భర్తను మోసం చేసే భార్యలు చేసే తప్పులు ఇవే..!

First Published | May 12, 2023, 11:24 AM IST

మరొకరితో సంబంధం పెట్టుకోవడానికి కారణం కూడా భర్తే అన్నట్లుగా ఆ వాదనను మార్చేస్తారు. తమది మాత్రం తప్పు కాదు అనే భావనలో ఉంటారు.
 

ఈరోజుల్లో  చాలా మంది దాంపత్య జీవితానికి విలువ ఇవ్వడం లేదు. భర్తని భార్య, భార్యని భర్త మోసం చేస్తున్నారు. వైవాహిక సంబంధానికి అర్థం లేకుండా చేస్తున్నారు. మరొకరితో ఎఫైర్లు పెట్టుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే, ఓ మహిళ భర్తతో కాకుండా మరో వ్యక్తితో  వివాహేతర సంబంధం పెట్టుకున్న క్రమంలో కొన్ని తప్పులు  చేస్తారట. అవేంటో ఓసారి చూద్దాం..

1.ఓ మహిళ తప్పు చేసిన భర్తకు దొరికినప్పుడు కూడా  అడ్డదిడ్డంగా వాదిస్తారట. తాను తప్పు చేశానని అంగీకరించకపోగా, భర్త వల్లే తప్పు చేశానని అడ్డంగా వాదిస్తారట. మరొకరితో సంబంధం పెట్టుకోవడానికి కారణం కూడా భర్తే అన్నట్లుగా ఆ వాదనను మార్చేస్తారు. తమది మాత్రం తప్పు కాదు అనే భావనలో ఉంటారు.
 


2.చాలా మంది మహిళలు ఎఫైర్ ని ముగించిన తర్వాత వారితో స్నేహం కంటిన్యూ చేయాలని అనుకుంటరాట. కానీ అది వారు చేసే అతి పెద్ద తప్పు అవుతుంది. ఒకసారి తప్పు చేసి దానిని వదిలేసిన తర్వాత మళ్లీ వారితో స్నేహం చేసినా కూడా అది స్నేహంతో ఆగదు.

3.చాలా మంది మహిళలు, తాము వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్ల ఎవరికీ ఎలాంటి బాధ ఉండదు, అసలు తాము తప్పు చేస్తున్నట్లు ఎవరికీ దొరకము అని భావిస్తూ ఉంటారు. అలా ఉండదు తప్పు చేసినవాళ్లు ఎప్పుడో ఒకసారి భయటపడటం ఖాయం అనే విషయం తెలుసుకోరు.
 

4.చాలా మంది ఎఫైర్లు ఎప్పుడూ సవ్యంగా సాగవు. ఆ ఎఫైర్లు కూడా మధ్యలో బ్రేక్ అవ్వడం, మళ్లీ కలవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ దాని వల్ల జీవితాలు పాడైపోతాయి. వైవాహిక జీవితం మళ్లీ సవ్యంగా సాగుతుందన్న చిన్న ఆశ కూడా ఉండదు.
 

5.చాలా మంది మహిళలు ఎఫైర్ పెట్టుకున్న తర్వాత ఆ బంధాన్ని తుంచుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. ఒక వేళ విడిపోవాల్సి వస్తే,  అవతల వ్యక్తి బాధపడతాడని ఆలోచిస్తారు. కానీ,  భర్త, తన జీవితం ఏమైపోతుందని ఆలోచించరట.
 

6.తామకు వైవాహిక జీవితంలో సంతోషం లేకపోవడం వల్ల మరోకరితో ఎఫైర్ పెట్టుకున్నామని అనుకోరట. తాము చేసిన తప్పు కి కూడా భర్తపైనే నేరం వేసి దారుణంగా మాట్లాడతారట.
 

Latest Videos

click me!