చర్చించడానికి, మాట్లాడటానికి ఇష్టపకడకపోయినా... మనిషికి తిండి, నిద్ర ఎంత ముఖ్యమో శృంగారం కూడా అంతే ముఖ్యం. అసలు అది లేకుండా... జీవి మనుగడే ఉండదు. కానీ అనాది నుంచి వస్తున్న ఆచారాల కారణంగా... దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదు.
తాజాగా ఓ సంస్థ శృంగారంపై ఓ సర్వే చేసింది. అందులో తేలిందేమిటంటే... సంసార జీవితం లో ఆనందంగా గడిపేవారే... వృత్తిపరంగానూ ముందుకు దూసుకుపోతారని చెబుతున్నారు.
ఈ సంగతి పక్కన పెడితే... హాయిగా నిద్రపోవాలని ఎవరైనా కోరుకుంటారు. మంచి నిద్ర పట్టాలంటే.. పడుకునే పరుపు మెత్తగా ఉండాలని కోరుకుంటాం. అయితే... అదే పరుపు శృంగారానికి మాత్రం పనికిరాదంటున్నారు కొందరు పురుషులు.
ఒకప్పుడైతే మెత్తని పరుపుపై పవళించాలని... దానిపై శృంగారం చేస్తే.. స్వర్గపు అంచుల్లో తేలినట్లు ఉంటుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.
మెత్తటి పరుపుల్లో జరిపే శృంగారకేళి.. పురుషులకు ఆసక్తికరంగా మార్చడం లేదట. స్వర్గ సుఖాలను అందించడం లేదట. తాజాగా కొన్ని సంస్థలు చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
చాలా మంది మగవారు.. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణమేంటా అని ఆరా తీస్తే.. పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
కాలంతో పాటు వచ్చిన మార్పులకు అనుగుణంగా.. మంచంపై వాడే పరుపుల్లోనూ మార్పులు వచ్చాయి. గతంలో దూది పరుపులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు కాయిర్, స్ప్రింగ్ పరుపులు వచ్చేశాయి.
దూది మెత్తగా ఉంటుంది, ఊగే గుణం ఉండదు. కానీ కాయిర్, స్ప్రింగ్‌లతో కూడిన పరుపులు అటూ ఇటూ ఊగే గుణం కలిగి ఉంటాయి.
ఇలాంటి మెత్తని పరుపులు శరీరానికి హాయినిస్తున్నాయే తప్ప శృంగారానికి ఏమాత్రం సౌకర్యంగా లేవని 68 శాతం పురుషులు అభిప్రాయపడుతున్నారు.
వీటి వల్ల భాగస్వామిపై చేరి రతిక్రీడ కొనసాగించడం సౌకర్యంగా ఉండడం లేదంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో భాగస్వామిని తమపై చేర్చుకుని ఉపరతి జరుపుతున్నారని.. పరిశోధనలో తేలిన అంశం. మొత్తంగా చూస్తే, మెత్తటి పరుపులు సంసార సుఖాన్ని తగ్గిస్తున్నాయన్నమాట.