మీ సెక్స్ లైఫ్ ను మరింత రొమాంటిక్ గా మార్చే చిట్కాలివి..!

First Published | Mar 9, 2024, 3:08 PM IST

కొన్ని రోజుల తర్వాత సెక్స్ లైఫ్ బోరింగ్ గా అనిపించడం చాలా కామన్. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను ఫాలో అయితే మీ సెక్స్ లైఫ్ మరింత రొమాంటిక్ గా, ఇంట్రెస్టింగ్ మారుతుంది. ఇందుకోసం ఏం చేయాలంటే? 
 

భార్యాభర్తల మధ్య లైంగిక కార్యకలాపాలు చాలా  కామన్. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ సెక్స్ లైఫ్ బోరింగ్ అనిపించడం మొదలవుతుంది. కానీ భార్యాభర్తల మధ్య సెక్స్ లైఫ్ బాగుంటేనే మిగతా లైఫ్ సాఫీగా సాగుతుంది. అందుకే ఎప్పటికప్పుడు మీ సెక్స్ లైఫ్ ను మరింత రొమాంటిక్ గా, ఎనర్జిటిక్ గా చేయడానికి ప్రయత్నించాలి. నిజానికి సెక్స్ మీ ఇద్దరిని దగ్గర చేయడంతో పాటుగా  మీ ఆరోగ్యాన్ని కూడా  రక్షిస్తుంది. 
వారానికి ఒకటి రెండు సార్లు సెక్స్ లో పాల్గొనే వారికి వ్యాధులొచ్చే రిస్క్ తక్కువని ఎన్నో అధ్యయనాలు కూడా వెల్లడించాయి. 
 


సెక్స్ లైఫ్ ను  మరింత రొమాంటిక్ గా మార్చుకోవడం ఎలా?

రొమాంటిక్ సెక్స్ భార్యా భర్తలిద్దరికీ మంచి శారీరక ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ఇది ఇద్దరి మధ్య ప్రేమను కూడా పెంచుతుంది. అయితే ఈ రొమాంటిక్ సెక్స్ లో డ్రెస్సింగ్ స్టైల్, శారీరక సాన్నిహిత్యం,  కమ్యూనికేషన్ లు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఫోర్ ప్లే. దీనికి ఈ టైంలో మంచి మ్యూజిక్ మిమ్మల్ని మరింత రొమాంటిక్ గా మార్చేస్తుంది. మీరు ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనేలా చేస్తుంది. మరి మీ సెక్స్ లైఫ్ ను ఎలా మెరుగుపర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


Sex Life

ఫోర్ ప్లేతో.. 

సెక్స్ లో చాలా ముఖ్యమైన విషయం ప్రేమను, మీ అభిరుచిని మీ భాగస్వామికి తెలియజేయడం. ఇందుకోసం మీరు మెడ ముద్దు పెట్టడం, కౌగిలించుకోవడం, కళ్లలోకి చూడటం వంటివి ఉంటాయి. సెక్స్ లో పాల్గొనడానికి ముందు ఖచ్చితంగా ఫోర్ ప్లేలో పాల్గొనండి. ఇది మీ ఇద్దరికీ మంచి లైంగిక ఆనందాన్ని కలిగిస్తుంది. భావప్రాప్తి పొందడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఇది మీరు సెక్స్ ను ఎక్కువగా ఆస్వాధించడానికి కూడా సహాయపడుతుంది.

మానసిక స్థితిని సెట్ చేయండి

రొమాంటిక్ సెక్స్ కు మంచి ప్లేస్ అవసరం. అన్నింటికీ మించి ఫోన్లు, టీవీల శబ్ధం అక్కడ అసలే ఉండకూడదు. శృంగారాన్ని ఆస్వాధించడానికి డిమ్ లైట్ ను సెట్ చేయండి. అలాగే స్లో మ్యూజిక్ ప్లే చేయండి. బెడ్ రూం లో క్యాండిల్స్ ను వెలిగించండి. ఇది మీ ఇద్దరినీ మంచి రొమాంటిక్ మూడ్ లోకి తీసుకెళ్తుంది. 
 

 లైట్ ఆన్ చేయండి

చాలా మంది సెక్స్  సమయంలో లైట్స్ ఆన్ లో ఉండకూడదు అనే అనుకుంటారు. అసలు ఈ టైంలో లైట్స్ ఆన్ లో ఉండటానికి అస్సలు ఒప్పుకోరు. కానీ సెక్స్ ను మరింత రొమాంటిక్  గా చేయడానికి మీరు లైట్ ను ఆన్ చేయొచ్చు. క్యాండిల్, నైట్ లైట్, స్ట్రింగ్ లైట్లు లేదా పిల్లర్ కొవ్వొత్తులు ఎక్కువ లైటింగ్ ను కాకుండా.. మీరు సెక్స్ ఆస్వాధించేత వెలుగును ఇస్తాయి. ఇవి ఉండటం వల్ల మీరు ఒకరినొకరు చూసుకోవచ్చు. 

మీ అవసరాలను చెప్పండి

సంబంధంలో మీ బంధాన్ని బలంగా చేయడానికి మంచంపై రొమాంటిక్ గా ఉండటం చాలా అవసరం. ఇందుకోసం ఫోర్ ప్లే కీలక పాత్ర పోషిస్తుంది. శారీరక కనెక్షన్, మసాజ్ వంటి కార్యకలాపాలలో పాల్గొనండి. అలాగే మీ ఇష్టాఇష్టాలను మీ భాగస్వామికి ఖచ్చితంగా చెప్పండి. ముఖ్యంగా సెక్స్, శారీరక సాన్నిహిత్యం విషయంలో అస్సలు మొహమాట పడకూడదు. 
 

Latest Videos

click me!