ఈ క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలే అమ్మాయిలకు చాలా ఇష్టం..

First Published | Mar 21, 2024, 4:00 PM IST

అమ్మాయికు తమకు కాబోయే వాడు ఇలా ఉండాలి, అలా ఉండాలి అన్న కోరికలు, ఆశలు ఉంటాయి. ఇలాంటి అబ్బాయి వారి లైఫ్ లో కనిపిస్తే మాత్రం ఎన్ని సమస్యలెదురైనా అస్సలు వదులుకోరు. జీవితాంతం వారితోనే ఉండాలనుకుంటారు. 
 

రిలేషన్ షిప్ లోకి అడుగుపెట్టే ముందు అమ్మాయిలు ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. నేను మంచే చేస్తున్నానా? లేక చెడు దారిలోకి అడుగుపెట్టానా అని. ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లు కూడా లైఫ్ లో చాలా సమస్యలు వచ్చేలా చేస్తాయన్న సంగతి వారికి తెలుసు. నిజానికి అమ్మాయిలు తమకు కాబోయే వాడి గురించి ఎన్నో కలలు కంటారు. నన్ను ప్రేమగా చూసుకోవాలని, ఎప్పుడూ నాతోనే ఉండాలని ఎన్నో అనుకుంటారు. కాబోయే వాడిలో కొన్ని క్వాలిటీస్ ఖచ్చితంగా ఉండాలని ప్రతి అమ్మాయి భావిస్తుంది. అలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి దొరికితే మాత్రం అస్సలు వదులుకోరు. అసలు అమ్మాయిలకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు ఇష్టమో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

ఉల్లాసంగా ఉండటం

ముక్కు మీదే కోపం ఉన్న అబ్బాయిలతో అమ్మాయిలు మాట్లాడటానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. అవసరమైతే తప్ప అస్సలు వారి జోలికి కూడా పోరు. కానీ ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చే స్వభావం వృత్తిపరమైన జీవితంలోనే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలను కలిగిస్తుంది. అందుకే అమ్మాయిలు ఎప్పుడూ కూడా నవ్వే అబ్బాయిలనే బాగా ఇష్టపడతారు. ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా ఉండేవారినే అమ్మాయిలు బాగా ఇష్టపడతారు. వారికే పడిపోతారు. 


లేడీ ఫ్రెండ్స్ తక్కువ

వినడానికి వింతగా అనిపించినా ఇది మాత్రం నిజం. అవును ఏ అబ్బాయిలకైతే మహిళా దోస్తులు తక్కువగా ఉంటారో వారినే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారట. చాలా మంది అమ్మాయిలతో స్నేహం చేసే అబ్బాయిలకు వారి లోపల చెడు ఉద్దేశ్యం ఉంటుందని  అనుకుంటారు. అంతేకాదు ఇది బ్రేకప్ దారితీస్తుందని కూడా నమ్ముతారు. అలాంటి అబ్బాయిలు అమ్మాయితో కమిట్ మెంట్ లో బంధాన్ని ఏర్పరుచుకోలేరని అమ్మాయిల నమ్మకం. అందుకే లేడీ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండే అబ్బాయిలను అమ్మాయిలు పెద్దగా ఇష్టపడరట.

కుటుంబాన్ని పరిచయం చేయడానికి వెనుకాడరు

ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ను పరిచయం చేయని అబ్బాయిలను కూడా అమ్మాయిలు అస్సలు ఇష్టపడరు. ఇలాంటి అబ్బాయిలు తమను మోసం చేస్తారని చాలా మంది అనుకుంటారు. అందుకే మీకు ఒక అమ్మాయిపై క్రష్ ఉంటే ఖచ్చితంగా మీ ఇతర స్నేహితుల మాదిరిగానే ఆమెను కూడా ఏదో ఒక సందర్భంలో మీ ఫ్యామిలీకి పరిచయం చేయండి. 
 

రెస్పెక్ట్

ఎలాంటి రిలేషన్ షిప్ కైనా సరే పునాది రెస్పెక్టే. ఒకరినొకరు గౌరవించుకోవడంపైనే  వారి బంధం ఆధారపడి ఉంటుంది. అమ్మాయిలు ప్రేమించే ముందు తమ భాగస్వామి తమను గౌరవించాలని కోరుకుంటారు. అందుకే మీరు ఎవరినైనా ప్రేమిస్తే వారికి తగిన గౌరవం ఇవ్వండి. 
 

క్లియర్ కట్ స్వభావం

క్లిష్ట పరిస్థితుల్లో సహనం కోల్పోకుండా అన్ని విషయాల్లో పరిపక్వత చూపించే అబ్బాయిలే అమ్మాయిల ఫస్ట్ ఛాయిస్. ఇలాంటి అబ్బాయిలతో తమ భవిష్యత్ చాలా బాగుంటుందని ప్రతి అమ్మాయి అనుకుంటుంది. 

Latest Videos

click me!