పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన ఘట్టం. ఆ అందమైన క్షణాలను ప్రతి ఒక్కరూ ఫోటోలు, వీడియోల రూపంలో బంధించాలని అనుకుంటారు. ఆ ఫోటోలను అప్పుడప్పుడూ చూసుకుంటూ.. ఆ నాటి క్షణాలను నెమరువేసుకుంటారు. అయితే.. ఈ మధ్యకాలంలో కొత్త సంస్కృతి వచ్చింది. పెళ్లికి ముందే వధూవరులు అందమైన ప్రదేశాలకు వెళ్లి.. అక్కడ ఫోటోలు దిగుతున్నారు.
undefined
అయితే.. ఈ సంస్కృతి కాస్త ఇప్పుడు మరీ దారుణంగా తయారైంది. పెళ్లికి ముందు ఫోటోలు దిగడం తప్పు కాదు. కానీ తాజాగా ఓ జంట బెడ్రూమ్ ని తలపించే విధంగా ఫోటోలు దిగారు.
undefined
అక్కడితో ఆగిందా.. వాటిని కాస్త సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది ఆ ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి. అయితే.. ఈ ఫోటోలను చూసి మెచ్చినవారికంటే తిట్టినవారే ఎక్కువగా ఉండటం గమనార్హం.
undefined
అంత ఇబ్బంది కరంగా ఆ ఫోటోలు ఉండటమే అందుకు కారణం. ఆ ఫోటోల్లో రొమాన్స్ ఘాటు చాలా ఎక్కువయ్యింది. ఇద్దరూ ఒకే దుప్పటిలో ఉండటం.. శరీర భాగాలు కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం నెటిజన్ల ఆగ్రహానికి దారితీసింది.
undefined
అయితే.. వారు ఆ ఫోటులు పెళ్లికి ముందు కాదట.. పెళ్లి తర్వాతే తీయించుకున్నారట. ఫోటోలు వైరల్ అయిపోయిన తర్వా త ఈ విషయం వెలుగులోకి రావడం గమనార్హం. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే...
undefined
కేరళకు చెందిన రిషి కార్తికేయన్, లక్ష్మిలు సెప్టెంబర్ 15న వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందే ఫోటో షూట్ లో పాల్గొనాల్సి ఉండగా..లాక్ డౌన్ కారణంగా సాధ్యపడలేదు. దీంతో పెళ్లి తరువాత ఫోటో షూట్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటో షూట్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. దానికి కారణం వెడ్డింగ్ షూట్ లో వధువు వరుడు ధరించిన క్యాస్టూమ్సే.
undefined
కార్తికేయన్ స్నేహితుడు ఫోటోగ్రాఫర్ అఖిల్ కార్తికేయన్ సాయంతో కేరళలోని ఇడుక్కి జిల్లాలోని వాగామోన్ లోని టీ తోటల్లో ఫోటో షూట్ నిర్వహించారు. తెల్లని దుస్తుల్లో రిషి, లక్ష్మిలు ఫోటో షూట్ లో పాల్గొన్నారు. అనంతరం ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా..ఆ ఫోటోలపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
undefined
కాగా.. ఈ ట్రోలింగ్ పై వధూవరులు స్పందించారు. వెడ్డింగ్ షూట్ లో అన్నీ రకాల క్యాస్టూమ్స్ ధరించాం. చివరికి ఈ క్యాస్టుమ్స్ తో ఫోటో షూట్ లో పాల్గొన్నామంటూ ధైర్యంగా చెబుతుండటం విశేషం.
undefined
నాలుగు గోడల మధ్య చేయాల్సిన పని బహిరంగా ఎలా చేస్తారని తమను చాలా మంది విమర్శిస్తున్నారని.. అయితే.. అందులో అంత ఇబ్బంది పడాల్సిన విషయం ఏముందని వారు ప్రశ్నించారు
undefined
మెడ, కాళ్లు చూపించడం నగ్నత్వం ఎలా అవుతుందని ప్రశ్నించారు. తాము మాత్రం ఆ ఫోటోలు డిలీట్ చేయమని స్పష్టం చేయడం గమనార్హం.
undefined