మోసం చేసిన ప్రతిసారీ పురుషులు చెప్పే సాకులు ఇవే..!

First Published | Mar 19, 2022, 1:11 PM IST

ఆ విషయం తమ భాగస్వామికి తెలియకుండా  చాలా నాటకాలు ఆడుతుంటారట. అయితే.. మీ పార్ట్ నర్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు అంటే.. తప్పించుకోవడానికి కొన్ని సాకులు చెబుతుంటారట. మరి ఆ సాకులు ఏంటో చూసేద్దామా..
 

cheating

దాంపత్య బంధంలో నమ్మకం చాలా ముఖ్యం. కానీ.. చాలా మంది దంపతుల మధ్య ఇదే కరువౌతుందట. కొందరు తమ జీవిత భాగస్వాములను మోసం చేస్తున్నారట. నిత్యం తమ భాగస్వామికి అబద్దాలు చెబుతూ.. తప్పించుకుతిరుగుతున్నారట. ముఖ్యంగా... మరోకరితో అక్రమ సంబంధం పెట్టుకొని.. ఆ విషయం తమ భాగస్వామికి తెలియకుండా  చాలా నాటకాలు ఆడుతుంటారట. అయితే.. మీ పార్ట్ నర్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు అంటే.. తప్పించుకోవడానికి కొన్ని సాకులు చెబుతుంటారట. మరి ఆ సాకులు ఏంటో చూసేద్దామా..

అప్పటి వరకు తమ శరీరం గురించి పట్టించుకోని వారు.. సడెన్ గా  బాడీ పై ఫోకస్ పెడుతున్నారా..? అందంగా కనిపించేందుకు  ప్రయత్నాలు మొదలుపెడుతున్నారా..? రోజూ జిమ్ కి వెళ్లడం లాంటివి చేస్తున్నారు అంటే..,, కాస్త అనుమానించాల్సిందే. ఎవరినో ఆకట్టుకోవడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారని అనుమానించాల్సిందేనట. 


డిన్నర్ చేస్తున్నప్పుడు మధ్యలో మీ పార్ట్ నర్ కి ఫోన్ రావడం.. ఆ ఫోన్ రాగానే వారు కంగారుగా పక్కకు వెళ్లి మాట్లాడటం లాంటివి చేస్తున్నారు అంటే.. కాస్త అనుమానించాల్సిందే. లేదంటే.. ఆ ఫోన్ తర్వాత అర్జెంట్ గా.. బయటకు వెళ్లడం లాంటివి  చేశారు అన్నా కూడా.. మీ పార్ట్ నర్ మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారని అనుమానించాల్సిందే. .
 

మీ  పార్ట్ నర్  మిమ్మల్ని మోసం చేస్తున్నప్పుడు, అతను  మరో వ్యక్తిని కలవడానికి ఇంటి నుండి బయటకు వెళ్లడానికి అన్ని మార్గాలను కనుగొంటాడు. ఎలా చెప్పి తప్పించుకోవాలా అని చూస్తూ ఉంటారు.
 

మరోకరి మోజులో ఉన్నప్పుడు  తరచూ మీతో గొడవ పడుతూ ఉంటారు. వేరే వ్యక్తి పై ఉన్న ఇష్టాన్ని.... మీ మీద కోపంగా చూపిస్తారు. అవసరం లేకపోయినా మీతో గొడవపడుతుంటారు. అలా గొడవ పడుతున్నారు అంటే.. కూడా అనుమానించాల్సిందేనట.

మోసం విషయంలో పురుషులు చెప్పే అత్యంత సాధారణ సాకులలో ఇది ఒకటి. ఆఫీసు పనిన ఉందని.. వ్యాపార పని ఉందని.. రెండు, మూడు రోజులు ట్రిప్ కి వెళ్తుంటారు. 

కాబట్టి.. ఈ విషయంలో మీరు ఓ కన్నేయాలి. వారు వెళ్లే ప్రదేశం, బస చేసే హోటల్, టికెట్ వివరాలు తెలుసుకోవాలి. లేదంటే.. మిమ్మల్ని బకరాలు చేసి.. లవర్ తో ఎంజాయ్ చేస్తారు.

Latest Videos

click me!