చీట్ చేస్తారని డౌట్...అనుమానంతో సెల్ ఫోన్ చెక్ చేస్తే..

First Published Oct 24, 2019, 2:29 PM IST

ఇలా ఫోన్ చెకింగ్ లు ఎక్కువగా అతి ప్రేమతో లేదా, తమతో కాకుండా మరే వ్యక్తితో చనువుగా ఉండకూడదు అని తెలుసుకోవడానికే అలా చేస్తుంటారని ఓ సర్వేలో తేలింది. యూనివర్శిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా, యూనివర్శిటీ ఆఫ్ లిస్ బన్ అనే సంస్థ ఈ విషయంపై తాజాగా సర్వే చేయగా... ఈ విషయం వెల్లడైంది. 

ప్రేమ, పెళ్లి ఏదైనా నమ్మకం అనే పునాది మీద ఆధారపడి ఉంటుంది. ఒకరిపై మరొకరికి నమ్మకం ఉన్నప్పుడే వారి జీవితం సాఫీగా, ఆనందంగా సాగుతుంది. ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి వచ్చి లేనిపోని చాడీలు చెప్పినా... మన జీవిత భాగస్వామి మీద ఉన్న నమ్మకమే మన బందాన్ని చిరస్థాయిగా నిలపడుతుంది. అయితే... దీనిని అందరూ నిలబెట్టుకోరు.
undefined
ఒక్కోసారి మనం ఎంత నమ్మకంగా ఉన్నా... అవతలివాళ్లు మనల్ని చీట్ చేయాలనే ఉద్దేశంతో ఉంటారు. వీరి సంగతి పక్కన పెడితే... మనలో చాలా మందికి తమ తమ పార్ట్ నర్స్ పై ఎంతో కొంత అనుమానం ఉంటుంది. దానిని అతి ప్రేమ అనుకోవాలో... లేదా తమను వదిలేసి వేరే వాళ్లతో వెళ్లిపోతారనే భయమో తెలీదు కానీ... వాళ్లపై తరచూ డౌట్ పడుతూ ఉంటారు.
undefined
పనిలో పనిగా... పార్ట్ నర్స్ మొబైల్ పాస్ వర్డ్స్ తెలుసుకుంటారు. పార్ట్ నర్ లేని సమయంలో ఫోన్ లాక్ ఓపెన్ చేసి ఎవరితో మాట్లాడారు..? ఎవరికి మెసేజ్ చేశారు..? తన పేరు ఏమని సేవ్ చేసుకున్నారు..? వేరే అమ్మాయిఅబ్బాయి పేరు ఏమని సేవ్ చేసుకున్నారు లాంటివన్నీ.. చెక్ చేస్తుంటారు. ఇది ఎంత వరకు వాళ్లకు ఉపయోగపడుతుందో లేదో తెలీదు కానీ... వారి బంధానికి మాత్రం సమస్యలు రావడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.
undefined
ఇలా ఫోన్ చెకింగ్ లు ఎక్కువగా అతి ప్రేమతో లేదా, తమతో కాకుండా మరే వ్యక్తితో చనువుగా ఉండకూడదు అని తెలుసుకోవడానికే అలా చేస్తుంటారని ఓ సర్వేలో తేలింది. యూనివర్శిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా, యూనివర్శిటీ ఆఫ్ లిస్ బన్ అనే సంస్థ ఈ విషయంపై తాజాగా సర్వే చేయగా... ఈ విషయం వెల్లడైంది.
undefined
అయితే... కొందరు తమ పార్ట్ నర్స్ తమ ఫోన్లు చెక్ చేస్తున్నారని తెలిసి కూడా కామ్ గా ఉంటున్నారట. తాము ఎలాంటి తప్పు చేయనప్పుడు ఫోన్ చెక్ చేస్తే మాత్రం ఏమౌతుందని అని చెప్పడం విశేషం. కొందరు మాత్రం దీనికి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నమ్మకం లేకుండా అలా చూడటం కరెక్ట్ కాదని వారు భావిస్తున్నారు. అలాంటి వారితో తమ బంధాన్ని కొనసాగించలేమని వారు చెప్పడం విశేషం.
undefined
కాగా.. 45శాతం మంది దంపతులు, లవర్స్ కేవలం ఇలా ఫోన్ చేయడం, అనుమానించడం వంటి కారణాలతో విడిపోవడం గమనార్హం. అలా చెక్ చేయడంతో మనసు విరిగిపోయి తాము బంధానికి స్వస్తి పలికినట్లు 45శాతం మంది చెప్పడం విశేషం.
undefined
దీనిపై సైకాలజిస్టులు మాట్లాడుతూ... పార్ట్ నర్ అని అనుమానిస్తూ దొంగతనంగా ఫోన్ చెక్ చేయడం లాంటివి మంచిది కాదని చెప్పారు. అది అలవాటుగా మారిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. తొలుత ఫోన్ చెక్ చేయడం అలవాటుగా తర్వాత ప్రతి కదలిక మీదా కన్నేసి... ప్రతిదాన్నీ అనుమానించడం అలవాటు అయిపోతోందని హెచ్చరిస్తున్నారు. సో.. బీ కేర్ ఫుల్.
undefined
click me!