ఎవరు ఎక్కువ ఆస్వాదిస్తారు..?

First Published | Nov 11, 2019, 2:06 PM IST

నిజానికి స్త్రీల తో పోలిస్తే... శృంగారం విషయంలో పురుషులు కాస్త ఎక్కువగా ఉత్సాహం చూపిస్తారు. వారిలో లైంగిక వాంఛలు కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి. అయితే.. వాళ్లు రోజంతా దాని గురించే ఆలోచిస్తారు అనుకోవడం మాత్రం పెద్ద అపోహ అని నిపుణులుచెబుతున్నారు.

స్త్రీ, పురుషుల జీవితాల్లో శృంగారానిది పెద్దపీట. అసలు శృంగారమనేదే లేకపోతే సృష్టికి మూలం అనేదే ఉండదు. అలాంటి దానిని చాలా మంది చీకటి వ్యవహారంగా పరిగణిస్తూ ఉంటారు. దాని గురించి మాట్లాడటానికే ఇష్టపడరు. మాట్లాడితే ఎవరు ఎమనుకుంటారో అని ఆందోళనను తమలో పెంచుకున్నారు.
అంతేకాకుండా.. తమకు వచ్చే అనుమానాలను కూడా ఎవరితోనూ పంచుకోకుండా వారు అనుకున్నదే నిజమనే భ్రమలో ఉండిపోతారు. అలా చాలామంది తమలో తాము అనుకునే వాటిల్లో మొదటిది.. పురుషులు మాత్రమే ఎక్కువగా కలయికను ఆస్వాదించగలరు.

నిజానికి స్త్రీల తో పోలిస్తే... శృంగారం విషయంలో పురుషులు కాస్త ఎక్కువగా ఉత్సాహం చూపిస్తారు. వారిలో లైంగిక వాంఛలు కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి. అయితే.. వాళ్లు రోజంతా దాని గురించే ఆలోచిస్తారు అనుకోవడం మాత్రం పెద్ద అపోహ అని నిపుణులుచెబుతున్నారు.
ఇక ఎవరు ఎక్కువగా కలయికను ఆస్వాదిస్తారు అనే విషయంలో కూడా చాలా మంది అపోహలు ఉంటాయి. పురుషులు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు అనేది కేవలం పురుషాహంకార భావన అని నిపుణులు చెబుతున్నారు. సంభోగాన్ని స్త్రీ, పుపరుషులు ఇద్దరూ సమానంగా ఆస్వాదిస్తారని చెబుతున్నారు.
అయితే పురుషుల ప్రవర్తన, వ్యవమార శైలి కాస్త బాహాటంగా, నాటకీయంగా ఉండటంతో వారే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారనే భావన కలుగుతుంది. ఇదే స్త్రీల విషయానికి వస్తే.. వారి వ్యక్తీకరణ చాలా భిన్నంగా ఉంటుంది. కాస్త మృదువుగా, నిదానంగా, సున్నితంగా చెప్పే అవకాశం ఉంది.
వాస్తవానికి స్త్రీలు పురుషులకంటే భావప్రాప్తిలో గాఢమైన అనుభూతి పొందుతారు. పైగా స్త్రీలు సంభోగ సమయంలో ఒకసారి కాదు.. పలుమార్లు భావప్రాప్తి పొందే అవకాశం ఉుంది. అదే పురుషుల విషయానికి వస్తే.. ఒక్కసారి స్ఖలనం అయిపోతే.. మళ్లీ అంగం గట్టిపడే అవకాశమే ఉండుంది. కోరిక కూడా తీరిపోతుంది.
సంభోగంలో స్త్రీలు పలుమార్లు బావప్రాప్తి పొందినా.. పురుషులు ఒకేసారి పొందినా.. శృంగారాన్ని ఇద్దరూ సమానంగానే ఆస్వాదిస్తారు. ఇరువురూ తృప్తిని పొందుతారు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని ఏమీ ఉండదు అని నిపుణులు చెబుతున్నారు.

Latest Videos

click me!