దరికీ క్లారిటీ ఉండదు. అలాగే ఏకాభిప్రాయం కూడా ఉండదు. చాలా మంది పురుషులు సెలవుల్లో తమ స్వగ్రామానికి లేదా తల్లిదండ్రుల ఇంటికి లేదా బంధువుల ఇంటికి వెళ్లడానికి ఇష్టపడుతారు. అలాడే ఆడవారైతే సెలవుల్లో ఎటైనా కొత్త ప్లేస్ కు వెళ్లాలనుకుంటారు. దీనివల్లే ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువగా వస్తుంటాయి. 

పిల్లల హోంవర్క్ ఎవరు చేస్తారు? 

ఇద్దరు పిల్లలున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పనిచేయాలి. కానీ చాలా ఇండ్లలో అలా జరగదు. ఆడవారే పిల్లల బాధ్యతను తీసుకుంటారు. ఇంటిని కూడా చూసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పిల్లలను స్కూల్ కు రెడీ చేయడం, స్కూల్ నుంచి వారిని ఇంటికి తీసుకురావడం, స్కూలు హోంవర్క్ చేయించడం వంటి పనులు ఆడవారే చేస్తుంటారు. సంవత్సరాలుగా ఈ పని చేస్తుంటే.. కొంతకాలం తర్వాత దీనివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు, కొట్లాటలు పక్కా వస్తాయి. 
 

పురోగతితో చికాకు

రిలేషన్ షిప్ లో అసూయ కూడా గొడవలకు దారితీస్తుంది. ఉదాహరణకు.. కొంతమంది తమ భాగస్వాములు జీవితంలోని మంచి పురోగతిని సాధిస్తే అసూయపడుతుంటారు. ఈ అసూయ ఏదోఒక సమయంలో శత్రుత్వానికి కూడా దారితీస్తుంది. 

Image: Getty

కుటుంబం కంటే ఆఫీసు పనిపై ఎక్కువ దృష్టి

ప్రస్తుత కాలంలో భార్యాభర్తలిద్దరూ ఏదో ఒక పని చేస్తున్నారు. కానీ పనివల్ల కొన్ని సమయాల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి తగినంత సమయం దొరకదు. కొంతమంది పనికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. కానీ భాగస్వామితో కలిసి గడిపే సమయం దొరకడం లేదని కూడా గొడవలు పడుతుంటారు. 
 

Image: Getty

భాగస్వామిని నియంత్రించడానికి ప్రయత్నించడం

కొంతమంది భాగస్వాములు అవతలి వ్యక్తిపై నియంత్రణ లేదా ఆధిపత్యాన్ని చూపిస్తుంటారు. ఎందుకంటే వారు చెప్పేదే వినాలని, చేయాలని అనుకుంటారు. అయితే హెల్తీ రిలేషన్ షిప్ లో నియంత్రణ ఉండదు. బదులుగా భాగస్వామిని సరైన దిశలో నడిపించడానికి ఇద్దరూ ఒక జట్టుగా కలిసి పనిచేస్తారు.
 

Image: Getty

ఫోన్లను అతిగా ఉపయోగించడం

టెక్నాలజీ, సోషల్ మీడియా ప్రపంచంలో మన కుటుంబం, భాగస్వామి కంటే ఫోన్లకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం వల్ల భాగస్వామితో ఎక్కువ సమయం గడపలేరు. ఇది మీ సాన్నిహిత్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కూడా గొడవలు వస్తాయి.

Latest Videos

click me!