స్విమ్మింగ్ చేస్తుండగా.. పురుషాంగంలోకి దూరిన జలగ..

First Published | Jun 26, 2020, 3:12 PM IST

వెంటనే యూరిన్ కి వెళ్లాడు. ఆ తర్వాత నొప్పి మరింత ఎక్కువైంది. ఇక తట్టుకోలేక వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు ఓ జలగ దూరినట్లు గుర్తించారు.

జలగ.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంట. ఇది ఒక్కసారి మనిషిని పట్టుకుందంటే... మనం ఎంత ప్రయత్నించినా దానిని వదిలించుకోలేం. దానికి సరపడా రక్తం అది తాగిన తర్వాతే వదిలేస్తుంది. అలాంటి జలగ.. ఓ వ్యక్తి పురుషాంగంలోకి దూరిపోయింది.
undefined
ఈ సంఘటన కాంబోడియాలో చోటుచేసుకుంది. సరదాగా ఈత కొడదామని నీటిలోకి దిగితే.. అతని ప్రాణం పోయినంత పనైంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
undefined

Latest Videos


కాంబోడియాకి చెందిన వ్యక్తి ఇటీవల తమ ఇంటికి సమీపంలోని ఓ నీటి కొలను వద్దకు వెళ్లాడు. ఆ నీళ్లు చూడగానే అతనికి స్విమ్మింగ్ చేయాలని అనిపించింది. వెంటనే ఆలస్యం చేయకుండా నీటిలోకి దిగేశాడు.
undefined
చాల సేపు ఆయన ఈత కొట్టి ఆనందించాడు. అంతలోనే అతనికి పురుషాంగం వద్ద, కడుపులో తీవ్ర నొప్పి ప్రారంభమైంది.
undefined
వెంటనే యూరిన్ కి వెళ్లాడు. ఆ తర్వాత నొప్పి మరింత ఎక్కువైంది. ఇక తట్టుకోలేక వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు ఓ జలగ దూరినట్లు గుర్తించారు.
undefined
ఆ జలగ బాధితుడి అంగం నుంచి మూత్రాశయంలోకి చొచ్చుకెళ్లింది. అనంతరం అది మూత్రాశయాన్ని అంటుకుని రక్తాన్నీ పీల్చేసింది. దానివల్ల దాని ఆకారం కూడా పెద్దదైంది. ఫలితంగా అతడికి నొప్పి పెట్టడం ప్రారంభమైంది.
undefined
అది అవయవాన్ని అంటిపెట్టుకుని ఉంటే బయటకు తీయడం ప్రమాదకరం. దీంతో వైద్యులు మూత్రాశయంలోకి బైపోలార్ రెసెక్టోస్కోప్‌ను పంపి జలగను చంపేశారు. అనంతరం దాన్ని బయటకు తీశారు. జలగ సుమారు 500 మిల్లీ లీటర్ల రక్తాన్ని తాగేసిందని వైద్యులు తెలిపారు.
undefined
వర్షాకాలంలో చెరువుల్లో ఈతలు కొట్టడం అంత శ్రేయస్కరం కాదని ఈ సందర్భంగా వైద్యులు సూచించారు. ఈ జలగలు లాంటివి దూరితే..చాలా ప్రమాదమని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
undefined
click me!