Do not say these words if you are in angry
భార్యభర్తల మధ్య గొడవలు రావడం చాలా సహజం. ఆ గొడవల కారణంగా కోపతాపాలు కూడా పెరిగిపోతాయి. ఆ కోపంలో ఒకరికొకరు వాదించుకోవడం వల్ల.. సమస్య మరింత పెరుగుతుంది.చివరకు బంధానికి బీటలు పడే అవకాశం కూడా లేకపోలేదు. అలా కాకుండా.. భాగస్వామి కోపం తగ్గించే ప్రయత్నం చేస్తే... బంధం బలపడుతుంది. అయితే.. మీ భాగస్వామి కోపంలో ఉన్నప్పుడు వారి కోపాన్ని ఎలా పోగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం...
couple fight
మీ భాగస్వామి కోపంగా ఉన్నప్పుడు.. వాళ్లను మరింత రెచ్చగొట్టేలా మీరు మాట్లాడకూడదు. లిమిట్స్ క్రాస్ చేసి ప్రవర్తించొద్దు. దాని వల్ల మీ భాగస్వామి మరింత అగ్రెసివ్ గా ప్రవర్తించవచ్చు. మాటలు పెరుగుతాయి.. ఒక్కోసారి చేతలతో కూడా తమ కోపాన్ని చూపిస్తారు. కాబట్టి.. అది మీ బంధానికే సమస్య తెస్తుంది. కాబట్టి.. ఆ సిట్యువేషన్ ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మంచిగా మాట్లాడటానికి ప్రయత్నించండి.
మీ భాగస్వామి కోపంగా ఉన్నప్పుడు మీరు కూడా మీ టెంపర్ లూస్ అయితే.. పరిస్థితి దారుణంగా మారుతుంది. కాబట్టి.. వీలైనంత వరకు మీరు కూల్ గా ఉండటానికి ప్రయత్నించాలి. భాగస్వాముల్లో ఎవరైనా ప్రశాంతంగా , సంయమనంతో కూడిన ప్రవర్తనను పాటించాలి. ఇద్దరూ కంట్రోల్ తప్పి, అరుచుకుంటే తర్వాత మీరే బాధపడతారు.
మీ భాగస్వామి కోపంలో విచిత్రంగా ప్రవర్తించినప్పుడు,.. మీరు రియాక్ట్ అవ్వద్దు. మీరు కూడా రియాక్ట్ అవ్వడం వల్ల.. గొడవ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి... వీలైనంత వరకు మీరు రియాక్ట్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. దాని వల్ల సగం గొడవ తగ్గుతుంది. వారి కోపం తగ్గిన తర్వాత.. మీరు ప్రశాంతంగా ఆ విషయాన్ని వారికి వివరిస్తే సరిపోతుంది. రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినా.. మాట మాట్లాడే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలి.
ఒక వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు, దానిని అతని పాత్రతో విలీనం చేయవద్దు. వారి కోపాన్ని వ్యక్తిగతంగా తీసుకోకండి. వారి దూకుడు ప్రవర్తన లేదా కఠినమైన పదాలను అంతర్గతీకరించడం మానుకోండి. మీ భాగస్వామి ప్రవర్తన, ఆందోళనలను అర్థం చేసుకోవడం వారి పాత్ర గురించి అస్పష్టమైన తీర్పులను నిరోధించడానికి చాలా ముఖ్యం. క్లుప్తంగా చెప్పాలంటే, కోపాన్ని వ్యక్తి పాత్రకు జోడించకూడదు.
మీ భాగస్వామి కోపంలో ఉన్నప్పుడు వారి కోపం పెంచేలా గతంలో జరిగిన గొడవలను మళ్లీ తీసుకురాకూడదు. దాని వల్ల వాదనను మరింత తీవ్రతరం చేస్తుంది. సంఘర్షణను పెంచుతుంది. కాబట్టి.... మళ్లీ వాటిని తవ్వకుండా ఉండటమే మంచిది.