అతిగా తాగడం ఆరోగ్యానికి హానికరమని, అది గుండెపోటు ముప్పును పెంచుతుందని చాలా మందికి తెలుసు. రోజుకు ఒకట్రెండు పెగ్గులు తాగితే ఆరోగ్యానికి మంచిదేనని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
రెండు పెగ్గులేసి శృంగారంలో పాల్గొంటే కేకో కేక అని అంటున్నారు విశ్లేషకులు . మద్యం అతిగా తాగితే ప్రమాదం కానీ శృతి మించకుండా రెండు పెగ్గులేసి శృంగారంలో పాల్గొంటే ఆ మజా నే వేరని అంటున్నారు పరిశోధకులు . పైగా మెట్రో నగరాల్లోనే కాకుండా ఓ మాదిరి నగరాల్లో కూడా ఈ కల్చర్ అలవాటయ్యిందని అంటున్నారు .
పెగ్గులు వేసేది కేవలం మగాళ్లు మాత్రమే కాదు సుమా ! ఆడవాళ్లు సైతం . మహిళలు కూడా రెండు పెగ్గులేసి బెడ్ మీదకి ఎక్కిస్తే ఆ కిక్కే వేరంట ! కిక్ లో ఉన్నప్పుడు దృష్టి మొత్తం శృంగారం మీద మాత్రమే ఉంటుందని , ఇతర అంశాలను పెద్దగా పట్టించుకోరని అంటున్నారు .
అంతేనా మనుషుల్లో ఆడవాళ్లు కానీ మగాళ్లు కానీ రకరకాల ఆకారాలతో ఉంటారు , కానీ మద్యం మత్తులో ఉన్నప్పుడు ఈ ఆకారాలు ఆకర్షణకు అడ్డు కావని కేవలం శృంగారం మీద మాత్రమే మనసు లగ్నమై ఉంటుందట .
అందుకే కాబోలు మహిళలు కూడా పెద్ద ఎత్తున మద్యానికి , సిగరేట్ లకు అలవాటు పడుతున్నారు . అయితే ఇది మితంగా ఉంటేనే అందం , మద్యం ఎక్కువైతే జీవితమే వ్యర్థం .
మద్యం మంచిదే అన్నారు కదా అని.. పీకలదాకా తాగేసి శృంగారంలో పాల్గొనాలని చూస్తే.. అసలుకే ఎసరు వచ్చే అవకాశం ఉంది. అంగ స్తంభన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
రోజుకు ఒకట్రెండు పెగ్గులు తాగితే గుండెపోటు ముప్పు 10 నుంచి 15 శాతం వరకు పెరుగుతుంది...రోజుకు నాలుగు పెగ్గులు తాగితే గుండెపోటు ముప్పు 35 శాతం పెరుగుతుంది.
ఈ అధ్యయనం ప్రకారం ఒక పెగ్గు(స్పిరిట్స్), సీసా బీరు, చిన్న గ్లాసంత వైన్ దాదాపు ఒకే ప్రభావాన్ని చూపుతాయి. ఈ మూడు రకాల మద్యాన్ని పరిశోధకులు పరిగణనలోకి తీసుకున్నారు.
అధ్యయనం ప్రకారం రోజుకు సగం సీసా వైన్ తాగితే గుండెపోటు ముప్పు 38 శాతం పెరుగుతుందని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ స్పీగెల్‌హాల్టర్ చెప్పారు
స్వల్పంగా లేదా ఓ మోస్తరుగా మద్యం తీసుకుంటే గుండెపోటు ముప్పు తగ్గుతుందనే దాఖలాలేవీ లేవని అధ్యయనం స్పష్టం చేసింది. గుండెపోటుకు సంబంధించి మద్యం ప్రభావాలపై పూర్తి స్పష్టత రాలేదని, వీటిని గుర్తించేందుకు రానున్న సంవత్సరాల్లో మరింత డేటాను సేకరించాల్సి ఉందని తెలిపింది.